టాలీవుడ్ లో బాలయ్య ఒక్కడూ ఒక సైడ్...మిగిలినవారు ఒక సైడ్
ఇక బాలయ్య అసెంలీలో చిరంజీవి మీద తాజాగా చేసిన కామెంట్స్ అయితే టాలీవుడ్ లో ప్రకంపనలు పుట్టించాయి. ఈ పరిణామం మీద టాలీవుడ్ అంతా గుంభనంగా ఉంది.;
అదేంటో టాలీవుడ్ లో కొత్త రకమైన వాతావరణం కనిపిస్తోంది. అయితే ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉందా ఇపుడే బయటపడిందా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైన టాలీవుడ్ లో కొత్తగా కొంత వరకూ ఒక అగాధం అయితే ఏర్పడింది అని అంటున్నారు. నిజానికి చూస్తే టాలీవుడ్ లో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. గతంలోలా పరిస్థితి అయితే లేదు ఒక వైపు సినిమాలు లేవు, మరో వైపు బడ్జెట్ పెరిగింది. తీసిన సినిమాలు కూడా కలెక్షన్లు లేక చతికిల పడుతున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు కొత్తగా బాలయ్య ఎపిసోడ్ కూడా తోడు అయింది అని అంటున్నారు. దాని వల్లనే అగాధం ఏర్పడింది అని అంటున్నారు.
బాబుకి మంచి సాన్నిహిత్యం :
ఇక టాలీవుడ్ లో చూసుకుంటే చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉంటూండంగానే మంచి రిలేషన్స్ కొనసాగిస్తూ వచ్చారు. ఆయనకు టాలీవుడ్ లో అందరితోనూ గుడ్ రిలేషన్స్ ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి లాంటి వారితో కూడా మంచిగా ఉంటూ వస్తున్నారు చంద్రబాబు. అంతే కాదు ఏపీలో 2024లో తొలిసారిగా రెండు పెద్ద కులాలను కలిపి మరీ బంపర్ విక్టరీ కొట్టారు. అలాగే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి నాలుగవ సారి సీఎం అయిపోయారు. ఇలా టాలీవుడ్ తో బాబు రిలేషన్స్ అన్నీ బాగానే వర్కౌట్ అవుతున్నాయని అంటున్నారు.
మెగాస్టార్ పెద్ద దిక్కుగా :
చాలా కాలంగా టాలీవుడ్ కి పెద్ద దిక్కుగా మెగాస్టార్ చిరంజీవి వ్యవహరిస్తున్నారు. ఆయన అందరి హీరోలతో కలసి మెలసి ఉంటూ వస్తున్నారు. ఎవరితో అయినా మంచిగా ఉండడమే కాకుండా ఎలాంటి భేషజాలకు పోని నైజమే చిరంజీవికి ఆ మర్యాద గౌరవం అందిస్తోంది అని అంటున్నారు. ఇక ఆయన వెనక బడా నిర్మాత అల్లు అరవింద్ ఉన్నారు ఆయన తనదైన వ్యవహార శైలితో ముందుకు సాగుతున్నారు. అదే తీరున దిల్ రాజు, సురేష్ బాబు లాంటి బడా నిర్మాతలు కానీ నాగార్జున వెంకటేష్ మహేష్ బాబు, ప్రభాస్ వంటి టాప్ హీరోలు కానీ అంతా ఒక్కటిగా కలసి మెలసి ఉంటున్నారు. టాలీవుడ్ లో ఏమి జరిగినా వీరంతా ఒక్కటిగా కనిపిస్తూంటారు. వీరంతా కూడా చిరంజీవికి ఎంతో రెస్పెక్ట్ ఇస్తూంటారు.
ఫ్యాన్స్ ఫైటింగ్ లేదు :
గతంలో చూస్తే అభిమానులు ఆయా హీరోల మధ్య విభేదాలతో పై స్థాయిలో కూడా హీరోల మధ్య అలాగే ఉండేది. కానీ ఇపుడు న్యూ కల్చర్ వచ్చింది. దాంతో హీరోలు అంతా ఒక్కటిగానే ఉంటున్నారు. ఎవరి మధ్యనా ఫ్యాన్స్ మూలంగా విభేదాలు అయితే లేవు అని అంటున్నారు. అంతే కాదు ఎవరికి వారుగా ఎదగాలని కాస్తా బిజినెస్ టైప్ తోనే ఆలోచిస్తున్నారు.
బాలయ్య అసెంబ్లీ ఎపిసోడ్ తో :
ఇక బాలయ్య అసెంలీలో చిరంజీవి మీద తాజాగా చేసిన కామెంట్స్ అయితే టాలీవుడ్ లో ప్రకంపనలు పుట్టించాయి. ఈ పరిణామం మీద టాలీవుడ్ అంతా గుంభనంగా ఉంది. పైకి ఎవరూ పెదవి విప్పడం లేదు కానీ ఎవరి ఆలోచనలు ఈ విషయంలో వారికి ఉన్నాయని అంటున్నారు. అంతే కాదు ఈ సంఘటన తరువాత దాదాపుగా బాలయ్య ఒంటరిగా అయిపోయారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సినిమాల పైరసీకి సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేస్తే దానికి టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా హాజరయ్యారు. ఒక్క బాలయ్య మాత్రం కనిపించలేదు. దీనిని చూసిన వారు బాలయ్య ఒంటరి అయ్యారా అన్న చర్చను ముందుకు తెస్తున్నారు.
పవన్ ని కలిసిన బాబు :
మరో వైపు చూస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలసి మాట్లాడారు. పవన్ కి ఒంట్లో బాగులేదని బాబు పరామర్శించారు అని పైకి కనిపిస్తున్నా లోపల బాలయ్య అసెంబ్లీ ఎపిసోడ్ మీదనే చర్చ సాగింది అని ప్రచారం సాగింది అని అంటున్నారు. ఇలా పవన్ కి బాగా ప్రయారిటీ ఇచ్చేలాగానే ఈ సన్నివేశం కనిపిస్తోంది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో చూస్తే కనుక బాలయ్య ఈ పరిణామాల మీద కోపంగా ఉన్నారని కూడా ప్రచారం సాగుతోంది.
బాలయ్య ఆగ్రహంగా :
మరో వైపు చూస్తే టాలీవుడ్ లో మాకు ఒక చరిత్ర ఉందని, అలాంటిది తాను ఏదో అసెంబ్లీలో ఒక మాట అంటే దాని మీద సోషల్ మీడియాలో పెద్దగా చేసి తన ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నారు అని బాలయ్య ఆగ్రహంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. మరో వైపు చూస్తే బాలయ్య ఆగ్రహంగా ఉన్నా కూడా అటు టాలీవుడ్ లో కానీ ఇటు పాలిటిక్స్ లో కానీ పరిణామాలు అయితే చకచకా సాగిపోతున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో బాలయ్య మాత్రం ఒంటరి అయ్యారని అంటున్నారు. సినీ రాజకీయ రంగాలలో రాణించిన ఎన్టీఆర్ వారసుడిగా బాలయ్య ఇపుడు ఏ రకమైన ఆలోచన చేస్తారు అన్నదే అంతా చర్చగా ఉంది.