• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పైన బీజేపీ.. కింద...

పైన బీజేపీ.. కింద కాంగ్రెస్...టాలీవుడ్ నలుగుడే మరి !

| కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య టాలీవుడ్ ఇరకాటంలో పడుతోందనే చర్చ సాగుతోంది. హైదరాబాద్‌లో వేల కోట్ల ఆస్తులు, వ్యాపారాలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు అవసరం కాగా, పాన్ ఇండియా సినిమాల కోసం కేంద్రంతోనూ సఖ్యత తప్పనిసరిగా మారింది. దీంతో రాజకీయ విమర్శలు ఎదుర్కోకుండా అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను బ్యాలెన్స్ చేయడం సినీ ప్రముఖులకు సవాలుగా మారింది.

By - Satya P
Update: 2026-11-27 17:15 GMT

పైన చూస్తే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అత్యంత పవర్ ఫుల్ గా ఉంది. ఇక తెలంగాణాలో చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం డైనిమిక్ లీడర్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో బలంగా ఉంది. ఈ రెండు ప్రభుత్వాల మధ్య టాలీవుడ్ హీరోలు సెలిబ్రిటీలు నలిగిపోతున్నారా అంటే అవును అనే జవాబు వస్తోంది. బీజేపీకి కాంగ్రెస్ కి ఉప్పు నిప్పులా ఉంటుంది. కానీ ఈ రెండు ప్రభుత్వాలతో టాలీవుడ్ కి పెద్ద పనే ఉంది. ఎందుకంటే టాలీవుడ్ ఇపుడు ప్రాంతీయానికే పరిమితం అయి లేదు, పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు తీస్తోంది. అందువల్ల కేంద్రం చల్లని చూపు కూడా కావాలి. ఇక తెలంగాణలో టాలీవుడ్ స్థిరపడి ఉన్నా కూడా అత్యధిక శాతం నటులు టెక్నీషియన్లు ఇతరత్రా అంతా ఆంధ్రాకు చెందిన వారే, క్రిష్ణా గుంటూరు, గోదావరి రాయలసీమల నుంచి వచ్చిన వారే. దాంతో పాటు తెలంగాణాలోనే అస్థిత్వం ఆస్తులు అన్నీ ఉన్నాయి. ఈ క్రమంలో తెలంగాణ లో ఎవరు అధికారంలో ఉన్నా కలసి మెలసి మెలగాల్సి ఉంది. అదే సమయంలో తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తున్న కేంద్ర బీజేపీ పెద్దలతోనూ ఎంతో సామరస్యంగా ఉండాల్సి వస్తోంది.

చిత్ర సీమకు చిత్రమైన స్థితి :

నిజానికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ రాజకీయాలకు అతీతంగానే ముందుకు సాగుతుంది. అయితే అదే సినీ సీమ నుంచి నటులు రాజకీయాల్లో ఉన్నారు. కొందరు అధికార పదవుల్లో ఉన్నారు. అయినా సరే ఎక్కడా తేడా పాడా రాకుండా టాలీవుడ్ ఒక్కటిగా సాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో టాలీవుడ్ నుంచి మంచి సంబంధాలు కోరుకుంటోంది. అదే సమయంలో ప్రభుత్వ విధానాలను కచ్చితంగా అమలు చేస్తోంది. దీంతో టాలీవుడ్ హీరోలతో పాటు అంతా చిత్రమైన రాజకీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

జై కొట్టాల్సిందే :

కేంద్రంలో బీజేపీకి రాష్ట్రంలో కాంగ్రెస్ కి టాలీవుడ్ హీరోలు జై కొట్టాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. పైకి గ్లామర్ ప్రపంచంగా ఉంటుంది. కోట్ల రూపాయలతో వ్యాపారం అని కనిపిస్తుంది. కానీ స్టార్ హీరోలు తెర వెనక ఎదుర్కొంటున్న రాజకీయ ఒత్తిడి మామూలు కాదని అంటున్నరు. ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుతం టాలీవుడ్ అగ్రనటుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారు అయిందనే చర్చ ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. బలమైన ప్రభుత్వాలు శక్తివంతమైన పదవులలో ఉన్న వారి మధ్య టాలీవుడ్ ఒక విధంగా నలిగిపోతోంది అని అంటున్నారు.

మ్యాటర్ అంతా అక్కడే :

విషయం ఏమిటి అంటే టాలీవుడ్ లో మెజారిటీ ప్రముఖుల . మూలాలు ఆంధ్రాలోనే ఉన్నాయి. ఇక వారి ఆస్తులన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. దాంతో అక్కడే అసలు చిక్కు వచ్చి పడుతోంది. ఒక విధంగా చూస్తే వేల కోట్ల ఆస్తులు స్టూడియోలు రియల్ ఎస్టేట్ ఇలా చూస్తే బడా హీరోలు బిగ్ షాట్స్ అంతా గత మూడు దశాబ్దాలుగా టాలీవుడ్ హైదరాబాద్ కేంద్రంగా స్థిరపడటంతో అక్కడే వారికి భవిష్యత్తు అంతా ఉంది. ఇక హీరోలు, నిర్మాతల ఇళ్లు, ఫామ్‌హౌస్‌లు, ఫిల్మ్ స్టూడియోలు, మల్టీప్లెక్స్‌లు, కన్వెన్షన్ సెంటర్లు ఇలా వేలాది కోట్ల రియల్ ఎస్టేట్ పెట్టుబడులన్నీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి. దాంతో మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది అంటున్నారు

సున్నితమైన సెంటిమెంట్ :

ఇక తెలంగాణా ఆంధ్రా అన్న ప్రాంతీయ సెంటిమెంట్ ఎంతో సున్నితమైనది అన్నది తెలిసిందే. ఉద్యమ కాలం నాటి పరిస్థితులు అందరికీ తెలిసిందే. ఇక తమ మూలాలు ఆంధ్రాలో ఉండి ఆస్తులన్నీ తెలంగాణలో ఉండటంతో టాలీవుడ్ బిగ్ షాట్స్ అంతా తెలంగాణా ప్రభుత్వాలతో ఏమాత్రం విభేదాలు వచ్చినా నాన్-లోకల్ అన్న ముద్ర పడిపోతుంది. లేదా ఆక్రమణల పేరుతో ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో అనే అభద్రతా భావం నిత్యం వారికి ఉంటోంది. ఇక వెనక్కి వెళ్ళి చూస్తే నాగార్జున ఎన్-కన్వెన్షన్ కూల్చివేత ఎపిసోడ్ కానీ హీరో అల్లు అర్జున్ అరెస్టు వివాదం కానీ ఇలాంటి పరిణామాల తర్వాత టాలీవుడ్ పెద్దలలో ఈ తరహా భయాలు మరింత ఎక్కువ అయ్యాయని అంటున్నారు.

దయ అవసరం కూడా :

ఒక వైపు చూస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ మరో వైపు కేంద్రంలో బీజేపీ దాంతో భిన్న ధృవాలుగా ఉన్న రెండు పార్టీల రాజకీయాన్ని బ్యాలెన్స్ చేయలేక టాలీవుడ్ పెద్దలు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు అని అంటున్నారు. వెనక్కి వెళ్తే ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండేది అంతే కాదు మేనేజ్ చేయడం కూడా సులువుగా ఉండేది. ఆ తర్వాత పదేళ్లు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీతో సత్సంబంధాలు కొనసాగించారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయిందని అంటున్నారు. సినిమా షూటింగ్‌లకు అనుమతులు కావాలన్నా పెద్ద సినిమాలకు టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోలకు పర్మిషన్లు రావాలన్నా రాష్ట్ర ప్రభుత్వ దయ ఉండాల్సిందే అని చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఉన్న తమ ఆస్తులు, వ్యాపారాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలంటే స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వంతో సామరస్యంగా మెలగాల్సి ఉంటోంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన ప్రతి కార్యక్రమానికి హాజరవ్వడం తప్పనిసరి అవుతోంది. అంతే కాదు రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు మద్దతుగా వీడియోలు చేయడం వంటివి అనివార్యంగా నైనా చేయాల్సి వస్తోంది.

కేంద్రం విషయంలోనూ :

ఇక కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతోనూ అలాగే మెలగాల్సి ఉంటోంది. ఈ రోజు తెలుగు సినిమాలు కేవలం ప్రాంతీయ సినిమాలే కాదన్నది తెలిసిందే. వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పాన్-ఇండియా ప్రాజెక్టులుగా ఉన్నాయి. ఇక ఈ సినిమాల ఆర్థిక లావాదేవీలు, ఐటీ , ఈడీ , జీఎస్టీ వంటి దర్యాప్తు సంస్థలన్నీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేతిలో ఉంటాయన్నది తెలిసిందే. అంతేకాకుండా, హిందీ బెల్ట్‌లో సినిమాలు ఆడాలన్నా జాతీయ అవార్డులు, పద్మ పురస్కారాలు రావాలన్నా కేంద్ర పెద్దల గుడ్ లుక్స్‌లో ఉండటం అత్యవసరంగా భావిస్తున్నారు.రాజకీయ పరిణామాలు చూస్తే కనుక జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ బద్ధ శత్రువులు. తెలంగాణలోనూ ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. మరి ఈ రెండు పార్టీలతో సఖ్యత మాత్రం టాలీవుడ్ కి తప్పనిసరి అవుతోంది అంటే అదే చిత్రం. ఒక హీరో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పొగిడితే చాలు వెంటనే బీజేపీ శ్రేణులు సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆ హీరోను టార్గెట్ చేస్తున్నాయి. అదే అదే హీరో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీనో, అమిత్ షానో కలిసి జై కొడితే, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ వర్గాలకు ఉన్నట్లుండి కోపం వస్తోందని అంటున్నారు.

ఏపీతో కూడా బ్యాలెన్స్ :

ఇక ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఉంది. దాంతో అక్కడా బ్యాలెన్స్ చేయాల్సి వస్తోంది అంటున్నారు. ఈ క్రమంలో ఏ వేదికను ఎక్కి మాట్లాడినా ఏ ట్వీట్ వేసినా కూడా హీరోలు ఆచీ తూచీ వ్యవహరించాల్సి వస్తోంది. వెండి తెర మీద అంతా తామై షో చేసే హీరోలు నిజ జీవితంలో మాత్రం రాజకీయ చందరంగంలో తామే ఇరుక్కు పోతున్నారు. ఒక విధంగా ఇది బ్యాలెన్స్ యాక్టింగ్ అని కూడా అనాల్సి వస్తోంది. మరి ఇది ఎంతకాలం అన్నది కాలమే జవాబు చెప్పాలని అంటున్నారు.

Tags:    
  • tollywood 
  • telugucinema 
  • tollywoodstars 
  • bjp 
  • congress 
  • revanthreddy 

Similar News

తేడా ఎక్కడ కొట్టింది... జనసేనలో అంతర్మధనం

2026-11-27 17:14 GMT

సినిమా డైలాగులు వేరు.. అసలు రాజకీయం వేరు సీఎం విజయ్..

2026-11-27 17:14 GMT

బయట తింటేనే కాదు.. ఇంట్లో వండుకున్నా ప్రాణాలకు ముప్పేనా? హైదరాబాద్ లో ఏంటీ దారుణం?

2026-11-27 17:12 GMT

జనసేన సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్...పంచాయతీలలో సీన్ రివర్స్ !

2026-11-27 17:11 GMT

పాత కెప్టెన్ కే మళ్లీ పట్టాభిషేకం.. ముంబై ఇండియన్స్ లో రోహిత్ శకం..

2026-11-27 12:47 GMT

ఏపీకి 38, తెలంగాణకు 26 ఎంపీ సీట్లు.. లోక్‌సభలో 50 శాతం పెంపునకు కేంద్రం ఆమోదం!

2026-11-27 12:33 GMT

పంచాయితీ సమరం : టీడీపీ ఎందుకు గెలిచింది? వైసీపీ ఎందుకు ఓడింది?

2026-11-27 12:21 GMT

డీలిమిటేషన్‌తో దక్షిణాదికి రాజకీయ పరీక్ష.. ఉత్తరాది సీట్ల బలానికి దక్షిణాది అడ్డుకట్ట వేయగలదా?

2026-11-27 11:15 GMT

తిరుపరంకుండ్రం దీపం వివాదం.. తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి హెచ్చరిక!

2026-11-27 09:58 GMT

గ్రామాల్లో వైసీపీకి గడ్డుకాలం.. జగన్‌కు అసలు పరీక్ష ఇప్పుడే మొదలైందా?

2026-11-27 09:31 GMT

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పరిస్థితి ఏంటి? అసలు డిపాజిట్ అయినా దక్కుతుందా?

2026-11-27 09:31 GMT

Copyright @2026

Powered by Blink CMS