• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  గ్రామాల్లో వైసీపీకి...

గ్రామాల్లో వైసీపీకి గడ్డుకాలం.. జగన్‌కు అసలు పరీక్ష ఇప్పుడే మొదలైందా?

| ఏపీ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఓటు బ్యాంకు 39 శాతం నుంచి 24.6 శాతానికి పడిపోయినట్లు కథనం పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ పట్టు తగ్గడంపై చర్చ జరుగుతోంది. కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వడం, స్థానిక నాయకులను బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై పోరాడటం జగన్‌కు కీలక సవాలుగా మారాయి.

By - A.N.Kumar
Update: 2026-11-27 09:31 GMT

జరిగినవి పంచాయితీ ఎన్నికలు.. అక్కడ పార్టీలుండవు.. కానీ పనిచేసిన నేత ఉంటాడు. అతడి వెనుక పార్టీ ఉంటుంది. ఎవరైతే ప్రజలకు మంచి చేస్తారో పార్టీలకు అతీతంగా వారినే పల్లెల్లో గెలిపిస్తారు. దానికి టీడీపీ, జనసేన, వైసీపీ అన్న తేడాలు చూడరు.. కానీ అధికారంలో లేకున్నా ఇక్కడ కూడా వైసీపీ ఓడిపోవడం అంటే.. ఆ నేతలు జనాలకు దూరంగా ఉన్నట్టే లెక్క.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అధికారం కోల్పోవడం ఒక కోణమైతే.. పల్లెలపై పట్టు సడలడం ఆ పార్టీకి చావుదెబ్బతో సమానం... ఒకప్పుడు వైఎస్సార్‌సీపీకి కంచుకోటలా నిలిచిన గ్రామీణ ఓటు బ్యాంకు ఇప్పుడు క్షీణిస్తోందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తాజాగా వెలువడిన తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి పలు కీలక ప్రశ్నలను సంధిస్తున్నాయి.

గత ఎన్నికల్లో దాదాపు 39 శాతం ఓటు బ్యాంకును కైవసం చేసుకున్న వైఎస్సార్‌సీపీ.. తాజా పంచాయతీ తొలి విడత ఫలితాల్లో 24.6 శాతానికి పడిపోవడం అందరినీ షాక్ కు గురిచేసింది.. సుమారు 14.4 శాతం తగ్గుదల సాధారణ విషయం కాదు. పంచాయతీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలతో సమానం కాకపోయినా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజానాడిని పసిగట్టడానికి ఇవి కీలక కొలమానాలు. స్థానిక అభ్యర్థుల బలం, సామాజిక సమీకరణాలు ప్రభావం చూపినప్పటికీ ఇంత భారీ వ్యత్యాసం పార్టీకి హెచ్చరిక సంకేతమే.

గ్రామాల్లో జెండా మోసే కార్యకర్తలు పార్టీకి ప్రాణం. గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ వ్యవస్థపై అధికంగా ఆధారపడటం వల్ల సంప్రదాయ కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం దక్కలేదనే అసంతృప్తి వినిపించింది. ప్రతిపక్షంలో ఉన్న ఈ సమయంలో క్షేత్రస్థాయి శ్రేణులకు భరోసా కల్పించి వారిని తిరిగి క్రియాశీలంగా మార్చడం పార్టీకి అత్యవసరం.

ప్రతి నిర్ణయం అధిష్ఠానం నుంచే రావడం.. స్థానిక నాయకుల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యం దక్కకపోవడం వల్లే వైసీపీ క్షేత్రస్థాయిలో బలహీన పడి ఓడిపోయిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.. మరోవైపు గ్రామీణ ఓటరు కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు..

ఉపాధి అవకాశాలు.. ప్రభుత్వ సేవల అందుబాటు.. స్థానిక నాయకుల స్పందనను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.

ప్రతిపక్షంలో ఉండటం అంటే ప్రభుత్వ విమర్శలకే పరిమితం కాకుండా ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాడటం కూడా అంతే కీలకం. పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేస్తూ ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండటం ద్వారానే పునరుజ్జీవం సాధ్యమవుతుంది.

అధికారం కోల్పోవడం తాత్కాలికం కావచ్చు.. కానీ గ్రామీణ ఓటు బ్యాంకును.. క్యాడర్‌ను నిలబెట్టుకోవడమే వైఎస్ జగన్ ముందున్న అసలైన రాజకీయ పరీక్షగా చెప్పొచ్చు.

Tags:    
  • ysrcp 
  • ysjagan 
  • andhrapradesh 
  • panchayatelections 
  • aplocalbodypolls 

Similar News

డీలిమిటేషన్ బిల్లుకు వైసీపీ మద్దతు.. కానీ ఒక షరతు!

2026-11-27 07:57 GMT

పంచాయ‌తీ ఫ‌లితం: వైసీపీ పుంజుకుందా?

2026-11-27 05:52 GMT

''మేం అధికారంలోకి వ‌స్తే.. వాళ్ల‌ను చెప్పుల‌తో కొడ‌తాం''

2026-11-27 03:58 GMT

జగన్ పాదయాత్రకు పోటీగా షర్మిల...విజయసాయి ?

2026-11-27 03:57 GMT

కలసి ఉండాల్సిందే...బాబు పవన్ బీజేపీ ఈక్వేషన్స్ ఇవే !

2026-11-27 02:30 GMT

షర్మిలకు వైఎస్ ఇచ్చిన ఆస్తులు ... చిట్టా విప్పిన రాచమల్లు

2026-11-27 02:30 GMT

రేవంత్ రెడ్డికి జగన్ కౌంటర్...మౌనం వీడినట్లేనా ?

2026-11-27 02:29 GMT

కాంగ్రెస్ కి బాబు దగ్గరట...జగన్ దూరమట !

2026-11-26 17:39 GMT

టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి భారీ మొత్తం.. గ్రూప్ ఇన్సూరెన్స్ కే 191 శాతం నిధులు!

2026-11-26 10:19 GMT

తిరుమలేశుడికి 121 కేజీల బంగారం ఇచ్చింది ఎవరో తెలుసా? ఎందుకిచ్చాడంటే?

2026-11-26 09:03 GMT

కూటమిలో జనసేన పంచాయితీ.. సేనాని పవర్ ఫుల్ వ్యూహమేనా?

2026-11-26 08:57 GMT

Copyright @2026

Powered by Blink CMS