• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  రేవంత్ రెడ్డికి జగన్...

రేవంత్ రెడ్డికి జగన్ కౌంటర్...మౌనం వీడినట్లేనా ?

| వైఎస్ జగన్ కృష్ణా జలాల వివాదంపై సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ కొత్త నీటి కేటాయింపుల కోసం కాదని, ఏపీకి ఇప్పటికే కేటాయించిన కృష్ణా జలాలను సమర్థంగా వినియోగించుకునేందుకేనని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా నిలిచిపోయిన ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

By - Satya P
Update: 2026-11-27 02:29 GMT

తెలంగాణా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కౌంటర్ ఇచ్చారు. జల వివాదాలకు సంబంధించి ఏపీని ఆక్షేపిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరుని ఒక సుదీర్ఘమైన ట్వీట్ ద్వారా జగన్ ఎండగట్టారు. నిజానికి గత కొంతకాలంగా ఏపీలోని రాయలసీమ లిఫ్ట్ స్కీమ్‌పై రాజకీయ వివాదం కొనసాగుతోంది. తెలంగాణాకు చెందిన కాంగ్రెస్ నాయకులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ విషయంలో చేస్తున్న కామెంట్స్ కి జగన్ తన ట్వీట్ ద్వారా జవాబు చెప్పారని అంటున్నారు. ఒక విధంగా చూస్తే జగన్ మౌనాన్ని వీడి ఘాటుగా స్పందించారు అని అంటున్నారు.

వాస్తవాలు దాచి పెట్టి :

రాయలసీమ లిఫ్ట్ స్కీమ్‌పై వాస్తవాలు దాచి పెడుతున్నారని జగన్ ఫైర్ అయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు కూడా ఈ విషయంలో ఏమీ మాట్లాడకపోవడాన్ని జగన్ ఆక్షేపించారు. అంతే కాదు కాంగ్రెస్ తో తనకు ఉన్న సన్నిహిత సంబంధాలను కాపాడుకోవడానికే బాబు సైలెన్స్ పాటిస్తున్నారు అని జగన్ విమర్శించారు. ఇంతకీ రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఉద్దేశ్యం ఏమిటో కూడా జగన్ వివరించారు. ఇది కొత్త సాగు నీటి ప్రాజెక్ట్ కానే కాదని జగన్ అన్నారు. పైగా ఇందులో అదనపు నీటి కేటాయింపులు కానీ కొత్త కాలువలు జలాశయాలు ఆయకట్టు వంటివి ఏవీ లేవని జగన్ స్పష్టం చేశారు. రాయలసీమలో ప్రస్తుతం ఉన్న పోతిరెడ్డిపాడు కాలువ వ్యవస్థ ద్వారా రాయలసీమకు కృష్ణా నీటి వాటాను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడం కోసం సహాయపడటానికి మాత్రమే ఈ ప్రాజెక్టును రూపొందించారని జగన్ వివరించారు.

నీటి వాటా తగ్గుతోంది :

ఇదిలా ఉంటే కృష్ణా జలాల విషయంలో ఎగువ రాష్ట్రాల నుంచి నీటి ప్రవాహం తక్కువగా వస్తూండడాన్ని ఆయన గుర్తు చేశారు. అందుకే గడచిన కొన్నేళ్లుగా ఏపీకి చేరే కృష్ణా నీటి పరిమాణం తగ్గుతూ వస్తోందని జగన్ గుర్తు చేశారు. మరో వైపు తెలంగాణా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరుతో తమకు అందుబాటులో ఉన్న నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తోందని అన్నారు. ఈ క్రమంలోనే ఏపీకి కేటాయించిన వాటాను వినియోగించుకోవడం కష్టంగా మారిందని జగన్ విమర్శించారు. అందువల్లనే శ్రీశైలం జలాశయం పూర్తి సామర్థ్యం 44 వేల క్యూసెక్కులతో నీటిని తోడాలంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు జలాశయం నీటిమట్టం కనీసం 880 అడుగులు ఉండాలని జగన్ చెప్పుకొచ్చారు. అలా నీటిమట్టం 854 అడుగుల కంటే తక్కువకు పడిపోతే, నీటిని తోడటం సాధ్యం కాదని అన్నారు. ఈ కారణం వల్లనే . ద రాయలసీమ తాగు నీటి సాగు నీటి అవసరాలను తీర్చడం మరింత కష్టమవుతోంది అని జగన్ పేర్కొన్నారు.

అందుకే లిఫ్ట్ స్కీమ్‌ :

ఇక ఈ ఇబ్బందులు అన్నీ అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా రాయలసీమ లిఫ్ట్ స్కీమ్‌ను ప్రణాళిక చేశామని జగన్ వెల్లడించారు. మరో వైపు చూస్తే జలాశయం నీటిమట్టం తక్కువగా ఉన్నప్పటికీ కూడా పాలమూరు-రంగారెడ్డి, దిండి, కల్వకుర్తి, ఎస్ఎల్‌బిసి వంటి వివిధ ప్రాజెక్టుల ద్వారా శ్రీశైలం నుంచి ప్రతి రోజూ దాదాపు మూడు టీఎంసీల నీటిని తోడటానికి తెలంగాణకు ప్రణాళికలు ఉన్నాయని కూడా జగన్ గుర్తు చేశారు. దాంతో అక్కడ జలాశయాలలో నీటిమట్టాలు తక్కువగా ఉండటం వల్ల పోతిరెడ్డిపాడు గుండా నీరు ప్రవహించలేనప్పుడు ఈ ప్రాజెక్ట్ నీటిని ఎత్తిపోసి ఇప్పటికే ఉన్న కాలువల వ్యవస్థలోకి పంప్ చేసి అప్పటికే వాడుకలో ఉన్న జలాశయాలకు ఈ లిఫ్ట్ స్కీమ్‌ ద్వారా సరఫరా చేస్తుందని ఆయన అన్నారు. ఎలాంటి అదనపు నీటి కేటాయింపులను కానీ కొత్త జలాశయాలను కోరని ఈ పథకం మీద తెలంగాణాకు వచ్చిన నష్టం ఏమిటని జగన్ నిలదీశారు. ఏపీకి ఇప్పటికే కేటాయించిన నీటిని రాయలసీమకు అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు.

కూటమి నిలిపివేసింది :

ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టు పూర్తి కావస్తున్న సమయంలో ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ పనులను నిలిపివేయడాన్ని కూడా జగన్ ఈ సందర్భంగా విమర్శించారు. కేవలం వైసీపీకి ఈ ఘనత దక్కకూడనే చంద్రబాబు ఇలా చేశారు అని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రాజెక్ట్ విషయంలో రాజకీయాలను పక్కన పెట్టి పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మొత్తానికి తొలిసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏపీలో విపక్ష నేత జగన్ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు అని అంటున్నారు.

Tags:    
  • ysjagan 
  • revanthreddy 
  • rayalaseemaliftscheme 
  • krishnawatersdispute 
  • andhrapradesh 

Similar News

కలసి ఉండాల్సిందే...బాబు పవన్ బీజేపీ ఈక్వేషన్స్ ఇవే !

2026-11-27 02:30 GMT

షర్మిలకు వైఎస్ ఇచ్చిన ఆస్తులు ... చిట్టా విప్పిన రాచమల్లు

2026-11-27 02:30 GMT

కాంగ్రెస్ కి బాబు దగ్గరట...జగన్ దూరమట !

2026-11-26 17:39 GMT

టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి భారీ మొత్తం.. గ్రూప్ ఇన్సూరెన్స్ కే 191 శాతం నిధులు!

2026-11-26 10:19 GMT

తిరుమలేశుడికి 121 కేజీల బంగారం ఇచ్చింది ఎవరో తెలుసా? ఎందుకిచ్చాడంటే?

2026-11-26 09:03 GMT

కూటమిలో జనసేన పంచాయితీ.. సేనాని పవర్ ఫుల్ వ్యూహమేనా?

2026-11-26 08:57 GMT

ఎవరీ జగన్ మోహన్... విజయసాయి నోట అదే పిలుపు !

2026-11-26 05:38 GMT

లోకేష్ మమేకం.. ఇతర పార్టీలూ నేర్చాల్సిందే !

2026-11-26 03:50 GMT

విశాఖ మేయర్...వెరీ పవర్ ఫుల్ !

2026-11-26 03:50 GMT

ఢిల్లీకి ఫిర్యాదు...ఏపీ బీజేపీ నేతల వ్యూహం

2026-11-26 03:49 GMT

ఎందుకు ధిక్కరించానో పవన్ కే చెబుతా !

2026-11-26 03:44 GMT

Copyright @2026

Powered by Blink CMS