• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  District News >  Tamil Nadu >  తిరుపరంకుండ్రం దీపం...

తిరుపరంకుండ్రం దీపం వివాదం.. తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి హెచ్చరిక!

| తమిళనాడులోని తిరుపరంకుండ్రం కొండపై నవంబర్ 28న దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్గాకు కనీసం 50 మీటర్ల దూరంలో ఏర్పాట్లు చేయాలని, ఆలయం, దర్గాకు CRPF భద్రత కల్పించాలని సూచించింది. గత ఆదేశాలు అమలు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ తమిళనాడు సీఎస్ వివరణ కోరింది.

By - Tupaki Desk
Update: 2026-11-27 09:58 GMT

తమిళనాడులోని తిరుపరంకుండ్రం కొండపై దీపం వెలిగించే విషయంలో మరోసారి ఉత్కంఠ నెలకొంది. ఈ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 24న దీపథూన్ వద్ద దీపం వెలిగించాల్సి ఉన్నప్పటికీ, కోర్టు ఆదేశాలు అమలు కాకపోవడంపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. నవంబర్ 28న దీపం వెలిగించేలా తాజా ఆదేశాలు ఇచ్చింది.

దర్గా నుంచి కనీసం 50 మీటర్ల దూరంలో దీపం వెలిగించే ఏర్పాట్లు చేయాలని కోర్టు సూచించింది. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు మాజీ న్యాయమూర్తులను నియమించడంతో పాటు, ఆలయం, దర్గాకు CRPF భద్రత కల్పించాలని ఆదేశించింది.

విచారణ సందర్భంగా జస్టిస్ అరవింద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎవరూ తమ ఇష్టానుసారం మార్చలేరని స్పష్టం చేశారు. అధికారుల హోదాతో సంబంధం లేకుండా కోర్టు ఉత్తర్వులను అమలు చేయాల్సిందేనని హెచ్చరించారు. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో తమిళనాడు అధికారులను ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరణ ఇవ్వాలని కూడా ఆదేశించింది.

మరోవైపు, ఈ అంశంపై తమిళనాడులో రాజకీయ వివాదం కూడా కొనసాగుతోంది. ప్రభుత్వం మాత్రం కొండపై సాధారణంగా దీపం వెలిగించే ప్రాంతంలోనే దీపం వెలిగించామని చెబుతోంది. వివాదాస్పద రాతి స్తంభం బ్రిటిష్ కాలం నాటి సర్వే రాయి మాత్రమేనని వాదిస్తోంది.

ఇప్పుడు సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో నవంబర్ 28న దీపం వెలిగింపు ఎలా జరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వివాదానికి ఎలాంటి పరిష్కారం లభిస్తుందో చూడాలి.

Tags:    
  • tirupparankundram 
  • supremecourt 
  • deepamrow 
  • tamilnadu 

Similar News

వెలగని దీపం.. రగిలిన వివాదం.. తిరుపరంకుండ్రంలో భక్తుల ఆందోళన.. పోలీసుల రంగప్రవేశం

2026-11-24 17:15 GMT

త్రిష మరో జయలలిత...పోలిక బాగానే ఉంది కానీ ?

2026-11-24 03:46 GMT

జయలలిత బాటలో త్రిష.. సీఎం విజయ్ కు షాకేనా? అసలు వ్యూహమేంటి?

2026-11-23 17:00 GMT

స్టాలిన్ రిస్క్ చేస్తారా...ఊరిస్తున్న కొళత్తూరు

2026-11-22 04:16 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

కొబ్బరికాయ కోసం రూ.2.50 లక్షలు ఖర్చు.. దీని కథేంటి తెలుసా?

2026-11-17 17:33 GMT

మెకెదాటు ఎఫెక్ట్‌: కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య క‌య్యం!

2026-11-15 20:29 GMT

హైటెక్ దొంగతనం.. కొత్త జ్యువెలరీ షోరూమ్‌ను టార్గెట్ చేసిన యూట్యూబర్!

2026-11-15 19:28 GMT

విజయ్ మామ గిఫ్ట్.. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్! దళపతి మాస్టర్ మైండ్ ఇదేనా?

2026-11-13 04:43 GMT

టీవీకేలో 'అడ్వాన్స్' రాజీనామాలు.. సీఎం విజయ్ ఏంటయ్యా ఇదీ?

2026-11-12 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS