• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  పంచాయితీ సమరం : టీడీపీ...

పంచాయితీ సమరం : టీడీపీ ఎందుకు గెలిచింది? వైసీపీ ఎందుకు ఓడింది?

| తాజా పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఓటు వాటా 39 శాతం నుంచి 24.6 శాతానికి తగ్గినట్లు కథనం పేర్కొంది. నాయకత్వం, కేడర్ మధ్య పెరిగిన అంతరం, స్థానిక నేతల నిర్లక్ష్యం, కూటమి పార్టీల సమన్వయం ఈ మార్పునకు కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ గ్రామస్థాయిలో మళ్లీ బలోపేతం కావాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

By - A.N.Kumar
Update: 2026-11-27 12:21 GMT

ముందుగ మురిస్తే పండుగ కాదంటారు.. గెలిచినప్పుడే ఓడినప్పుడు గట్టిగానే నిలబడాలి. అప్పుడే ప్రజల్లో సానుభూతి వస్తుంది. ఓడిన పార్టీని గెలిపించాలన్న కసి పెరుగుతుంది. కానీ వైసీపీ పోరాటం చేయకుండానే కాడి వదిలేస్తున్న తీరు ఆపార్టీని బలహీనంగా మార్చేస్తోంది. తాజా పంచాయితీ ఎన్నికల్లో ఒకప్పుడు 39 శాతంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు వాటా తాజాగా 24.6 శాతానికి పరిమితం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

వైసీపీ ఓటు బ్యాంకులో దాదాపు 14.4 శాతం తగ్గుదల కనిపించడం కేవలం గెలుపోటముల లెక్క మాత్రమే కాదు.. అంతకుమించిన క్షేత్రస్థాయిలో పతనాన్ని సూచిస్తోంది.. పార్టీ ఆవిర్భావం నుంచి గ్రామీణ ప్రాంతాలు.. సంక్షేమ పథకాల లబ్ధిదారులే వైసీపీకి ప్రధాన బలంగా నిలిచాయి. అయితే తాజా ఫలితాలు ఆ సాంప్రదాయ ఓటు బ్యాంకులో చీలిక వస్తోందనే సంకేతాలను ఇస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం నాయకత్వం, కేడర్ మధ్య పెరిగిన అంతరమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు, ప్రాధాన్యతతో చురుగ్గా పనిచేసిన కొందరు స్థానిక నేతలు.. అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలకు, కార్యకర్తలకు అదే స్థాయిలో అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కష్టకాలంలో అధిష్టానం నుంచి తగిన భరోసా లభించకపోవడం వల్ల క్షేత్రస్థాయి కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గిందని.. దీనికి తోడు గత ప్రభుత్వ హయాంలో స్థానిక నాయకుల వ్యవహారశైలి, అభ్యర్థుల ఎంపికలో లోపాలు, కొన్ని నిర్ణయాలపై ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తి ఓటు శాతం తగ్గడానికి దారితీశాయని విశ్లేషఖులు అభిప్రాయపడుతున్నారు.

గ్రామీణ రాజకీయాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మద్దతుదారులు ఆధిక్యం సాధించడం వెనుక బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఒకే వైపు కేంద్రీకృతమైంది. గ్రామస్థాయిలో మూడు పార్టీల కార్యకర్తల మధ్య ఏర్పడిన సమన్వయం కూటమి మద్దతుదారులకు అదనపు బలాన్ని ఇచ్చిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

అంతేకాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే టీడీపీ తన గ్రామస్థాయి కమిటీలను సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడం.. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను నిరంతరం సమాయత్తం చేయడం ఇప్పుడు ఫలితాలను ఇస్తోందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల అభివృద్ధి, నిధుల కేటాయింపు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఓటర్లు అధికారంలో ఉన్న కూటమి మద్దతుదారుల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందని కూడా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

పంచాయతీ ఎన్నికలు అధికారికంగా పార్టీ గుర్తులపై జరగవు. ఇక్కడ అభ్యర్థుల వ్యక్తిగత ప్రతిష్ట, కుటుంబ సంబంధాలు, కుల సమీకరణాలు, స్థానిక సమస్యలే ఫలితాలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ విజయాలను నేరుగా అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో పోల్చలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎంత కవర్ చేసుకున్నా.. మునుపటి ఓటు బ్యాంక్ తగ్గడం అనేది వైసీపీకి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చింది.. వచ్చే ఎన్నికల నాటికి బలపడకపోతే పార్టీ మనుగడకే ముప్పుగా మారడం ఖాయం. ఈ విషయంలో జగన్ క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. వైసీపీ అధినేత జగన్ కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా గ్రామీణ స్థాయిలో కార్యకర్తలకు భరోసా కల్పించి, స్థానిక నాయకత్వాన్ని తిరిగి క్రియాశీలం చేయడం ద్వారా మాత్రమే పార్టీ తన పాత బలాన్ని తిరిగి పొందగలదని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Tags:    
  • ysrcp 
  • ysjagan 
  • andhrapolitics 
  • panchayatelections 

Similar News

గ్రామాల్లో వైసీపీకి గడ్డుకాలం.. జగన్‌కు అసలు పరీక్ష ఇప్పుడే మొదలైందా?

2026-11-27 09:31 GMT

డీలిమిటేషన్ బిల్లుకు వైసీపీ మద్దతు.. కానీ ఒక షరతు!

2026-11-27 07:57 GMT

పంచాయ‌తీ ఫ‌లితం: వైసీపీ పుంజుకుందా?

2026-11-27 05:52 GMT

''మేం అధికారంలోకి వ‌స్తే.. వాళ్ల‌ను చెప్పుల‌తో కొడ‌తాం''

2026-11-27 03:58 GMT

జగన్ పాదయాత్రకు పోటీగా షర్మిల...విజయసాయి ?

2026-11-27 03:57 GMT

కలసి ఉండాల్సిందే...బాబు పవన్ బీజేపీ ఈక్వేషన్స్ ఇవే !

2026-11-27 02:30 GMT

షర్మిలకు వైఎస్ ఇచ్చిన ఆస్తులు ... చిట్టా విప్పిన రాచమల్లు

2026-11-27 02:30 GMT

రేవంత్ రెడ్డికి జగన్ కౌంటర్...మౌనం వీడినట్లేనా ?

2026-11-27 02:29 GMT

కాంగ్రెస్ కి బాబు దగ్గరట...జగన్ దూరమట !

2026-11-26 17:39 GMT

టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి భారీ మొత్తం.. గ్రూప్ ఇన్సూరెన్స్ కే 191 శాతం నిధులు!

2026-11-26 10:19 GMT

తిరుమలేశుడికి 121 కేజీల బంగారం ఇచ్చింది ఎవరో తెలుసా? ఎందుకిచ్చాడంటే?

2026-11-26 09:03 GMT

Copyright @2026

Powered by Blink CMS