• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  జనసేన సెంట్ పర్సెంట్...

జనసేన సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్...పంచాయతీలలో సీన్ రివర్స్ !

| 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన జనసేనకు పంచాయతీ ఎన్నికల తొలి దశలో ఆశించిన ఫలితాలు రాలేదనే చర్చ మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ, వైసీపీకి బలమైన కేడర్ ఉండటం, జనసేనలో సమన్వయ లోపం, సంస్థాగత బలం పూర్తిస్థాయిలో లేకపోవడం ఇందుకు కారణాలుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

By - Satya P
Update: 2026-11-27 17:11 GMT

జనసేన వల్లనే రాజకీయ పరిభాషలో ఒక కొత్త పదం ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అదే సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్. నిజానికి రాజకీయాల్లో ఈ పదానికి అంతగా చోటు ఉండదు, ఎందుకంటే ఢీ అంటే ఢీ కొట్టే రాజకీయాల్లో మెజారిటీ సీట్లు ఎవరైనా గెలుచుకుంటారు. కానీ తొలిసారి ఏపీ రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీ తాను పోటీ చేసిన అన్ని సీట్లలో గెలిచింది. అలా అలా చూస్తే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సాధించిన సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే ఈ మధ్య జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ జనసేన మంచి ఫలితాలను నమోదు చేసింది. అయితే అదే జనసేన పంచాయతీ ఎన్నికల మొదటి దశకు వచ్చేసరికి మాత్రం సీన్ రివర్స్ అయింది. ఇక్కడే జనసేన పెద్దగా రాజకీయంగా సత్తా చాట లేకపోయింది అన్న చర్చ మొదలైంది.

పార్టీల మద్దతుతోనే :

నిజానికి పంచాయతీ ఎన్నికలు అన్నవి రాజకీయ ప్రాతిపదిక మీద జరగవు. అయినప్పటికీ పార్టీల నుంచి వచ్చే మద్దతు తెర వెనక బలంగా ఉంటుంది. ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారో కూడా కచ్చితంగా ప్రజలకు తెలుస్తుంది. అలా చూసుకుంటే గ్రామాలలోనూ రాజకీయ పార్టీలతోనూ అక్కడ ఆ పార్టీలకు ఉన్న స్థానిక నాయకత్వం చుట్టూ ఈ ఎన్నికలు తిరుగుతుంటాయి. ఈ కోణం నుంచి చూసినపుడు రాజకీయ పార్టీల సంస్థాగత బలం క్షేత్ర స్థాయిలో ఏ మేరకు ఉందో కూడా అంచనా వేసుకునేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. అలా సాగిన పంచాయతీ ఎన్నికల్లో తొలి దశలో జనసేన అయితే ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టలేకపోయింది అన్నది ఒక విశ్లేషణగా ఉంది.

ఆశాజనకంగా లేదు :

గత ఫలితాలతో పోలిస్తే పంచాయతీలలో జనసేన రాజకీయ ప్రదర్శన ఆశాజనకంగా లేదని అంటున్నారు. ఇక్కడ మరో విశేషం ఉంది. పవన్ కళ్యాణ్ పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన గ్రామీణ ప్రాంతాలకు నిధులు అందించి అభివృద్ధి పరంగా చాలానే చేశారు. అంతే కాదు గ్రామీణ ప్రాంతాల్లో జనసేన మద్దతుదారులు ఉన్నారు, అలాగే పవన్ అభిమానులు హెచ్చుగానే ఉన్నారు. కానీ ఫలితాలు మాత్రం గాజు గ్లాస్ పార్టీకి అనూహ్యంగా వచ్చాయి. గ్రామీణ ప్రాంతంలో టీడీపీ వైసీపీ దశాబ్దాలుగా బలమైన పార్టీ నిర్మాణం కలిగి ఉన్నాయి. అదే సమయంలో జనసేన ఇంకా క్షేత్ర స్థాయిలో నిర్మాణ దశలోనే ఉంది. అక్కడ వ్యవస్థీకృత రాజకీయ కేడర్ ఉన్న టీడీపీ వైసీపీలతో జనసేన అందుకే ఇక్కడ తేలిపోయింది అని అంటున్నారు. అభిమాన గణం ఉండటం వేరు, అది నికరంగా స్థిరీకరించుకోవడం వేరు అన్నది కూడా చెబుతున్నారు. ఆ తేడా కూడా ఈ ఫలితాలలో కనిపించింది అని అంటున్నారు.

కో ఆర్డినేషన్ లోపం :

అంతే కాదు జనసేనలో ఉన్న స్థానిక నాయకుల మధ్య కూడా కో ఆర్డినేషన్ లోపం అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. జనసేనకు మద్దతుగా ఉన్న వర్గాల నుంచే అభ్యర్థులు ఎక్కువ మంది పోటీకి దిగడం వల్ల కూడా జనసేన ఓట్లు చీలిపోయి గెలుపు అవకాశాలను ప్రభావం చూపించాయని అంటున్నారు. అంతే కాదు గ్రామీణ రాజకీయాల్లో పొత్తులు పెద్దగా వర్కౌట్ అయ్యే చాన్స్ లేదని అంటున్నారు. అందుకే టీడీపీ జనసేనల మధ్య కూడా సమన్వయం పెద్దగా కనిపించలేదని అంటున్నారు. ఈ కారణాల వల్ల కూడా పంచాయతీ ఎన్నికల్లో జనసేన తక్కువ ఫలితాలు సాధించింది అని అంటున్నారు.

సంస్థాగత బలం :

జనసేనకు సంస్థగత బలం గ్రాస్ రూట్ లెవెల్ దాకా పూర్తిగా సొంతంగా ఏర్పడనంతవరకూ సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అన్నది ఆ పార్టీ వల్లనే దక్కింది అన్నది చెప్పలేమని విశ్లేషిస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాల వెనక పొత్తులు ఎత్తులు ఉన్నాయి. అదే గ్రామీణ ప్రాంతాలలో పోటీకి వచ్చేసరికి అసలు బలం వెల్లడి అయింది అని గుర్తు చేస్తున్నారు. జనసేన మరింతగా తన గ్రౌండ్ లెవెల్ బలాన్ని సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఫలితాలు సూచిస్తున్నాయని అంటున్నారు.

Tags:    
  • janasena 
  • pawankalyan 
  • andhrapradeshpolitics 
  • panchayatelections 

Similar News

తేడా ఎక్కడ కొట్టింది... జనసేనలో అంతర్మధనం

2026-11-27 17:14 GMT

పంచాయితీ సమరం : టీడీపీ ఎందుకు గెలిచింది? వైసీపీ ఎందుకు ఓడింది?

2026-11-27 12:21 GMT

గ్రామాల్లో వైసీపీకి గడ్డుకాలం.. జగన్‌కు అసలు పరీక్ష ఇప్పుడే మొదలైందా?

2026-11-27 09:31 GMT

డీలిమిటేషన్ బిల్లుకు వైసీపీ మద్దతు.. కానీ ఒక షరతు!

2026-11-27 07:57 GMT

పంచాయ‌తీ ఫ‌లితం: వైసీపీ పుంజుకుందా?

2026-11-27 05:52 GMT

''మేం అధికారంలోకి వ‌స్తే.. వాళ్ల‌ను చెప్పుల‌తో కొడ‌తాం''

2026-11-27 03:58 GMT

జగన్ పాదయాత్రకు పోటీగా షర్మిల...విజయసాయి ?

2026-11-27 03:57 GMT

కలసి ఉండాల్సిందే...బాబు పవన్ బీజేపీ ఈక్వేషన్స్ ఇవే !

2026-11-27 02:30 GMT

షర్మిలకు వైఎస్ ఇచ్చిన ఆస్తులు ... చిట్టా విప్పిన రాచమల్లు

2026-11-27 02:30 GMT

రేవంత్ రెడ్డికి జగన్ కౌంటర్...మౌనం వీడినట్లేనా ?

2026-11-27 02:29 GMT

కాంగ్రెస్ కి బాబు దగ్గరట...జగన్ దూరమట !

2026-11-26 17:39 GMT

Copyright @2026

Powered by Blink CMS