తాత అస్తికలు తిన్న ఏడాదిన్నర పిల్లాడు..తల్లి షాక్!
పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేసే ఈ సంఘటన యూకేలో జరిగింది.;
పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేసే ఈ సంఘటన యూకేలో జరిగింది. నటాషా ఎమినీ అనే మహిళ తన ఏడాదిన్నర కుమారుడు కోహ్ ను ఒంటరిగా ఇంట్లో వదిలి బట్టలు ఆరేయడానికి మేడపైకి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చి చూసేసరికి కోహ్ తన తాత అస్తికలు భద్రపరిచిన పెట్టె తెరిచి వాటిని తింటూ కనిపించాడు. ఇది చూసి షాక్ అయిన నటాషా "మా నాన్నను నువ్వు తినేశావా?" అని గట్టిగా అరిచింది. భయపడిన కోహ్ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను నటాషా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు ఇది ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ అని కామెంట్ చేయగా, మరికొందరు ఇది నిజంగా జరిగిందని నమ్మలేకపోయారు. నటాషా మాత్రం ఇది నిజమేనని, కోహ్ ఆరోగ్యంగానే ఉన్నాడని, అతను ఎక్కువ అస్తికలు తినలేదని తెలిపింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. ఈ కథనం లండన్ కు చెందిన ప్రముఖ దిన పత్రిక డెయిలీ మెయిల్ లో ప్రచురితం అయింది.
"నేను బట్టలు ఆరేయడానికి మేడపైకి వెళ్లాను. కాసేపటి తర్వాత వచ్చి చూసేసరికి కోహ్ బట్టలపై అస్తికల పొడి కనిపించింది. చూసి షాక్ అయ్యాను. కోహ్ ఆ అస్తికలు తిన్నట్లు గుర్తించాను. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో తెలుసుకుంటున్నాను" అని నటాషా తెలిపింది.
ఈ ఘటన పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తోంది. చిన్నపిల్లలు ఏది పడితే అది నోట్లో పెట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి వారిని ఎప్పుడూ ఒంటరిగా వదలకూడదు.