చంద్రబాబు విజన్: తిరుపతి బస్ స్టేషన్ ప్లానింగ్ అదిరిందిగా!
మిగిలిన ముఖ్యమంత్రుల కంటే దాదాపు పదేళ్ల కంటే ముందే ఆలోచించే చంద్రబాబు తాజాగా ప్రముఖ ఫుణ్యక్షేత్రమైన తిరుపతి పట్టణంలో నిర్మించే అత్యాధునిక బస్టాండ్ విజన్ ను వివరించారు.;
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్లానింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని ఇతర ముఖ్యమంత్రులకు భిన్నంగా ఆయన విజన్ లో హైటెక్ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. భారీతనం ఉట్టిపడేలా.. భవిష్యత్ అవసరాలు తీరేలా ప్రణాళికల్ని సిద్ధం చేస్తుంటారు. మిగిలిన ముఖ్యమంత్రుల కంటే దాదాపు పదేళ్ల కంటే ముందే ఆలోచించే చంద్రబాబు తాజాగా ప్రముఖ ఫుణ్యక్షేత్రమైన తిరుపతి పట్టణంలో నిర్మించే అత్యాధునిక బస్టాండ్ విజన్ ను వివరించారు.
దాదాపు 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాలని భావిస్తున్న ఈ హైటెక్ బస్టాండ్ ద్వారా రోజుకు కనీసం లక్ష మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా ప్లాన్ చేశారు. అంతేనా.. ఈ బస్టాండ్ లో ఒకేసారి 150 బస్సులు నిలిపేలా డిజైన చేశారు. అంతేకాదు.. రానున్న రోజుల్లో అన్నీ ఎలక్ట్ట్రికల్ బస్సులే నడపాలన్న యోచన నేపథ్యంలో.. ప్రతి బస్సుకు ఛార్జింగ్ సౌకర్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు
తిరుపతిలో నిర్మించే కొత్త బస్టాండ్ లో హెలిప్యాడ్ సౌకర్యంతో పాటు.. రోప్ వే.. కమర్షియల్ కాంప్లెక్స్ లు.. మాల్స్.. మల్టీఫ్లెక్సులతో పాటు రెండు బస్ ఎంట్రీలు.. ఎగ్జిట్ లు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. సోలార్ రూఫ్ టాప్ తో సొంత విద్యుత్ అవసరాల్ని తీర్చుకుంటూ.. విద్యుత్ కోసం ఇతరుల మీద ఆధారపడకుండా ఉండేలా డిజైన్ చేస్తున్నారు. మొత్తంగా..హైటెక్ బస్టాండ్ అంటే ఎలా ఉండాలన్న దానికి తిరుపతి బస్టాండ్ ఒక నమూనాగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా.. చంద్రబాబు విజనే విజన్.