భూమ‌న‌కు బిగుస్తున్న ఉచ్చు.. ఈసారి క‌ష్ట‌మే.. !

వైసీపీ ముఖ్య‌నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డికి ఉచ్చు బిగిస్తోందా? ఈసారి ఆయ‌న త‌ప్పించుకోవడం క‌ష్ట‌మేనా? అంటే.. ఔన‌నే సంకేతాలే వ‌స్తున్నాయి.;

Update: 2026-01-09 19:06 GMT

వైసీపీ ముఖ్య‌నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డికి ఉచ్చు బిగిస్తోందా? ఈసారి ఆయ‌న త‌ప్పించుకోవడం క‌ష్ట‌మేనా? అంటే.. ఔన‌నే సంకేతాలే వ‌స్తున్నాయి. పోలీసులు.. అన్ని కోణాల్లోనూ ఆలో చించి భూమ‌న‌పై కేసులు న‌మోదు చేసేందుకు.. ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆయ‌న‌పై రెండుకీల‌క కేసులు ఉన్నాయి. తిరుప‌తిలోని గోశాల‌లో గోవులు మృతి చెంద‌డంపై ఆయ‌న చేసిన వ్యాఖ్య ల‌పై అందిన ఫిర్యాదులు. 2) తిరుమ‌ల‌లో ప‌ర‌కామ‌ణికేసు దొంగ‌తనాన్ని రాజీ చేయ‌డం.

అయితే.. ఇప్పుడు మ‌రిన్ని కేసులు న‌మోదు చేసే దిశగా అధికారులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇటీవ‌ల తిరుమ‌ల‌కు చెందిన గెస్ట్ హౌస్‌ల వ‌ద్ద మ‌ద్యం బాటిళ్లు క‌నిపించ‌డం క‌ల‌క‌లం రేపింది. అయితే.. దీనిపై అప్పట్లోనే భూమ‌న తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను భ‌గ్నం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్న టీటీడీ విచార‌ణ చేయించింది. దీనిలో తాజాగా భూమ‌న అనుచ‌రు లు చిక్కుకుపోయారు.

తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు మద్యం బాటిళ్లను తీసుకొచ్చి పెట్టి మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. వీరిని అరెస్టు కూడా చేశారు. అయితే.. కేసు మూలాల‌ను ఛేదిస్తే.. భూమ‌న పేరు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ కోణంలోనే పోలీసులు ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేశారు. శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసేలా అనేక అసత్య ప్రచారాలు చేశార‌న్న వాద‌న ఇప్ప‌టికే ఉంది. ఇప్పుడు మద్యం బాటిళ్ల ఘటనతో భూమ‌న చుట్టూ మ‌రింతగా ఉచ్చు బిగిస్తోంది.

ఏం జ‌రిగింది.. ?

ఈ నెల 4వ తేదీన తిరుమలలోని కౌస్తుభం గెస్ట్ హౌస్ సమీపంలో ఖాళీ మద్యం బాటిళ్లు కనిపించాయి. దీనిపై భూమ‌న పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేశారు. త‌మ హ‌యాంలో ఏమీ జ‌ర‌గ‌క‌పోయినా.. విమ‌ర్శించార‌ని.. ఇప్పుడు మాత్రం మద్యం తాగుతున్నా.. చూస్తూ ఊరుకుంటున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. దీంతో విచార‌ణ చేసిన పోలీసులు.. ఇది పక్కా ప్రణాళికతో జరిగిన కుట్రగా తేల్చారు. తిరుపతి నుంచి ఖాళీ బాటిళ్లను తీసుకెళ్లి తిరుమలలోని పొదల మధ్యలో పడేసి వాటిపై నే ప్ర‌చారం చేశార‌ని గుర్తించారు. ఈ నేప‌థ్యంలో భూమ‌న‌పై కీల‌క సెక్ష‌న్ల కింద కేసులు పెట్టే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News