• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఒక్క వీడియోతో పవన్ -...

ఒక్క వీడియోతో పవన్ - అన్నా రిలేషన్ ప్రపంచానికి అర్థమైంది

| అయితే.. వీరిద్దరి మధ్య బంధం ఎంత బలమైనదన్న విషయాన్ని గడిచిన రెండురోజులుగా జరిగిన పరిణామాలు చెప్పకనే చెప్పేశాయి.

By - Tupaki Desk
Update: 2024-06-07 05:03 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైవాహిక జీవితం మీద ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఎంత తీవ్రమైన ఆరోపణలు చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనది మూడో వివాహమైనా.. నాలుగో పెళ్లి చేసుకున్నారంటూ అనకూడని మాటలు అనేయటం చూశాం. పవన్ కు ఆయన సతీమణి అన్నా లెజినోవాకు మధ్య రిలేషన్ సరిగా లేదని.. ఆమె ఈ మధ్యన రష్యాకు వెళ్లినట్లుగా ప్రచారం మొదలుపెట్టారు. అయితే.. వీరిద్దరి మధ్య బంధం ఎంత బలమైనదన్న విషయాన్ని గడిచిన రెండురోజులుగా జరిగిన పరిణామాలు చెప్పకనే చెప్పేశాయి.

ఎన్నికల ఫలితాలు వెల్లడి కావటం.. జనసేన తాను పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించి వంద శాతం స్ట్రైకింగ్ రేట్ తో దూసుకెళ్లటం తెలిసిందే. దీంతో జనసైనికుల ఆనందానికి హద్దే లేకుండాపోయింది. అంతేకాదు.. టీడీపీ కూటమికి చారిత్రక విజయం సొంతం రావటంతో.. దానికి కర్తకర్మక్రియ పవన్ మాత్రమేనన్న మాటతో పాటు.. ఈ ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవనే అంటూ కితాబులు ఇచ్చేస్తున్నారు.

ఎన్నికల ఫలితాలు వెల్లడైన వేళలో.. అందరిని ఆకర్షించిన ఇద్దరు ఎవరంటే.. ఒకరు పవన్ సతీమణి అన్నా లెజినోవా. మరొకరు కొడుకు అకీరా. వారింట్లో వ్యక్తుల మధ్య అనుబంధాలు ఎలా ఉంటాయన్న దానికి నిదర్శనంగా పవన్ ను అంటిపెట్టుకొని అకీరా ఉండటమే కాదు.. అన్నా లెజినోవాతోనూ అప్యాయంగా ఉండటం.. ఇద్దరి మధ్య అనుబంధం చూసిన వారంతా కొత్త విషయాల్ని తెలుసుకున్నట్లుగా ఫీల్ అయ్యారు.

ఇక.. అన్నా లెజినోవా విషయానికి వస్తే.. తన మీద ఎవరెన్ని అన్నా ఎప్పుడూ బయటకు వచ్చి మాట్లాడటం ఉండదు. తాజాగా చోటు చేసుకున్న చారిత్రక గెలుపు వేళలోనూ ఆమె మాట్లాడలేదు. కాకుంటే.. భర్త పవన్ కల్యాణ్ కు తిలకం దిద్ది.. ఆయనకుహారతి ఇవ్వటం లాంటి వీడియోలు పెద్ద ఎత్తున అందరిని ఆకర్షించాయి. ఇక.. పవన్ సాధించిన ఘన విజయానికి మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో గెట్ టు గెదర్ పార్టీని నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో విడుదలై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

ఈ వీడియో మొత్తం భావోద్వేగాలతో నిండి ఉండటం.. మెగా కుటుంబంలోని అనుబంధాలు ఆవిష్క్రతం అయ్యాయి. అన్నింటికి మించి ఇప్పటివరకు పవన్ - అన్నా లెజినోవా మధ్య ఎంత గాఢమైన బంధం ఉందన్న విషయం తెలియదు. అవన్నీ తాజా వీడియోతో బయటపడ్డాయి. తన అన్న చిరు ఇంటికి వెళ్లిన వేళ.. తన తల్లికి.. వదినకు.. అన్నకు పాద నమస్కారం చేసిన వేళలో.. కాళ్లకున్న చెప్పుల్ని విడిచారు పవన్. ఆ వెంటనే.. అన్నా లెజినోవా పవన్ పాదరక్షల్ని పట్టుకొని ఉండటం అందరిని ఆకర్షించింది. తన భర్త చెప్పుల్ని వెంటనే తాను చేతిలోకి తీసుకొని ఉండటం చూసినప్పుడు.. ఆమె పవన్ ను ఎంత కేరింగ్ గా చూసుకుంటుందో అర్థమవుతుందని చెబుతున్నారు.

అంతేకాదు.. పవన్ తో పాటు అన్నాను సైతం మెగాఫ్యామిలీ ఎంతగా అభిమానిస్తారన్న విషయం స్పష్టమైంది. ఇప్పటికే పవన్ - రేణు కుమారుడు అకీరాను అన్నా లెజినోవా అప్యాయంగా చూడటం.. ఆమె పట్ల అకీరా సైతం అంతే అభిమానాన్ని ప్రదర్శించటం చూస్తే.. మెగా ఫ్యామిలీలోని కుటుంబ సభ్యుల మధ్య ఎంత గాఢమైన అనుబంధం ఉందన్న విషయం ఇట్టే అర్తం కాక మానదు.


ఎన్నికలలో అఖండ విజయం సాధించి, ఢిల్లీ లో NDA సమావేశంలో పాల్గొని మెగాస్టార్ దీవెనల కోసం తరలివచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్.#PawanKalyan #Chiranjeevi #RamCharan #Nagababu #VarunTej #AkiraNandan #SaidharamTej #Janasena #Tupaki pic.twitter.com/3c2raO9yCi

— Tupaki (@tupaki_official) June 6, 2024


Tags:    
  • Tdp 
  • Jsp 
  • Bjp 
  • Congressparty 
  • Ycp 
  • TdpJspBjpAlliance 
  • Pawankalyan 
  • Chiranjeevi 
  • AkiraNandan 
  • AnnaLezhneva 
  • RamCharan 
  • Upasana 
  • Nagababu 
  • VarunTej 
  • MegaFamily 

Similar News

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

Copyright @2026

Powered by Blink CMS