• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  విజయవాడలో మళ్లీ టెన్షన్.....

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద

| గతవారం భారీ వరదలతో కండ్రిగ, నున్న, వాంబే కాలనీ సహా ఆ చుట్టుపక్కల కాలనీలు వరదలో చిక్కుకుపోయాయి.

By - Tupaki Desk
Update: 2024-09-07 07:39 GMT

విజయవాడలో వచ్చిన వరదలు వారం రోజులపాటు అక్కడి ప్రజలు నిద్ర లేకుండా చేశాయి. రాత్రికిరాత్రి చుట్టుముట్టిన వరదలతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు తరలాల్సి వచ్చింది. బుడమేరు వరద విజయవాడలో ఈ ప్రళయానికి కారణమైంది.

గతవారం భారీ వరదలతో కండ్రిగ, నున్న, వాంబే కాలనీ సహా ఆ చుట్టుపక్కల కాలనీలు వరదలో చిక్కుకుపోయాయి. ఈ వరదలకు కారణమైన బుడమేరు పేరు వింటేనే ఇప్పుడు అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. బెజవాడ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వచ్చిన భారీ వరదలతో ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. ఇంకా ఆ వరద నుంచి ఆ ఇళ్లను వీడనే లేదు.

అయితే.. విజయవాడను ఇప్పుడప్పుడే వరదలు వీడేలా కనిపిస్తలేవు. వర్షాలు తగ్గి, వరదలు తగ్గాయని కాస్త రిలీఫ్ అవుతున్న తరుణంలో.. మరోసారి వర్షాలు భయపెడుతున్నాయి. తాజాగా మరోసారి నీటి ప్రవాహం పెరుగుతోంది. దీంతో జనం మళ్లీ ఆందోళనలో పడింది.

తాజాగా.. సింగ్‌నగర్, విద్యాధరపురం, భవనీపురం, రాజరాజేశ్వరిపేట, రూరల్ పరిధిలో అంబాపురం, జక్కంపూడి కాలనీ, రాయనపాడు, నైనవరంతోపాటు పలు గ్రామాల్లో అడుగు నుంచి రెండడుగుల మేర నీరు పెరిగింది. దీంతో మరోసారి ప్రజల్లో భయాందోళన మొదలైంది. అయితే.. వెలగలేరు హెడ్ రెగ్యులేటరీ పరిధిలో ఎలాంటి వరద లేదని తేలడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

అటు.. కృష్ణా జిల్లా పరిధిలోని బుడమనేరు మాత్రం మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరను మండలాల్లో తగ్గిన వరద.. గుడివాడ, నందివాడ, మండపల్లి మండల్లాలో ఉధృతమైంది. దీంతో అక్కడి ప్రజలు మరోసారి తలదాచుకునేందుకు పరుగులు పెట్టారు. ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు వరదతో ముంచెత్తాయి. దేవుడా.. మొన్న వచ్చిన వరదలతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని, మరోసారి మాకు ఈ పరీక్ష ఏంటని జనం ఆక్రందనలు చేస్తున్నారు.

Tags:    
  • Vijayawadafloods 
  • Vijayawada 
  • Floods 
  • Heavyrains 
  • BudameruLake 
  • KrishnaRiver 
  • Riverflows 

Similar News

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

Copyright @2026

Powered by Blink CMS