ముఖ్యమంత్రి విజయ్...తొలి వారం సంచలనం

వెండి తెర మీద లక్షలాది మంది అభిమానులకు ఆరాధ్య దైవంగా దళపతిగా వెలిగిన విజయ్ రాజకీయ ఎంట్రీ ఇచ్చి తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి అయిపోయారు.

Update: 2026-05-17 13:30 GMT

వెండి తెర మీద లక్షలాది మంది అభిమానులకు ఆరాధ్య దైవంగా దళపతిగా వెలిగిన విజయ్ రాజకీయ ఎంట్రీ ఇచ్చి తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి అయిపోయారు. పార్టీ పెట్టి కేవలం రెండేళ్ళ వ్యవధిలోనే విజయ్ సీఎం సీటు పట్టేశారు. ఇది ఒక రకంగా రికార్డు. ఇక సీఎం అయిన తరువాత సీఎం గా విజయ్ వ్యవహరిస్తున్న తీరు దేశవ్యాప్తంగా చర్చగా మారుతోంది. ఆయన ద్రవిడ సంప్రదాయానికి భిన్నంగా తనదైన డ్రెస్ కోడ్ తో ప్రమాణం చేశారు. ఇక ప్రమాణ పత్రంలో ఉన్న దానికి అదనంగా ఆయన కొన్ని మాటలను భావోద్వగంగా పలికి తన వైఖరి ఏంటో చెప్పారు. సీఎం సీటులో అసీనులు అయిన విజయ్ ఆ వెంటనే తన మదిలో ఉన్న విషయాలను ఒక్కొక్కటిగా వరసగా అమలులో పెట్టేశారు.

గట్టిగా వారంలోనే :

ఇక విజయ్ మే 10న సీఎం గా ప్రమాణం చేశాఅరు. గట్టిగా వారం గడచింది. ఈ వారం రోజుల వ్యవధిలోనే ఆయన సంచలన నిర్ణయాలు వరుసగా తీసుకుంటూ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అందులో ఒక్కోటీ చూసుకుంటే వస్తూనే మొదటి రోజున తమిళనాడు వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల సమీపంలో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ విజయ్ సంచలనానికి తెర తీశారు. అంతేనా రెండవ రోజున ద్వితీయ విఘ్నం అంటూ లేకుండా : నీట్ పరీక్షను దేశవ్యాప్తంగా నిషేధించాలని కేంద్రాన్ని గట్టిగా కోరడం ద్వారా టీవీకే స్టాండ్ ఏంటో స్పష్టంగా చెప్పేశారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే మెడికల్ సీట్లకు అభ్యర్హులను ఎంచుకునే విధంగా సొంతంగా పరీక్షలు నిర్వహించుకునే విధంగా విధానం ఉండాలని విజయ్ కోరడం ద్వారా దేశవ్యాప్తంగా దీని మీద చర్చకు పెట్టారు. ఇది ఒక సంచలన డిమాండ్ గా మారింది.

బిగ్ డిబేట్ గానే :

ఇక విజయ్ సీఎం గా తన వేగాన్ని తనలోని ఆలోచనలను అలాగే అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో మూడవ రోజున పత్తిపై దిగుమతి సుంకాన్ని నిషేధించాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. ఇది కూడా జాతీయ స్థాయిలో బిగ్ డిబేట్ కి ఆస్కారం ఇచ్చిన విధానపరమైన అంశమే. అంతే కాదు నాలుగవ రోజున ఏకంగా వీవీఐపీ ప్రోటోకాల్‌ను నిషేధించి విజయ్ హెడ్ లైన్స్ లో నేషనల్ లెవెల్ లోనే నిలిచారు. ఇక అయిదవ రోజు అయితే సుప్రీంకోర్టులో అదనపు అడ్వకేట్ జనరల్స్‌గా పూర్తిగా మహిళలతో కూడిన బృందాన్ని నియమించడం ద్వారా ఎవరూ ఎన్నడూ ఎక్కడా చేయలేని పనిని తాను చేశాను అని నిరూపించుకున్నారు. అంతే కాదు మహిళా పక్షపాతిగా వర్తమాన రాజకీయాల్లో దేశంలో తన స్థానాన్ని సుస్థిరపరచుకున్నారు.

విజయ్ ముద్ర అన్నది :

ఇలా కేవలం ఒక్క వారం లోనే విజయ్ తన ముఖ్యమంత్రి ప్రస్థానాన్ని ఎంతో ఆలోచనాత్మకంగా సంచలనాత్మకంగా ప్రారంభించారని అంటున్నారు. రానున్న రోజులలో ఆయన ఇదే వైఖరితో ముందుకు సాగితే మాత్రం దేశ రాజకీయాల్లో విజయ్ ముద్ర అన్నది సుస్పష్టంగా ఉండిపోతుంది అన్నది వాస్తవం. మొత్తానికి రాజకీయాల ఆసక్తి అనురక్తి ఉండడమే కాదు పరిపాలనలో కూడా నిబద్ధత ఉండాలని తాను ఏమి అనుకుంటున్నానో చేసి చూపించాలన్న విజయ్ తాపత్రయానికి ఏడు రోజులూ ఒక కీలకమైన విగా అంతా భావిస్తున్నారు. మరి ముందు ముందు విజయ్ ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారో అవి ఎంత సంచలనం రేకెత్తిస్తాయో వేచి చూడాల్సి ఉంది.

Tags:    

Similar News