'అమెరికా' అందాల పోటీలో రన్నరప్ గా ప.గో. అమ్మాయి

అమెరికాలో నిర్వహించిన ఒక అందాల పోటీలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక అమ్మాయి రన్నరప్ గా నిలిచిన వైనం ఆసక్తికరంగా మారింది.;

Update: 2025-05-27 05:21 GMT

అమెరికాలో నిర్వహించిన ఒక అందాల పోటీలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక అమ్మాయి రన్నరప్ గా నిలిచిన వైనం ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ మహానగరంలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న వేళ.. అందాల పోటీల మీద ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటివరకు అందాల పోటీలు అన్నంతనే.. స్కిన్ షో తప్పించి ఇంకేమీ కాదన్న భావన చాలామందిలో ఉండేది. ఆ ఆలోచనను మార్చేలా చేయటంలో తాజాగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు కీలక భూమికగా మారాయని చెప్పకతప్పదు.

ఇదిలా ఉంటే.. అమెరికాలోని తెలుగు సంఘాల ఆధ్వర్యంలో మిస్ తెలుగు యూఎస్ఏ పేరుతో అందాల పోటీల్ని నిర్వహించారు. ఈ పోటీల్లో పలువురు కంటెస్టెంట్లు పాల్గొన్నారు. అందులో ఒకరు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నడపనవారి పాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి చూర్ణిక ప్రియ రన్నరప్ గా నిలిచారు. వివిధ దశల్లో జరిగిన రౌండ్లలో చూర్ణిక తన ప్రతిభను ప్రదర్శించారు.

దీనికి సంబంధించిన గ్రాండ్ ఫినాలే అమెరికాలోని డల్లాస్ లో ఇర్వింగ్ ఆర్ట్ సెంటర్ లో జరిగింది. తమ కుమార్తె ప్రియ రన్నరప్ గా నిలిచిందని.. దీంతోపాటు పీపుల్స్ ఛాయిస్ అవార్డును కూడా సొంతం చేసుకున్నట్లుగా తండ్రి రాంబాబు వెల్లడించారు. ఏమైనా.. ఒక మారుమూల గ్రామానికి చెందిన అమ్మాయి అమెరికాకు వెళ్లటం.. సొంతంగా ఒక అందాల పోటీలో పాల్గొని రన్నరప్ గా నిలవటం ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు.

Tags:    

Similar News