టీ ఓటర్ కి ఫుల్ కంఫ్యూజన్ : వారూ వీరూ ఒక్కటేనా...?
తెలంగాణ ఓటర్ కి ఫుల్ కంఫ్యూజన్ క్రియేట్ అయ్యేలా చేస్తున్నారు మహా నాయకులు.;
తెలంగాణ ఓటర్ కి ఫుల్ కంఫ్యూజన్ క్రియేట్ అయ్యేలా చేస్తున్నారు మహా నాయకులు. ఒకాయన వచ్చి బీజేపీ బీయారే ఒక్కటే సుమా. వారికి ఓటేయద్దు అంటారు. మరోకాయన ఆ వెంటనే వచ్చి కాంగ్రెస్ బీయారీస్ ఒక టీం సుమా వారితో జాగ్రత్త అంటారు. ఇంతకీ ఎవరు ఎవరితో పొత్తు. ఎవరికి ఎవరితో చీకటి ఒప్పందాలు. అసలెందుకు ఈ చిత్ర విచిత్ర ఆరోపణలు. ఎటు చూసినా తెర వెనక దోస్తీలు అంటూ బడా నాయకులు హడలెత్తిస్తున్న వేళ టీ ఓటర్ కి నిండా సందేహమే కలుగుతోంది అని అంటున్నారు.
తెలంగాణాలో బీయారెస్ అధికారంలో ఉంది. రెండు తడవలుగా ఆ పార్టీనే తెలంగాణా ఏలుతోంది. హ్యాట్రిక్ కొట్టాలని ఆ పార్టీ చూస్తోంది. దాంతో సింగిల్ గానే ఈసారి పోటీ చేస్తోంది. ఆ మాటకు వస్తే గత రెండు సార్లూ ఒంటరి పోరుతోనే బీయారెస్ అధికారంలోకి వచ్చింది.
ఈ నేపధ్యంలో బీయారెస్ అనే రీసెంట్ గా జాతీయ పార్టీగా చెప్పుకునే ఒక ప్రాంతీయ పార్టీకి ఎవరు దోస్తులు, ఎవరు శత్రువులు అన్నది జనాలకు పెద్ద అయోమయంగా ఉంది. అలా అయోమయంలో ప్రజలని రాజకీయ నేతలే నెట్టేశారు. బీయారెస్ కి బీజేపీకి మధ్య స్నేహం ఉందని కాంగ్రెస్ నేతలు అంటారు. అందుకే ఆయన కుమార్తె కవిత మీద లిక్కర్ స్కాం కేసుల ఊసే లేకుండా పోయిందని అంటారు.
తెలంగాణాలో బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్న బండి సంజయ్ ని తప్పించింది కూడా ఆ అండర్ స్టాండింగ్ లో భాగమే అని అంటారు. అందుకే బీయారెస్ కి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే. కాబట్టి ఆ రెండు పార్టీలను పక్కన పెట్టేయండి అని అంటారు. ఇక కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అయితే మోడీ కేసీయార్ ఒక్కటే అని ఆరోపించారు.
అటు ఖర్గే ఆరోపణలు అలా ఉండగానే ఖమ్మం సభకు వచ్చిన బీజేపీ పెద్ద, హోం మంత్రి అయిన అమిత్ షా బీజేపీకి బీయారెస్ కి మధ్య స్నేహమేంటి అని ఫైర్ అయ్యారు. ఉంటే గింటే వారి మధ్యనే ఉండాలని అన్నారు. బీయారెస్ మజ్లీస్ పార్టీలు రెండూ ఒక్కటే అన్నారు. అలాగే కాంగ్రెస్ బీయారెస్ కూడా ఒక్కటే అని అన్నారు. అన్నీ కుటుంబ పార్టీలే అని కూడా ఎకసెక్కమడారు.
కాంగ్రెస్ ని ఫోర్ జీ అన్న్నారు. అంటే నాలుగు తరాల పార్టీ. బీయారెస్ టూజీ. రెండు తరాల పార్టీ, మజ్లిస్ త్రీజీ అంటే, మూడు తరాల పార్టీ. ఇలా కుటుంబ పాలన చేసే ఈ పార్టీలు అన్నీ ఒక్కటే వాటిని ఓటేయ్యద్దు అని అమిత్ షా గట్టిగానే జనాలను కోరారు.
అటు ఖర్గే చెపినా ఇటు అమిత్ షా చెప్పినా జనాలు విన్నారు. వారికి అర్ధం కానిది ఏంటి అంటే ఏ చీకటి స్నేహాలు ఏంటి అని, అలాగే మరో విషయం ఏంటి అంటే తమకు ఈ గోల ఎందుకు అని. బాగా పాలించే పార్టీ ఉంటే ఓటేస్తారు. లేకపోతే లేదు ఆయా పార్టీలు ఎవరితో దోస్తీ చేస్తున్నాయో సగటు ఓటరుకు అవసరమా అన్న చర్చ కూడా సాగుతోంది.
అయితే తెలంగాణాలో ఇపుడు మూడు పార్టీలు ఉన్నాయి. ముఖా ముఖీ పోరు జరిగితే బీయారెస్ కి ఇబ్బంది. ఆ నేపధ్యంలో మూడు కాస్తా రెండు కావాలంటే విపక్షాలలో ఒక పార్టీ ఎలిమినేట్ కావాలి. ఎన్నికల్లో ఎలిమినేట్ అంటే ఓట్ల చీలిక తరువాతనే సాధ్యం. అప్పటికి జగరాల్సిన అనర్ధం జరిగిపోతుంది. అందువల్ల ముందుగానే తప్పించేయాలి.
జనాల మెదళ్లలో ఆ పార్టీ బీయారెస్ ఒక్కటే అనిపించాలి. అందుకే బీజేపీ కాంగ్రెస్ ని బీయారెస్ జట్టు కట్టేస్తోంది. కాంగ్రెస్ అయితే బీజేపీ బీయారెస్ ఒక్కటే అని చెబుతోంది. అయితే ఈ రెండు పార్టీలు ఇలా పరస్పరం వేసుకున్న ఎత్తుల ఫలితం ఎంటో తెలియదు కానీ కామన్ గా మాత్రం బీయారెస్ ఉంటోంది. బీయారెస్ అంత బలమైన పార్టీయా అన్న చర్చ కూడా జనాల బుర్రల్లోకి వెళ్తోంది. ఏది ఏమైనా టీ ఓటర్ కి మాత్రం ఫుల్ కంఫ్యూజన్ పెట్టేలాగానే నేతల స్పీచులు ఉన్నాయి. ఇది అటు తిరిగి ఇటు తిరిగి ఏ పార్టీకి లాభం చేకూరుస్తుందో చూడాల్సిందే.