• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తెలంగాణ పోలీసుల...

తెలంగాణ పోలీసుల వార్నింగ్‌... ఖంగుతిని కామ్‌ అయిపోయిన శ్రీదేవి!

| ఈ సమయయంలో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా మెట్రో స్టేషన్ కి చేరుకుని నిరసనకారులకు మద్దతు తెలిపారు.

By - Tupaki Desk
Update: 2023-10-14 12:58 GMT

చంద్రబాబుకి మద్దతుగా వీకెండ్ ప్రొటెస్ట్ శనివారం ఉదయం హైదరాబాద్ లోని మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ప్రారంభమైంది. "లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్" అంటూ చంద్రబాబు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు హైదరాబాద్ మెట్రో రైళ్లు ఎక్కారు. నల్ల చొక్కాలు, నల్ల ఫ్యాంట్లు ధరించి ట్రైన్ లో ప్రయాణించారు. తద్వారా తమ నిరసన తెలిపారు. ఈ వన్ అవర్ నిరసన కార్యక్రమం జరుగుతున్న క్రమంలో ఓ దశలో అసలు ప్రయాణికులకు చికాకు కలిగించింది.

దీంతో మరింత అసహనం ప్రదర్శించిన అసలు ప్రయాణికులు... మెట్రో రైళ్లలో ఎక్కి నినాదాలేంటని వారిని వారించారు. ఒకానొక దశలో మెట్రో ప్రయాణికులకు, టీడీపీ సానుభూతిపరులకు మధ్య వాగ్వాదం కూడా జరిగింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

ఈ సమయయంలో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా మెట్రో స్టేషన్ కి చేరుకుని నిరసనకారులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి హైద‌రాబాద్‌ లో ఓవ‌రాక్షన్ చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో పోలీసుల‌పై ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి ద‌బాయింపున‌కు దిగారు. తాను ఎమ్మెల్యేన‌ని, ఎలా అడ్డుకుంటార‌ని పోలీస్ అధికారుల్ని నిల‌దీశారు.

దీంతో... సాధార‌ణ ప్రయాణికుల‌ను ఇబ్బందుల‌కు గురి చేయ‌డం స‌రైంది కాద‌ని, నిర‌స‌న‌కారుల‌ను అనుమ‌తించేదిలేదని పోలీసులు తెలిపారు. అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గకపోవడంతో దీంతో స‌హ‌నం న‌శించిన పోలీసులు... ఎమ్మెల్యే అయితే ఏంట‌ని శ్రీ‌దేవికి చేయి చూపిస్తూ ఆగ్రహంతో ఊగిపోయారని తెలుస్తుంది.

ఇదే సమయంలో... ఇది హైద‌రాబాద్ అని, రాజ‌కీయాలు ఏవైనా ఉంటే ఆంధ్ర ప్రదేశ్ లో చేసుకోవాల‌ని, ఇక్కడ ప్రశాంతతకు భంగం కలిగించొద్దని శ్రీ‌దేవికి వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. దీంతో... శ్రీ‌దేవి ఖంగుతిని, కాం అయిపోయారని తెలుస్తుంది. దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడీయాలో వైరల్ అవుతుంటే... అందుకే అంటారు అనువుగాని చోట అధికులమనరాదు అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు!

Tags:    
  • Undavellisridevi 
  • Telangana 
  • Police 
  • Hyderabad 
  • Miyapurmetrostation 
  • Politicalnews 

Similar News

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS