• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఫిబ్రవరిలో పెద్దపనే...

ఫిబ్రవరిలో పెద్దపనే పెట్టుకున్న రేవంత్... ఆ రెండూ కన్ ఫాం!

| అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ గెలుపులో ఆరు గ్యారెంటీలు కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే

By - Tupaki Desk
Update: 2024-01-28 09:13 GMT

అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ గెలుపులో ఆరు గ్యారెంటీలు కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు ఆరు గ్యారెంటీలనూ అమలుచేస్తామని చెప్పారు! ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికలు కూడా సమీపిస్తున్న తరుణంలో ఫిబ్రవరిలో రెండు కీలకమైన హామీలను నెరవేర్చాలని భావిస్తుంది. ఈ సమయంలో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోనే ఈ కార్యక్రమం పూర్తిచేయాలని రేవంత్ ప్లాన్ చేశారని అంటున్నారు.

అవును... అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలనూ అమలుచేస్తామని ప్రకటించినట్లుగానే తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలైపోయింది. ఇదే సమయంలో మరో రెండు హామీలను ఫిబ్రవరి మొదటి వారంలోనే అమలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసైడ్ అయ్యిందని తెలుస్తుంది. ఈ మేరకు ఈ హామీల అమలుపై సీఎంవో నుంచి హింట్ వచ్చిందని చెబుతున్నారు.

ఇందులో భాగంగానే ఈ రెండు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల్లో అర్హుల ఎంపిక కోసం అధికారులు ఇప్పటికే కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఫిబ్రవరి మొదటివారంలో 200 యూనిట్లు ఉపయోగించే వినియోగదారులకు ఉచిత విద్యుత్ సౌకర్యం, ఇక.. రు.500కే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలను ప్రారంభించాలని రేవంత్ డిసైడ్ అయ్యారని తెలుస్తుంది. దీంతో... అటు సివిల్ సప్లై అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు కసరత్తులు మొదలుపెట్టారని సమాచారం.

ఈ మేరకు ఇప్పటికే రెండు విభాలకు చెందిన ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై చర్చించారని తెలుస్తుంది. ఈ క్రమంలో పౌరసరఫరాల శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులుండగా... పై రెండు ఉచిత పథకాల అమలుకు ఈ 90 లక్షల రేషన్ కార్డులనే ప్రమాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇదే సమయంలో వైట్ రేషన్ కార్డులు ఉన్న వారంతా పేదలేనా.. లేదా.. అనే విషయంపై కూడా కసరత్తులు చేస్తున్నారని తెలుస్తుంది.

కాగా... అధికారంలోకి వచ్చిన అనంతరం చెప్పినట్లుగానే ఆరోగ్యశ్రీ పరిధిని రు. 10 లక్షలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పించింది. అంటే రెండు హామీలను ఇప్పటికే అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో అమలుచేసేలా మరో రెండు హామీల అమలుకు కసర్తతులు చేస్తోంది.

Tags:    
  • Revanthreddy 
  • Congress 
  • Telanganapolitics 
  • Congressschemes 
  • Telanganagovernment 

Similar News

టేస్ట్ ఆఫ్ ఆంధ్రా' నుంచి డిజిటల్ పర్యాటకం వరకు.. సీఐఐ సదస్సు విశేషాలు!

2026-11-12 06:17 GMT

చీపురుపల్లి టీడీపీలో టెన్షన్.. టెన్షన్.. స్థానికంలో బొత్స దూకుడు

2026-11-12 06:05 GMT

బీబీసీకి ఎదురుదెబ్బ.. ట్రంప్ పరువు నష్టం కేసుకు గ్రీన్ సిగ్నల్!

2026-11-12 06:05 GMT

చాక్లెట్ బాక్సును వదలని ‘బాబు’ గారు.. ఆయన ఆలోచన అలా ఉంటుంది మరీ

2026-11-12 05:54 GMT

రాప్తాడు నిందితుడికి తీవ్ర అనారోగ్యం.. బతికినంతకాలం దుర్భర జీవితమే..!?

2026-11-12 05:49 GMT

జెన్సన్‌కు మస్క్ ఉద్యోగం ఇస్తారా? వివాదం మధ్య ఆసక్తికర ఆఫర్!

2026-11-12 05:49 GMT

ప్రభుత్వం మారినా పెట్టుబడుల ఒప్పందాలు మారకూడదు.. చంద్రబాబు కొత్త ఆలోచన!

2026-11-12 05:48 GMT

క్లీన్ సిటీల జాబితాలో ఏపీ సత్తా.. విజయవాడ, విశాఖ, గుంటూరుకు ప్రత్యేక గుర్తింపు!

2026-11-12 05:48 GMT

పవన్ పై సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వారికి గట్టి షాక్.. అరెస్ట్

2026-11-12 04:24 GMT

11 లక్షల కోట్ల టార్గెట్ ..దావోస్ కి ధీటుగా వైజాగ్ సమ్మిట్

2026-11-12 03:23 GMT

బాబు లెక్కకు అందని జగన్ లెక్క !

2026-11-12 03:21 GMT

హైడ్రా రంగనాథ్ మీద నాగ్ పొగడ్తల వర్షం...మ్యాటర్ ఇదే !

2026-11-12 02:22 GMT

Copyright @2026

Powered by Blink CMS