రుణమాఫీకి నిధులొచ్చాయా ?
రైతులు ఎదురుతిరుగుతారనే భయంతోనే కేసీయార్ రుణమాఫీ కోసం నిధులు సేకరిస్తున్నారు.;
రైతులు ఎదురుతిరుగుతారనే భయంతోనే కేసీయార్ రుణమాఫీ కోసం నిధులు సేకరిస్తున్నారు. ఎందుకంటే నాలుగున్నరేళ్ళు రైతు రుణమాఫీపై పెద్దగా దృష్టిపెట్టని కేసీయార్ ఇపుడు హడావుడిగా ఎందుకు ఉరుకులు పరుగులు పెడుతున్నట్లు ? ఆదాయార్జన శాఖల ఉన్నతాధికారుల నెత్తిన కూర్చుని నిధులను సేకరిస్తున్నారు. ఎందుకంటే భయం, అవును గెలుపుపై భయంతోనే రైతు రుణమాఫీ కోసం నిధులను చాలా స్పీడుగా సేకరిస్తున్నారు. సుమారు నెలరోజుల వ్యవధిలోనే దాదాపు 16 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమయ్యేందుకు రెడీ అయ్యింది.
రుణమాఫీకి మొత్తం రు. 27 వేల కోట్లు కావాలి. ఇప్పటికి సుమారు రు. 4 వేల కోట్ల దాకా మాఫీ జరిగింది. ఇంకా 23 వేల కోట్ల రూపాయలు జరగాల్సుంది. షెడ్యూల్ ఎన్నికలు మరో నాలుగు నెలల్లోకి వచ్చేసింది. ఇపుడు గనుక అర్జంటుగా మొత్తం రుణాలు మాఫీ కాకపోతే రేపటి ఎన్నికల్లో బీఆర్ఎస్ కు రైతుల నుండి పెద్ద షాక్ కొట్టడం ఖాయం. అందుకనే ఓటమిభయంతోనే జెట్ వేగంతో నిధులను సేకరిస్తున్నారు. భూముల వేలంపాటల్లో సుమారు రు. 7 వేల కోట్లు, ఓఆర్ఆర్ లీజుల రూపంలో మరో రు. 7 వేల కోట్లు, లిక్కర్ అప్లికేషన్ల ద్వారా రు. 2 వేల కోట్లు వస్తుందని అంచనా వేస్తోంది.
సో, పై రూపాల్లో ప్రభుత్వానికి సుమారుగా రు. 16 వేల కోట్లు వచ్చే అవకాశాలున్నాయి. అంటే మిగిలింది మరో రు. 7 వేల కోట్లు మాత్రమే. ఒకరకంగా ఇది చిన్నమొత్తమనే అనుకోవాలి. రు. 7 వేల కోట్లను సేకరించటం ప్రభుత్వానికి పెద్ద విషయంకాదు. ఇప్పటికి 10.8 లక్షల రైతుల ఖాతాల్లో రు. 6,546 కోట్లు జమచేయటానికి రెడీ అయ్యింది. అంటే లక్ష రూపాయల లోపు రుణాలు క్లియర్ అవ్వబోతున్నాయి. మొత్తంమీద రు. 7,700 కోట్లు మాఫీ అయినట్లు.
ఆగష్టు నెలలోనే కాకపోయినా సెప్టెంబర్ నెలలో అయినా 7 వేల కోట్ల రూపాయలను సేకరించి మొత్తం రైతు రుణమాఫీని చేసేయటం ఖాయమనే అనిపిస్తోంది. అంటే ఎన్నికల భయం కేసీయార్లో ఎంతగా పెరిగిపోయిందో దీనితో అర్ధమైపోయింది. ఈ భయమేదో మొదటినుండి ఉండుంటే రైతురుణమాఫీ చేయటంలో ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం ఉండేదికాదు. మొత్తానికి రాబోయే ఎన్నికల పుణ్యమాని రైతుల రుణాలు మాఫీ అయితే అంతకన్నా కావాల్సిందేముంది.