• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నమ్మరేంటండి బాబు......

నమ్మరేంటండి బాబు... కలిసిన టీడీపీ - వైసీపీ.... కాంగ్రెస్ - జనసేనతో ఫైట్!

| ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం, వైసీపీ జెండాలు ఒక చోటకు చేరాయి.. కలిసి ప్రయాణిస్తున్నాయి.. కాంగ్రెస్ - జనసేనలను ఓడించాలని తపిస్తున్నాయి.

By - Tupaki Desk
Update: 2025-01-31 06:17 GMT

వైసీపీ, టీడీపీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయంటే నమ్ముతారా.. ఒకే ర్యాలీలో రెండు పార్టీల జెండాలూ ఒకేసారి రెపరెపలాడుతూ ఉన్నాయంటే ఊహించగలరా.. బీజేపీకి అత్యంత మిత్రపక్షంగా ఉన్న జనసేన.. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తుందని, అది వైసీపీ - టీడీపీ లను ఓడించాలని ప్రయత్నిస్తుందని చెబితే వింటారా.. పైన చెప్పుకున్నవన్నీ తాజాగా జరుగుతున్నాయి.

అవును... అవసరం ఎంతటిపనైనా చేయిస్తుందని అంటారు.. అవకాశం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా ప్రోత్సహిస్తుందని అంటారు.. పైగా.. ఇతర ప్రాంతంలో బండి నడవాలంటే కొన్నిసార్లు కలవక తప్పదనే చెబుతుంటారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం, వైసీపీ జెండాలు ఒక చోటకు చేరాయి.. కలిసి ప్రయాణిస్తున్నాయి.. కాంగ్రెస్ - జనసేనలను ఓడించాలని తపిస్తున్నాయి.

వివరాళ్లోకి వెళ్తే... తెలంగాణలోని ఖమ్మం జిల్లా సంగతి తెలిసిందే. భౌగోళికంగా ఆ ప్రాంతం తెలంగాణలో ఉన్నా.. అక్కడ ఏపీ మూలాలు కీలక ప్రభావం చూపిస్తాయనే అంటారు. ఖమ్మంలో సగం మంది గోదారోళ్లు ఉంటారని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో అక్కడున్న సారిపాక ఐటీసీ కంపెనీకి కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి.

ఈ కంపెనీలో అధికారికంగా మొత్తం 5 వేల మంది వరకూ కార్మికులు ఉన్నప్పటికీ.. గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్నవారి సంఖ్య 1,253 అని చెబుతున్నారు. ఇక్కడ ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతుంటాయి. ఎప్పటిలాగానే ఈసారి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఐఎన్టీయూసీ’ ని ఓడించేందుకు టీడీపీ నేతృత్వంలోని ‘టీఎన్టీయూసీ’ ప్రయత్నిస్తుంది.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఐఎన్టీయూసీ ని ఓడించాలని టీఎన్టీయూసీ ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో టీఎన్టీయూసీ గెలుపును కాంక్షిస్తూ టీడీపీ - వైసీపీ ఏకం అయ్యాయి. అయితే ఇలా టీడీపీ - వైసీపీ కలిసి పోటీ చేయడం ఇదే తొలిసారి కాదు. గత ఎన్నికల్లోనూ ఇలానే కలిసి పోటీ చేసి విజయం కూడా సాధించాయి.

ఈ క్రమంలో తాజా ఎన్నికల్లోనూ మరోసారి కలిసి విజయం సాధించాలని ఫిక్సయ్యాయి. ఆ సంగతి అలా ఉంటే... మరోవైపు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఐఎన్టీయూసీ తో ఇప్పుడు జనసేన జతకట్టింది! అయితే.. జనసేనలో కొంతమంది టీడీపీ - వైసీపీలకు సపోర్ట్ చేస్తుండగా.. మరికొంతమంది కాంగ్రెస్ కు మద్దతు పలుకుతున్నారని అంటున్నారు.

ఏది ఏమైనా... ఒక చోట టీడీపీ - వైసీపీ జెండాలు కలిసిపోయి కనిపించడం మాత్రం రాజకీయంగా తీవ్ర ఆసక్తిని కలిగిస్తోంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు ఈ పోలింగ్ ప్రారంభమవ్వగా.. సాయంత్రం 4 గంటల వరకూ జరగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారని అంటున్నారు.

Tags:    
  • TelanganaPolitics 
  • TDP 
  • YSRCP 
  • Congress 
  • Janasena 
  • TgPolitics 
  • TDPFlags 
  • YCPFlags 
  • Telangana 
  • Politicalnews 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS