తెలంగాణకు క‌రెంటు క‌ష్టాలు!

ఇదే స‌మ‌యంలో ఏపీలో మాత్రం మిగులువిద్యుత్ ల‌భిస్తోంది. అయితే..దీనిని త‌క్ష‌ణ అవ‌స‌రాల‌తోపాటు దీర్ఘ‌కాలిక ప్రాజెక్టుల‌కు కూడా వినియోగిస్తున్నారు.

Update: 2026-10-04 03:47 GMT

ప్ర‌స్తుతం తెలంగాణ స‌మాజంలో పెద్ద ఎత్తున క‌రెంటు క‌ష్టాలు ఇబ్బందిగా మారాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప‌గ‌టి పూట ఉద‌యం 6 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు అన‌ధికార క‌రెంటు కోత‌లు సాగుతున్నాయి. హైద‌రాబాద్‌, వరంగ‌ల్‌, ఖ‌మ్మం, క‌రీంన‌గ‌ర్ వంటి ప్ర‌ముఖ న‌గ‌రాల‌ను మిన‌హాయిస్తే.. ఇత‌ర న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో కూడా క‌రెంటు కోత‌లు ష‌రా మామూలే అన్న‌ట్టుగా మారుతున్నాయి. అయ్యా.. యూనిట్‌కు 10 రూపాయ‌లు చొప్పున ఇస్తాం.. మాకు క‌రెంటు ఇవ్వండి అని తెలంగాణ ప్ర‌భుత్వం కోరుతున్నా.. ఆదుకునే రాష్ట్రం క‌రువైంది.

ఎందుకు?

ప్ర‌స్తుతం ఎల్‌నినో కార‌ణంగా.. ప్ర‌పంచ వ్యాప్తంగా స‌గానికిపైగ ఆదేశాలు ఎఫెక్ట్ అయ్యాయి. దీంతో వ‌ర్షాలు లేక‌.. చుక్క‌నీరు అంద‌క ఇబ్బందులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా సాగు మాట ఎలా ఉన్నా.. నిత్యావ‌స‌రంగా మారిన విద్యుత్ అందుబాటులో లేక క‌ష్టాలు వ‌చ్చి ప‌డ్డాయి. తెలంగాణ‌లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. నీటి నుంచి.. బొగ్గు నుంచి కూడా విద్యుత్ తీస్తున్నా.. అవిఏమాత్రం సరిపోవ‌డం లేద‌ని అధికారులు చెబుతున్నారు. నీటి కొర‌త‌తో విద్యుత్ ఉత్ప‌త్తి మంద‌గించింది. బొగ్గుతో వ‌చ్చే విద్యుత్ కూడా చాలినంత‌రావ‌డం లేద‌ని అంటున్నారు.

ఏపీలో మిగులు..

ఇదే స‌మ‌యంలో ఏపీలో మాత్రం మిగులు విద్యుత్ ల‌భిస్తోంది. అయితే..దీనిని త‌క్ష‌ణ అవ‌స‌రాల‌తోపాటు దీర్ఘ‌కాలిక ప్రాజెక్టుల‌కు కూడా వినియోగిస్తున్నారు. ప్ర‌స్తుతం రాయ‌ల‌సీమ‌లో 8 జిల్లాల్లో సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కాన్ని వ‌డివ‌డిగా అమలు చేయ‌డంతో ఇక్కడ సౌర విద్యుత్ వెలుగులు ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను త‌ప్పించాయి. మ‌రోవైపు.. మిగిలిన విద్యుత్‌ను విక్ర‌యిస్తున్నారు. దీంతో మిగులు విద్యుత్ లెక్క‌లు ఏపీలో బాగానే ఉన్నాయి. కానీ, క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌ల్లో మాత్రం విద్యుత్ క‌ష్టాలు కొన‌సాగుతున్నాయి.

మోడీని కాద‌న‌డ‌మే!..

మారుతున్న క‌రెంటు అవ‌స‌రాలు.. పెరుగుతున్న‌డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కేంద్రంలోని మోడీస‌ర్కారు 2015 నుంచి సూర్య ఘ‌ర్ పేరుతో సౌర విద్యుత్ ఫ‌ల‌కాల ప‌థ‌కాన్నిఅమ‌లు చేస్తోంది. అయితే.. దీనిని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అందిపుచ్చుకోవ‌డం లేదు. రాజ‌కీయాల కోణంలోనే పాల‌న సాగిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చిన ప‌ట్టించుకోవ‌డం లేదు. గ‌తంలో తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ నుంచి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వ‌ర‌కు పీఎం సూర్య‌ఘ‌ర్‌ను ప‌ట్టించుకోలేదు.

దీంతో తెలంగాణ‌లో పూర్తిగా విద్యుత్ అవ‌స‌రాల‌కు.. నీరు, బొగ్గుపైనే ఆధార‌ప‌డు తున్నారు. ఏపీలోమాత్రం.. గ‌తంలో జ‌గ‌న్‌, ప్ర‌స్తుతం చంద్ర‌బాబు సైతం.. కేంద్రంతో మ‌చ్చిక‌గానే ఉంటూ.. ప‌థ‌కాల‌ను వినియోగించు కుంటున్నారు. ఫ‌లితంగా సీమ స‌హా.. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల పీఎం సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కం కింద సౌర‌ఫ‌ల‌కాల‌ను ప్ర‌తి ఇంటిపై ఏర్పాటు చేయించారు. దీంతో విద్యుత్ క‌ష్టాల‌కు చెక్ ప‌డింది. కానీ, తెలంగాణ మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

Tags:    

Similar News