రీల్ కాదు రియల్: ఇద్దరు యువతులతో యువకుడి పెళ్లి

తెలంగాణలో జరిగిన ఈ పెళ్లి గురించి విన్నంతనే రీల్ కథ మాదిరి అనిపిస్తుంది. కానీ.. రియల్ గా జరిగిన ఈ ఉదంతంలో తాను ప్రేమించిన ఇద్దరి అమ్మాయిల్ని ఒకేసారి పెళ్లి చేసుకున్న వైనం ఆసక్తికరంగా మారింది.;

Update: 2025-03-29 04:09 GMT

తెలంగాణలో జరిగిన ఈ పెళ్లి గురించి విన్నంతనే రీల్ కథ మాదిరి అనిపిస్తుంది. కానీ.. రియల్ గా జరిగిన ఈ ఉదంతంలో తాను ప్రేమించిన ఇద్దరి అమ్మాయిల్ని ఒకేసారి పెళ్లి చేసుకున్న వైనం ఆసక్తికరంగా మారింది. తంతే బూరెల గంపలో పడ్డట్లగా ఉన్న ఈ ఉదంతంలోకి వెళితే..

తెలంగాణలోని కుమురంభీం- ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఆసక్తికర ఉదంతంలో అబ్బాయి పేరు సూర్యదేవ్. ఊరు లింగాపూర్ మండలం ఘుమనూర్. ఈ యువకుడు తమ ఊరికి పక్కనే ఉన్న రెండు గ్రామాలకు చెందిన లాల్ దేవి.. జల్కర్ దేవిలతో కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఒకే టైంలో ఇద్దరు యువతుల ప్రేమలో పడిన ఇతగాడి వ్యవహారం బయటకు వచ్చింది.

యాక్షన్ మూవీలో మాదిరి రచ్చ సీన్లకు బదులుగా.. ఇరు గ్రామాల గ్రామపెద్దలు రంగంలోకి దిగారు. ఇరు కుటుంబాలతోనూ.. యువతులతోనూ మాట్లాడారు. ఈ ఇద్దరు యువతులకు సూర్యదేవ్ ను పెళ్లి చేసుకోవటానికి ఎలాంటి అభ్యంతరంలేదని స్పష్టం చేశారు. ముగ్గురు కలిసి బతికేందుకు ఓకే చెప్పేశారు. దీంతో.. వీరి పెళ్లిని ఆదివాసీ పెద్దల సమక్షంలో.. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆహ్వానపత్రికలు ప్రింట్ చేయించి మరీ పెళ్లి చేశారు ఆదివాసీ కల్చర్.. సంప్రదాయాల ప్రకారం ఈ పెళ్లి జరిగింది. స్థానికంగా ఈ ఉదంతం ఆసక్తికరంగానే కాదు హాట్ టాపిక్ అయ్యింది.

Tags:    

Similar News