ఈ కంపెనీలకు వర్క్ ఫ్రం హోం.. బిగ్ అలర్ట్..!

ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని సీఎం అధికారులకు ఆదేశాలిచ్చారు. అదే సమయంలో నగర ప్రజలు, ముఖ్యంగా ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని పోలీసులు కొన్ని కీలక సూచనలు చేశారు.;

Update: 2025-09-26 08:31 GMT

తిరోగమణ రుతుపణాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో జనజీవనం స్తంభించింది. బయటకు వెళ్లాలంటే కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గత రాత్రి (సెప్టెంబర్ 25) నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగర జీవినం స్తంభించింది. ఇవాళ, రేపు (సెప్టెంబర్ 26, 27) అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని సీఎం అధికారులకు ఆదేశాలిచ్చారు. అదే సమయంలో నగర ప్రజలు, ముఖ్యంగా ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని పోలీసులు కొన్ని కీలక సూచనలు చేశారు.

ఐటీ కంపెనీలకు కమిషనర్ సూచనలు..

వీలైనంత వరకు వర్క్ ఫ్రం హోంను ఎంచుకోవాలని కమిషనర్ ఐటీ కంపెనీలకు సూచించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు సంయుక్తంగా ఐటీ కంపెనీలకు పలు విజ్ఞప్తులను పంపాయి. దీనివల్ల రోడ్లపై వాహనాల రద్దీ తగ్గడమే కాకుండా.. వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొనే ప్రమాదాలు తగ్గుతాయని పోలీసులు స్పష్టం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మూడు రోజుల పాటు ఈ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

ట్రాఫిక్ సమస్యలకు చెక్..

భారీ వర్షాల కారణంగా రెండు మూడు రోజులు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నగరంలోని రహదారులపై వర్షం నీరు చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిలో ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసుకుంటే వారికి సైతం ఊరటగా ఉంటుందని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.

వర్క్ ఫ్రం హోంకే ప్రిఫరెన్స్..

ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రమ్ హోంకే ప్రిఫర్ చేస్తున్నారు. రోడ్లపై చిక్కుకుపోయే పరిస్థితులను నివారించేందుకు తమ భద్రత కోసం ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. దూర ప్రాంతాల నుంచి ప్రయాణించే వారికి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక పెద్ద ఉపశమనం కలుగుతుంది.

శుక్ర, శనివారాల్లో మోస్తరు నుంచి భారీ..

భారత వాతావరణ శాఖ (IMD) తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన తాజా బులెటిన్‌లో శుక్ర, శనివారాల్లో మోస్తరు నుంచి భారీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో పాటు గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవడం, రవాణా వ్యవస్థ అంతరాయం కలగడం, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉందని స్పష్టంగా పేర్కొంది.

ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

ప్రత్యేకించి తెలంగాణలోని ఆదిలాబాద్, కొమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ వంటి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. వారం పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని, సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిరంతర వర్షపాతం ఉండే అవకాశముందని తెలిపింది.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..

ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు చోటుచేసుకుంటాయని హెచ్చరికలు జారీ చేసింది. గాలుల వేగం 30 నుంచి 50 కి.మీ. వరకు పెరిగే అవకాశం ఉండడంతో బలహీన నిర్మాణాలు, చెట్లు, విద్యుత్ లైన్లు కూలిపోవచ్చని సూచించారు. ఇదే సమయంలో వాతావరణ సమస్యల కారణంగా విమానాయాన రంగంలో కూడా తీవ్ర అంతరాయం ఏర్పడ్డాయి. హైదరాబాద్‌కు రావాల్సిన అనేక విమానాలు రద్దయ్యాయి. కొన్నింటిని దారి మళ్లించారు. కోల్‌కత్తా, ముంబై, పూణె నుంచి బయల్దేరిన ఇండిగో విమానాలు విజయవాడకు మళ్లించారు. ఇది విమాన ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసింది.

చురుకుగా కొనసాగుతున్న రుతుపవణాలు..

రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు చురుకుగా కొనసాగుతున్న నేపథ్యంలో రోజూ వర్షాలు పడతాయని అంచనా వేసింది. హైదరాబాద్ పోలీసుల తాజా సూచనతో ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తే, రోడ్లపై వాహనాల రద్దీ తగ్గుతుంది. ట్రాఫిక్ సమస్య కొంత మేర తగ్గడమే కాకుండా ప్రజల భద్రత కూడా కాపాడబడుతుంది. ఈ నిర్ణయం ఉద్యోగులు, కంపెనీలు కలిసి పాటిస్తే వర్షాల సమయంలో నగర జీవన విధానం సురక్షితంగా కొనసాగుతుంది.

Tags:    

Similar News