తెలంగాణ వాసుల్ని వేధిస్తున్న టాప్ 2 ఆరోగ్య సమస్యలివే
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టే వ్యాధులు ఏమిటి? అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన నివేదిక.. షాకింగ్ నిజాల్ని వెల్లడించింది.;
అందరూ అప్రమత్తమయ్యే నివేదిక ఒకటి బయటకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టే వ్యాధులు ఏమిటి? అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన నివేదిక.. షాకింగ్ నిజాల్ని వెల్లడించింది. గడిచిన ఐదేళ్లలో ఆరోగ్య శ్రీలో నమోదు అవుతున్న కేసుల ఆధారంగా ఈ అధ్యయనం చేశారు. దీని ప్రకారం తెలంగాణలో నమోదవుతున్న టాప్ టెన్ ఆరోగ్య సమస్యల్లో మొదటి స్థానాలో కిడ్నీ సమస్య కాగా.. టాప్ 2లో క్యాన్సర్ కేసులు నమోదు కావటాన్ని గుర్తించారు.
2020 - 2025 మధ్యకాలంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో నమోదైన కేసుల సమాచారాన్ని తీసుకొన్న వైద్య శాఖ అందులోని అంశాల్ని విశ్లేషించింది. ఇందులో అత్యధికంగా నమోదయ్యే టాప్ 10 కేసుల జాబితాను సిద్ధం చేసింది. ఇందులో పేర్కొన్న వివరాల ప్రకారం చూస్తే..
1. కిడ్నీ
2. క్యాన్సర్
3. ఆర్థోపెడిక్
4. కార్డియాలజీ
5. జనరల్ మెడిసిన్
6. ఆప్తమాలజీ
7. న్యూరో సైన్స్
8. జనరల్ సర్జరీ
9. పిడియాట్రిక్స్
10. గైనకాలజీ
గడిచిన ఐదేళ్ల కాలంలో తెలంగాణలో అత్యధికంగా 3.63 లక్షల కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానంలో క్యాన్సర్ కేసులు 3.06 లక్ష్లు నమోదు కాగా.. ఆర్థోపెడిక్ 1.91 లక్షలు.. కార్డియాలజీ 1.45 లక్షల కేసులు ఉన్నాయి. దీంతో.. రాష్ట్రంలో అత్యధికంగా నమోదు అవుతున్న కేసుల విభాగాలకు సంబంధించిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని నిర్ణయించింది. కేసులు ఎక్కువగానమోదవుతున్న విభాగాల్ని గుర్తించి.. ఆయా రంగాల నిఫుణుల సంఖ్యను పెంచుకోవటంతో పాటు.. మెరుగైన వైద్య చికిత్సలు అందేలా ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు.
ఇందులో భాగంగా కిడ్నీ కేసులు ఎక్కువైన నేపథ్యంలో ప్రతి 25 కి.మీ. ఒక డయాలసిస్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. అదే సమయంలో క్యాన్సర్ కేసులు అత్యధికంగా నమోదవుతున్ననేపథ్యంలో జిల్లా కేంద్రాల్లో క్యాన్సర్ చికిత్సకు అవసరమైన ఏర్పాట్లను చేపట్టాలని భావిస్తున్నారు. ఏమైనా.. ఈ అధ్యయనం తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై అవగాహన కలిగేలా చేస్తున్నాయని చెప్పక తప్పదు.