రేవంత్ కి మహేష్ గౌడ్ కి గ్యాప్ ఉందా...పీసీసీ చీఫ్ ఏమంటున్నారు ?
తెలంగాణా కాంగ్రెస్ లో రెండు వర్గాలు ఉన్నాయని అంటున్నారు. అలా కనుక ఉంటే పార్టీకి అది ఇబ్బంది కరం కాదా అన్న మాట ఉంది.
తెలంగాణా కాంగ్రెస్ లో రెండు వర్గాలు ఉన్నాయని అంటున్నారు. అలా కనుక ఉంటే పార్టీకి అది ఇబ్బంది కరం కాదా అన్న మాట ఉంది. అలాగే కాంగ్రెస్ లో అంతకంతకు అసంతృప్తి గొంతులు పెద్దవి అవుతున్నాయి. మంత్రుల నుంచి కీలక నేతల నుంచి బాహాటంగానే అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు. అలాగే నేతల మధ్య విభేదాలతో విమర్శలు చేస్తున్నారు. సొంత పార్టీ మీద ప్రభుత్వం మీద కూడా మాట్లాడుతున్నారు. పైకి అంతా వన్ మాన్ షోగా కనిపిస్తున్నా తెలంగాణా కాంగెర్స్ లో ఏదో తెలియని అసంతృప్తి ఉందని అన్న మాట ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీని మరో రెండు మూడు సార్లు అధికారంలోకి తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే గట్టిగానే చెబుతున్నారు, అసలు అటువంటి పరిస్థితి ఉందా, ఐకమత్యం అంతా మాటల్లోనేనా చేతల్లో కనిపిస్తోందా ఇత్యాది ప్రశ్నలు ఎన్నో జనాలలో ఉన్నాయి. రాజకీయ జనాలలో ఉన్నాయి.
అసంతృప్తి సహజం అంటూ :
ఇదిలా ఉంటే తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రముఖ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చూస్తే కనుక కాంగ్రెస్ లో అసంతృప్తి సహజం అని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. అంతే కాదు కాంగ్రెస్ లో రెండు వర్గాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒక వర్గం అయితే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో వర్గంగా ఉన్నారని యాంకర్ అడిగిన ప్రశ్నకు పీసీసీ చీఫ్ ఏమి చెప్పారో తెలియదు. కానీ ఇంట్రెస్టింగ్ గానే ఈ ఇంటర్వ్యూ ఉండబోతోంది అని ప్రోమోని బట్టే తెలుస్తోంది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణాకు చెందిన కొందరు నేతలే కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షీ నటరాజన్ కి రాజ్యసభ సీటు దక్కకుండా చేశారు అన్నది కూడా యాంకర్ సూటిగా ప్రశ్నించారు. మరి దీనికి పీసీసీ చీఫ్ బదులేమి చెప్పి ఉంటారో కానీ కాంగ్రెస్ లో మూలాల్లోకి వెళ్ళి మరీ అన్నీ అడిగేసినట్లుగానే ఈ ఇంటర్వ్యూ ఉంది అనిపిస్తోంది.
డబ్బులు వసూలు చేసి :
ఇక తెలంగాణా నుంచి డబ్బులు వసూలు చేసి ఏఐసీసీకి పంపిస్తున్నారు అన్న దానికి కూడా పీసీసీ చీఫ్ జవాబు ఏమి అయి ఉంటుంది అన్నది మరో ఆసక్తిని కల్పించే విషయంగా ఉంది. ఇక కాంగ్రెస్ లో టికెట్లు ఇచ్చేది అధిష్టానమా లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినా అన్న ప్రశ్న కూడా కీలకమైనదే. ఎందుకంటే ఇటీవల జరిగిన ఇక సభలోనే ఏకంగా రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు అని అంటూ కన్ ఫర్మ్ చేసేసారు. దాని మీదనే మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి మీదనే ఘాటు విమర్శలు చేశారు. దాంతో కొండా సురేఖ వ్యవహారం కాస్తా క్రమశిక్షణా చర్యల దాకా వచ్చి హాట్ టాపిక్ అయింది అని అంటున్నారు.
కోమటిరెడ్డి ఎపిసోడ్ సైతం :
అదే విధంగా మునుగోడు సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవటం అంటే కాంగ్రెస్ మాట తప్పినట్లు కాదా అన్నది కూడా పీసీసీ చీఫ్ కి ఎదురైన మరో ప్రశ్న. ఆయనకు ఆ హామీతోనే తిరిగి కాంగ్రెస్ లోకి తెచ్చారు అన్నది తరచూ చెబుతున్నారు. మరొ సగం పాలన పూర్తి అయినా ఆయన హామీ నెరవేరలేదు అని అంటున్నారు. వీటన్నింటి మీద మహేష్ గౌడ్ ఏమి చెప్పారన్నది ఇంట్రెస్టింగ్. విషయానికి వస్తే ఆయన ఏమి చెప్పినా కూడా కాంగ్రెస్ లో అది సంచలనమే అవుతుందని అంటున్నారు. శనివారం ప్రసారం అయ్యే ఈ ఇంటర్వ్యూ టీ కాంగ్రెస్ లో రాజకీయ వేడిని పెంచుతుందా లేక ఏమి చేస్తుంది అన్నది వేచి చూడాల్సిందే.