నేపాల్ మహా విళయం...అమ్మ ముందే హెచ్చరించిందా ?

నేపాల్ లో కనీ వినీ మహా ప్రళయం సంభవించింది. కేవలం ఇరవై అయిదు నిముషాల్లోనే పచ్చని ప్రాంతం అంతా మరు భూమిగా మారిపోయింది.

Update: 2026-08-28 18:30 GMT

నేపాల్ లో కనీ వినీ మహా ప్రళయం సంభవించింది. కేవలం ఇరవై అయిదు నిముషాల్లోనే పచ్చని ప్రాంతం అంతా మరు భూమిగా మారిపోయింది. భారీ భవనాలు నేలమట్టం అయిపోయాయి. అంతవరకూ కళకళలాడుతూ ఉన్న ప్రదేశం అంతా శ్మశానాన్ని తలపించింది. కట్టలు తెంచుకుని వచ్చిన పడిన భారీ నీటి ప్రవాహంలో అంతా కొట్టుకు పోయారు. అన్నీ పూర్తిగా తనలో కలిపేసుకుని జల ఖడ్గం కత్తులు ఝళిపించింది. కరాళ నృత్యం చేసింది. ప్రకృతి ప్రకోపం అంటే ఏమిటో తెలియచేసింది. సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన వీడియోల్లో దీనిని చూసి ప్రపంచం మొత్తం భయకంపిత గా మారింది.

అమ్మ పలికిందా :

అయితే ఇంతటి మహా ప్రళయం సంభవిస్తుంది అని స్థానిక భగవతి అమ్మ వారు ముందే హెచ్చరించారా అంటే అవును అంటున్నారు. ఆమె ఏమి చెప్పింది ఎలాంటి హెచ్చరికలు చేసింది అంటే అదొక విశేషమే. ఆసక్తికరమే అని భావించాలి. నేపాల్ పాలంచోక్ భగవతి అమ్మవారు రెండు రోజుల క్రితమే నేపాల్‌ను హెచ్చరించారని అంటున్నారు. అంటే బుధవారం ఉదయం వచ్చి పడిన మెరుపు వరదలు కంటే రెండు రోజుల ముందు అన్న మాట. అలా అత్యంత వినాశకరమైన రసువా వరదలు సంభవించాయి. పాలంచోక్ భగవతి విగ్రహానికి అప్పటికి రెండు రోజుల క్రితం చెమటలు పట్టడం మొదలైందనే వార్త వచ్చిందట. గతంలో కూడా అమ్మవారికి ఇలా జరిగితే దానిని స్థానిక ప్రజలు సాంప్రదాయం ప్రకారం ఒక దుశ్శకునంగా భావిస్తారు. దాంతోనే ఏదో జరుగుతుందని స్థానికంగా కొందరు ముందే ఊహించారని అంటున్నారు.

ఇది మూడవసారి :

ఈ విధంగా భగవతి అమ్మవారు సంకేతాలు ఇవ్వడమేంటి ఒక్కసారిగా వరదలు వచ్చి విరుచుకుపడ్డాయి. మొత్తానికి మొత్తం తుడిచిపెట్టుకుని పోయింది. భగవతి అమ్మ వారు ఈ విధంగా హెచ్చరికలు జారీ చేయడం ఇదే మొదటిసరి కాదు అని అంటున్నారు. అంతకు ముందు కూడా ప్రమాద పరిస్థితులు ముప్పు ఉన్నప్పుడు అమ్మ ఇలాగే సంకేతాలు పంపించేవారు అని స్థానికులు చెబుతున్నారు. పాత విషయాలను ఇపుడు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. పాలంచోక్ భగవతి అమ్మవారు 1987 అలాగే అంతకు ముందు 1974లో కూడా ఈ తరహా సంకేతం ఇవ్వగా ఆ మరుసటి రోజే నేపాల్‌లో పెద్ద భూకంపం సంభవించింది.

వేల ఏళ్లుగా నమ్మకం :

ఇది ఒక్క సారి కాదు ఒక్క రోజు మాట కాదు పాలంచోక్ భగవతి అమ్మవారు అంటే స్థానికులకు అంత నమ్మకం. అమ్మ హెచ్చరిస్తోంది అంటే భారీ విలయం తప్పదని అర్ధంగా చెప్పుకుంటారు. ఇది వేల ఏళ్లుగా వస్తున్న నమ్మకం. అలాగే జరుగుతూండడంతోనే అంతా మరింత భక్తిగా నమ్ముతున్నారు. నిజానికి పాలంచోక్ భగవతి అమ్మవారు .విగ్రహానికి ఎందుకు చెమటలు పడతాయి అనే దానికి వేరే విధమైన శాస్త్రీయ వివరణ కూడా ఉండవచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో ఆ సంకేతాలే నిజమైనప్పుడు మానవాతీత శక్తిని అంతా నమ్మక తప్పదు అని ఆధ్యాత్మికపరులు అంటున్నారు. ఏది ఏమైనా నేపాల్ మహా విలయం మాత్రం ప్రపంచాన్నే నివ్వెరపరచి ఉలిక్కిపడేలా చేసింది.

Tags:    

Similar News