• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏసీబీ విచారణ తర్వాత...

ఏసీబీ విచారణ తర్వాత కేటీఆర్ అరెస్టు కానున్నారా?

| ఈ వ్యవహారంలో తాను తప్పే చేయలేదని తేల్చేయటమే కాదు.. ఇదో కేసా? అంటూ కొట్టి పారేస్తున్నారు కేటీఆర్.అయితే.. ఆయన చెప్పినంత తేలికైన కేసుగా మాత్రం చెప్పటం తప్పే అవుతుంది.

By - Tupaki Desk
Update: 2025-01-06 05:20 GMT

ఇదిగో తోక అంటే.. అదిగో పులి అన్న పాత రోజుల నుంచి తోక కూడా లేకుండానే పులిని క్రియేట్ చేయటమే కాదు.. ఆ అంశాన్ని వైరల్ చేసేసి.. ఏదో ఉంది బాస్ అన్న అనుమానాన్ని బలంగా కల్పించే విషయంలో సోషల్ మీడియా పోషిస్తున్న శక్తివంతమైన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అలా అని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యేవన్నీ అబద్ధాలేనా? అంటే కాదనే చెప్పాలి. అయితే.. ఏది నిజం? మరేది అబద్ధం? అన్నది తేల్చటమే ఇప్పుడున్న పరిస్థితుల్లో అతి పెద్దసవాలుగా చెప్పాలి. ఫార్ములా ఈ రేస్ వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తెలంగాణలోనే కాదు ఏపీలోనూ ఈ అంశంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. తాజాగా ఏసీబీ జారీ చేసిన నోటీసుకు స్పందనగా ఈ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ముఖ్యనేతల్లో ఒకరైన కేటీఆర్ విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ రోజు (సోమవారం) ఉదయం ఏసీబీ ఎదుట హాజరయ్యే కేటీఆర్ ను.. విచారణ అనంతరం అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే.. దీనికి సంబంధించిన అవకాశాలు ఎన్ని ఉన్నాయి? అన్నదిప్పుడు చర్చగా మారింది.

ఈ వ్యవహారంలో తాను తప్పే చేయలేదని తేల్చేయటమే కాదు.. ఇదో కేసా? అంటూ కొట్టి పారేస్తున్నారు కేటీఆర్.అయితే.. ఆయన చెప్పినంత తేలికైన కేసుగా మాత్రం చెప్పటం తప్పే అవుతుంది. ఫార్ములా ఈ రేస్ కు సంబంధించిన కుదుర్చుకున్న ఒప్పందాలు పెద్ద నేరాలు కానప్పటికీ.. విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరపటం.. అందులోనూ మంత్రివర్గం ఆమోదం లేకపోవటం.. రిజర్వు బ్యాంక్ కు సమాచారం ఇవ్వకపోటమే తలనొప్పి అంశాలుగా చెబుతున్నారు.

కేటీఆర్ చెప్పినట్లుగా తనపై చేస్తున్న ఆరోపణల్లో పస లేకుంటే.. విషయం ఇక్కడి దాకా వస్తుందా? విచారణకు ఏసీబీ ఎదుట హాజరయ్యే వరకు వెళుతుందా? అన్నది మరో ప్రశ్న. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. న్యాయపరంగా తమకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని విడిచి పెట్టని కల్వకుంట్ల ఫ్యామిలీ.. ఏసీబీ ఎదుట హాజరు కాకుండా ఉండేందుకు ఏ చిన్న అవకాశం ఉన్నా.. వాటిని వినియోగించకకుండా ఉంటారా? అన్నది మరో మాటగా చెప్పాలి.

తీవ్రచర్చగా మారిన కేటీఆర్ అరెస్టు విషయానికి వస్తే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అరెస్టు అవకాశాలు చాలా తక్కువగా చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్ అరెస్టు అయితే.. రేవంత్ సర్కారు బద్నాం కావటం ఖాయమంటున్నారు. ఎవరు అవునన్నా.. కాదన్నా రాజకీయ కక్షతోనే అరెస్టు జరిగిందన్న ప్రచారాన్ని ప్రజలు ఎక్కువగా నమ్మటం ఖాయమంటున్నారు. ఈ కేసు విచారణ.. అందులో వెలుగు చూసే అంశాలు ప్రజలకు వెళ్లి.. ఫార్ములా ఈ రేస్ లో కేటీఆర్ తప్పు చేసినట్లుగా మెజార్టీ ప్రజలు నమ్మే వరకు.. వారి మైండ్ లో చేసిన తప్పునకు శిక్ష పడాలి కదా? అన్న భావన బలంగా నాటుకునే వరకు కేటీఆర్ అరెస్టు ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందన్నది కొద్ది గంటల్లో తేలిపోనుంది.

Tags:    
  • Ktr 
  • ACB 
  • Telanganapolice 
  • Brs 
  • Kcr 
  • Harishrao 
  • Bjp 
  • Congress 
  • Revanthreddy 
  • Telanganagovernment 

Similar News

తోపు క్రికెటర్ అయినా.. పబ్లిక్ లో భార్యకు గజగజ వణికిపోయాడు.. వైరల్ వీడియో

2026-11-12 19:30 GMT

వైసీపీ ఏకైక జడ్పీ ఛైర్ పర్సన్ గా వంతల శాంతి

2026-11-12 18:33 GMT

పెట్టుబడుల భద్రతా చట్టం.. కేంద్రానికి చంద్రబాబు సంచలన ప్రతిపాదన

2026-11-12 18:30 GMT

ప్రపంచానికి పెద్దన్న.. సొంత ఇంటి గడపలో మాత్రం భద్రత సున్నా..

2026-11-12 18:29 GMT

ఫస్ట్ డే సమ్మిట్ హిట్.. ఒప్పందాలో బిగ్ షాట్స్

2026-11-12 18:29 GMT

నారా లోకేష్‌ 'రాక్‌స్టార్ మినిస్టర్' .. ఉపాసన కొణిదెల ప్రశంసల వెనుక సందేశం అదే..

2026-11-12 18:27 GMT

పొగరుబోతు నార్వే జర్నలిస్టుకు తగిన శాస్తి చేసిన మోడీ సర్కార్

2026-11-12 18:25 GMT

జగన్ లేకపోతే ఏమీ కారు.... సాయిరెడ్డికి వైసీపీ షాక్ !

2026-11-12 18:20 GMT

జెన్సన్ హువాంగ్ చుట్టూ వివాదం.. Nvidiaలో ఏం జరగబోతోంది?

2026-11-12 18:19 GMT

కేరళలో మళ్లీ షిగెల్లా కలకలం.. మూడు ప్రాంతాల్లో కేసులు!

2026-11-12 18:17 GMT

20 ఏళ్ల తర్వాత రాజాంలో ఎన్నికల సందడి.. తొలి పాలకవర్గంపై ఉత్కంఠ!

2026-11-12 17:30 GMT

విజయసాయి పీఆర్పీకి నియోజకవర్గానికి 100 ఓట్లు కూడా కష్టమేనా ?

2026-11-12 17:05 GMT

Copyright @2026

Powered by Blink CMS