కొత్త సర్వే... వర్క్ ఫ్రం హోం కోసం ఎంత జీతం వదులుకుంటున్నారో తెలుసా?
అవును... నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్.బీ.ఈ.ఆర్) నుండి వచ్చిన ఒక కొత్త సర్వే ప్రకారం... ఇంటి నుండి పని చేసే ఆప్షన్ కోసం ఉద్యోగులు సగటున 25% జీతం తగ్గింపును అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు.;
కోవిడ్ మహమ్మారి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ టెక్కీలకు ఇంటి నుంచి పని చేసే అవకాశం దొరికింది. అయితే మహమ్మారి తర్వాత ఈ ఎంపికను చాలా కంపెనీలు తీసివేయగా.. పలువురు ఉద్యోగులు మాత్రం ఈ ఎంపిక కోసం జీతంలో 25% వదిలేసుకోవడానికి సైతం సిద్ధంగా ఉన్నారనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. ఈ మేరకు ఓ సర్వే నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
అవును... నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్.బీ.ఈ.ఆర్) నుండి వచ్చిన ఒక కొత్త సర్వే ప్రకారం... ఇంటి నుండి పని చేసే ఆప్షన్ కోసం ఉద్యోగులు సగటున 25% జీతం తగ్గింపును అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికోసం సుమారు 1,400 మంది సాంకేతిక నిపుణుల అభిప్రాయాలను తీసుకున్నారు. ఇది గత అంచనాల కంటే మూడు నుండి ఐదు రెట్లు ఎక్కువని చెబుతున్నారు.
వాస్తవానికి చాలా మంది టెక్కీల ఆలోచన ఈ విధంగా ఉంటే... అనేక ప్రధాన కంపెనీలు మాత్రం దీనికి వ్యతిరేక దిశలో ముందుకు కదులుతున్నాయి. ఇందులో భాగంగా కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రవేశపెట్టిన ఈ రిమోట్ వర్క్ అలవెన్సులను కఠినతరం చేస్తున్నాయి. ఈ క్రమంలో గూగుల్ తన వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని సవరించిన తాజా టెక్ దిగ్గజంగా మారింది.
ఇందులో భాగంగా... కోవిడ్ మహమ్మారి సమయంలో తీసుకొచ్చిన 'ఎక్కడి నుంచైనా పని చేయండి' (వర్క్ ఫ్రమ్ ఎనీవేర్) అనే విధానంతో రిమోట్ పనిపై ఆంక్షలు విధిస్తూనే ఉంది. ఈ విధానం ఉద్యోగులు తమ ప్రధాన కార్యాలయం వెలుపల ఉన్న ప్రదేశం నుండి ప్రతి క్యాలెండర్ సంవత్సరానికి నాలుగు వారాల వరకు పని చేయడానికి అనుమతించింది.
ఇదే సమయంలో.. గూగుల్ తన ప్రస్తుత హైబ్రిడ్ షెడ్యూల్ ను మార్చడం లేదు. ఇది మహమ్మారి సమయంలో కూడా అమలులోకి వచ్చింది. దీని ప్రకారం.. ఉద్యోగులు వారానికి రెండు రోజులు ఇంటి నుండి పని చేయడానికి వీలు కల్పిస్తుంది! అదేవిధంగా... మైక్రోసాఫ్ట్ గత నెలలో వచ్చే ఏడాది నుండి ఉద్యోగులు వారానికి మూడు రోజులు కార్యాలయంలో పని చేయాలని భావిస్తున్నట్లు ప్రకటించింది!
అమెజాన్ మరింత ముందుకు వెళ్లి.. కార్పొరేట్ సిబ్బందిని వారానికి ఐదు రోజులు కార్యాలయంలో గడపాలని ఆదేశించింది.