• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వైసీపీ ఓటు బ్యాంకుపై...

వైసీపీ ఓటు బ్యాంకుపై టీడీపీ క‌న్ను.. !

| మహిళా ఓటు బ్యాంకు విషయంలో ఆది నుంచి కూడా వైసిపి చాలా ఆశలు పెట్టుకుంది. మహిళలంతా తమ వైపే ఉన్నారని, మహిళా ఓటు బ్యాంకు తమ‌దేన‌ని పదేపదే చెబుతూ వచ్చింది.

By - Garuda Media
Update: 2025-10-02 23:30 GMT

మహిళా ఓటు బ్యాంకు విషయంలో ఆది నుంచి కూడా వైసిపి చాలా ఆశలు పెట్టుకుంది. మహిళలంతా తమ వైపే ఉన్నారని, మహిళా ఓటు బ్యాంకు తమ‌దేన‌ని పదేపదే చెబుతూ వచ్చింది. గత ఎన్నికల సమయంలో 40% ఓటు బ్యాంకు వైసీపీ దక్కించుకుంది. పార్టీ అధికారంలోకి రాకపోయినా కేవలం 11 మంది సభ్యులు మాత్రమే వైసిపికి దక్కినప్పటికీ ఓటు బ్యాంకు పరంగా చూసుకుంటే 40 శాతం పైగా వైసిపి దక్కించుకుంది. దీనిలో దాదాపు 26% మహిళలే ఓటు వేశారన్నది పార్టీ వర్గాలు చెబుతున్న మాట. దీంతో మహిళలు తమ వైపు ఉన్నారని, మహిళా పార్టీగా తాము వారికి చేరువయ్యామని జగన్ ఇటీవల కాలంలో కూడా చెబుతూ వచ్చారు.

అయితే ఇప్పుడు పరిస్థితిలు మారిపోతున్నాయి. మహిళా ఓటు బ్యాంకు ను తమ వైపు తిప్పుకునే దిశగా సీఎం చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మహిళలను సెంట్రిక్ గా చేసుకుని అమలు చేస్తున్న పథకాలతో పాటు మరిన్ని కొత్త పథకాలు కూడా ఆయన తీసుకువచ్చారు. దీనిలో భాగంగా సూపర్ సిక్స్ లో ఇప్పటికే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, తల్లికి వందనం పథకాలను అమలు చేస్తున్నారు. దీంతోపాటు దసరా కానుకగా మరో రెండు కీలక మహిళా పథకాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. వీటిని త్వరలోనే ఆయన ప్రకటించనున్నారు.

ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలను తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన అన్ని లాంఛనాలను ఇప్పటికే పూర్తి చేసుకున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ద్వారా ఇంట్లో ఉన్న బాలికలకు ఉన్నత స్థాయి వరకు చదువుకునేలాగా బ్యాంకుల నుంచి స్వల్ప వడ్డీకి లక్ష రూపాయలు చొప్పున రుణాలను ఇప్పించమన్నారు. వీటిని ఈఎంఐ పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి ద్వారా వివాహాలు చేసుకునే యువతులకు మాత్రమే లక్ష రూపాయల చొప్పున రుణాలను అందించనున్నారు.

ఈ రెండు పథకాలు కూడా పేదలకు, అదే విధంగా మహిళలకు ఎంతో కీలకంగా మారుతాయి. మహిళా ఓటు బ్యాంకు ను చెక్కుచెదరకుండా తమకే అనుకూలంగా ఉంచుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. వాస్తవానికి మహిళలు కూడా ఈ దిశగానే ఆలోచన చేస్తే వైసిపి పెట్టుకున్న ఆశలు నిజంగానే కనుమరుగవుతాయి... అన్నది పార్టీ వర్గాలు చెబుతున్న మాట. మరి ఏం జరుగుతుందని చూడాలి. ఏది ఏమైనప్పటికీ మహిళా సెంట్రిగ్గా జరుగుతున్న సంక్షేమ పథకాలు ఏ పార్టీకి లాభాని చేకూరుస్తాయి.. ఏ పార్టీ నష్టపోతుందని.. అనేది వచ్చే ఎన్నికల వరకు వేచి చూడాలి.

Tags:    
  • WomenVoters 
  • TDP 
  • YSRCP 
  • ChandrababuNaidu 
  • NTREducation 
  • NTDKalyanaLakshmi 
  • WelfareSchemes 
  • AndhraPolitics 
  • Election2025 
  • WomenEmpowerment 

Similar News

భక్తి మాటున కనిపిస్తున్న పర్యావరణ విషాదం.. యమునా నదిలో ఏంటీ భయానక పరిస్థితి?

2026-11-16 13:30 GMT

దంపతుల మధ్య చిచ్చు పెట్టిన ChatGPT.. విడాకుల వరకు వెళ్లిన గొడవ!

2026-11-16 12:30 GMT

స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ‘కిడ్నీ’ సేఫ్‌గా ఉందో లేదో చూసుకోండి.. సామాన్యుడికి మరో ‘డిజిటల్’ షాక్

2026-11-16 11:30 GMT

భారీ చిట్టాతో ఢిల్లీకి చంద్రబాబు.. కేంద్ర మంత్రివర్గంపై చర్చ, వేమిరెడ్డికి చాన్స్?

2026-11-16 10:24 GMT

భార‌త ఐటీ- ఫార్మా వెన‌క‌బాటును నిల‌దీసిన రిజ‌ర్వ్ బ్యాంక్ మాజీ గ‌వ‌ర్న‌ర్ రంగ‌రాజ‌న్

2026-11-16 08:21 GMT

పుస్తకాలతో కుస్తీ లేదు.. ఏఐతో మస్తి.. టాపర్‌గా మారిన చీటర్ కథ

2026-11-16 08:11 GMT

ఇంట్లో తినడానికి గుప్పెడు పిండి లేదు.. కానీ భారత్‌ను కొట్టడానికి టర్కీ నుంచి ఏకంగా లక్ష డ్రోన్లట..

2026-11-16 07:57 GMT

నెమ్మదిగా కదులుతున్న తీవ్ర వాయుగుండం.. తీరానికి భారీ ముప్పు

2026-11-16 07:56 GMT

విమానాలు ఎగరలేదు.. తప్పంతా బైడెన్ దే.. నాది కాదు.. ట్రంప్ మళ్లీ ఏసాడు..

2026-11-16 06:55 GMT

విజయసాయిరెడ్డి ఎక్కడ? పార్టీ ప్రకటన తర్వాత కనిపించని పీఆర్పీ అధినేత

2026-11-16 06:51 GMT

ఎన్ని ఎఫైర్లు పెట్టుకున్నా మళ్లీ జెన్సన్ రావాలి.. ఎన్వీడియో పగ్గాలి చేపట్టాలట.. వైట్ హౌస్ వద్దకు పంచాయితీ..

2026-11-16 04:53 GMT

భారత ఐటీ కంపెనీలకు అమెరికాలో కొత్త చిక్కులు.. H-1B వీసాలపై పెరుగుతున్న ఆంక్షలు!

2026-11-16 04:28 GMT

Copyright @2026

Powered by Blink CMS