చంద్రబాబూ ఎమ్మెల్యేల అవినీతి పట్టించుకోండి !

కూటమి ప్రభుత్వ పెద్దల వైఖరి చూస్తే కనుక పరిపాలన బాగా చేస్తున్నామని అనుకుంటున్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతున్నామని భావిస్తున్నారు.;

Update: 2025-06-15 23:30 GMT
చంద్రబాబూ ఎమ్మెల్యేల అవినీతి పట్టించుకోండి !

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి ఏడాది పూర్తి అయింది. హామీమూన్ పీరియడ్ అనేది ఎపుడో పూర్తి అయింది. ఓట్లేసిన జనాలకు ఎలాంటి మొహమాటాలు ఇపుడు లేవు అని అంటున్నారు. అదే సమయంలో వివిధ వర్గాల ప్రజానీకం తమ డిమాండ్ల మీద మెల్లగా గొంతు విప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఎమ్మెల్యేల పనితీరుని సైతం జనాలు నిశితంగా పరిశీలిస్తున్నారు.

కూటమి ప్రభుత్వ పెద్దల వైఖరి చూస్తే కనుక పరిపాలన బాగా చేస్తున్నామని అనుకుంటున్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతున్నామని భావిస్తున్నారు. ప్రభుత్వ పనితీరు మీద ఐవీఆర్ఎస్ సర్వే నివేదికలు అయితే అనుకూలంగానే ఉన్నాయని అంటున్నారు.

అంతే కదు ఎంటీఆర్ భరోసా పెన్షన్లు, అన్నా క్యాంటీన్లు, ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మీద ప్రజలలో సంతృప్తి బాగానే ఉంది. ఇలా ప్రజలలో ఒక వైపు మంచిగానే అభిప్రాయం వస్తోంది అదే సమయంలో అవినీతి మీద కూడా జనాలలో ఎక్కువ మంది ఉందనే అభిప్రాయపడుతున్నారు. మరీ ముఖ్యంగా చూస్తే కనుక ఎమ్మెల్యేల స్థాయిలోనే అవినీతి జరుగుతోందని అంటున్నారు.

ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది వారి అనుచరులు దందాలు చేస్తున్నారని అవినీతి చేస్తున్నారని సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి. అది ప్రతీ నియోజకవర్గంలో ఎక్కువగానే ఉంది అని అంటున్నారు. కాదేదీ అవినీతికి అనర్హం అన్నట్లుగా ఇసుక, మద్యం వంటి వాటిలో ఎక్కువగా జరుగుతోంది అని అంటున్నారు. దాంతో పాటుగా ఎమ్మెల్యేల అనుచరులు కూడా దూకుడు చేస్తున్నారు అని నివేదికలు వస్తున్నాయి.

దీని మీద మాత్రం ప్రభుత్వ పెద్దలు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఓవరాల్ గా చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి పాలన బాగుందని నివేదికలు వస్తున్నా అవినీతి విషయంలో మాత్రం దాని కంటే ఎక్కువగానే ఫిర్యాదులు ఉన్నాయని అంటున్నారు.

నిజానికి అనుభవం కలిగిన వారు, అభివృద్ధి కారకుడు, విజనరీ అని చంద్రబాబు మీద జనాలకు మంచి నమ్మకమే ఉందని అంటున్నారు. అయితే ఆయన ముఖం చూసి ఎన్నుకున్న ఎమ్మెల్యేలలో అత్యధిక శాతం వారి మీద నమ్మకం అయితే లేదు అని అంటున్నారు. దాంతోనే మెల్లగా కూటమి ప్రభుత్వం పాలన మీద జనాలలో అసంతృప్తి పెరుగుతోంది అని విశ్లేషిస్తున్నారు.

ఇక చూస్తే టీడీపీ అంటే క్యాడర్ బేస్డ్ పార్టీగా అంతా చెప్పుకుంటారు. టీడీపీకి కాయకర్తలే ప్రాణం వారే మొదట అని మహానాడులో సైతం పార్టీ పెద్దలు గొప్పగా చెప్పారు. అయితే పై స్థాయిలో చంద్రబాబు లోకేష్ కార్యకర్తలకు ఎంతో విలువ గౌరవం ఇస్తున్నారు. కానీ నియోజకవర్గ స్థాయిలో చూస్తే కనుక ఎమ్మెల్యేలు వారిని పట్టించుకోవడం లేదని అంటున్నారు.

అంతే కాదు ప్రతీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలదే పెత్తనం అధికంగా ఉంద అని అంటున్నారు. వారే సామంత రాజుల మాదిరిగా అక్కడ వ్యవహరిస్తున్నారు. అంతా తమ కనుసన్నలలో సాగాలని చూస్తున్నారు అని అంటున్నారు. దాంతోనే క్యాడర్ కూడా దూరం అవుతోంది అని అంటున్నారు.

నేరుగా ప్రతీ దాంట్లో ఎమ్మెల్యేలే తల దూరుస్తున్నారని దాంతో అవినీతి అనేక చోట్ల విచ్చలవిడిగా మారిందని అంటున్నారు. దీంతో ఎమ్మెల్యేల పనితీరు ఏడాదితోనే జనాలకు క్యాడర్ కి కూడా విసుగు తెప్పిస్తోంది అని అంటున్నారు.

ఇలా నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున విస్తరించిన అవినీతిని అదుపు చేయకపోతే చంద్రబాబు ఎన్ని సూపర్ సిక్స్ హామీలను అమలు చేసినా ఉపయోగం ఏమి ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వ పనితీరుని సైతం కనిపించకుండా చేసేలా ఎమ్మెల్యేల దందాలు వారి అనుచరుల ఆగడాలు అవినీతి వ్యవహారాలూ ఉన్నాయని ప్రజలు అంటున్నారు.

గత వైసీపీ ప్రభుత్వంలో చూసుకున్నా జగన్ దాదాపుగా మూడు లక్షల కోట్ల రూపాయల నగదుని వివిధ పధకాల కింద ప్రజలకు అందించారు. అయితే ఎమ్మెల్యేలను పట్టించుకోలేదు, అలాగే క్యాడర్ ని అసలు పట్టించుకోలేదు అని అంటారు. దాని ఫలితంగా వైసీపీకి ఘోరమైన ఓటమి దక్కింది అని చెబుతున్నారు. మరి టీడీపీ క్యాడర్ ని ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా అవినీతి నిందలు మోస్తూంటే అధినాయకత్వం కచ్చితంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. లేకపోతే ముందు ముందు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయన్నదే తొలి ఏడాది పాలన మీద వచ్చిన సర్వేలు చెబుతున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News