'మ‌హానాడు' పై పాక్ ప్ర‌భావం.. ఏం జ‌రిగింది?

ఈ నేప‌థ్యంలో మ‌హానాడును వాయిదా వేయ‌డం మంచిద‌న్న ఆలోచ‌న చేస్తున్నారు.;

Update: 2025-05-10 09:10 GMT

ఈ నెల 27-29 వ‌రకు నిర్వ‌హించాల‌ని త‌ల‌పెట్టిన టీడీపీ ప‌సుపు పండుగ‌.. 'మ‌హానాడు'పై పాకిస్థాన్ ఉద్రిక్త త‌ల ప్ర‌భావం ప‌డింది. మ‌రో 15 రోజుల్లో మ‌హానాడుకు శ్రీకారం చుట్ట‌నున్నారు. దీనిని అంగ‌రంగ వైభ‌వం గా నిర్వ‌హించాల‌ని కూడా నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. క‌డ‌ప జిల్లాలో తొలి సారి నిర్వ‌హిస్తున్న నేప‌థ్యంలో దీనికి మ‌రింత ప్రాధాన్యం ఏర్ప‌డింది.

అయితే.. ప్ర‌స్తుతం పాకిస్థాన్‌తో భార‌త్‌కు ఉద్రిక్త‌త‌లు పెరుగుతుండ‌డం.. ఇది ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియ‌క పోవ‌డం నేప‌థ్యంలో పార్టీ సీనియ‌ర్లు అంత‌ర్మ‌థ‌నంలో ప‌డ్డారు. దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల మూడ్ కూడా అదేవిధంగా ఉందని.. సినిమాల విడుద‌ల నుంచి నూత‌న కార్య‌క్ర‌మాల ప్రారంభం వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా వాయిదా వేసుకుంటున్న ప‌రిస్థితిని కూడా వారు ప్ర‌స్తావిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో మ‌హానాడును వాయిదా వేయ‌డం మంచిద‌న్న ఆలోచ‌న చేస్తున్నారు. అయితే.. గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌డంతో మహానాడుకు ప్రాధాన్యం ఇవ్వ‌లేక పోవ‌డం.. ప్ర‌స్తుతం పార్టీ అదికారంలోకి వ‌చ్చింద‌న్న జోష్ ఉండ‌డంతో తాజా మ‌హానాడుపై ఆశ‌లు ఉన్నాయి. దీనిని విజ‌య‌వంతం చేయ‌డం ద్వారా రాబోయే రోజుల్లో పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

అయితే.. ప్ర‌స్తుతం నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో మ‌హానాడు పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని అం టున్నారు. దేశ మంతా ఉద్రిగ్నంగా ఉన్న‌ స‌మ‌యంలో మ‌హానాడును నిర్వ‌హించ‌డం స‌రికాద‌న్న అభి ప్రాయ‌మే 90 శాతం వ‌ర‌కు వినిపిస్తోంది. అయితే.. దీనిపై నిర్ణ‌యాన్ని పార్టీ అధినేత చంద్ర‌బాబుకు వ‌దిలే శారు. ప్ర‌స్తుతం క‌డ‌ప‌లో ప‌నులు అయితే.. వేగంగా సాగుతున్నాయి. దీనిని బ‌ట్టి చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌ది వేచి చూడాలి.

Tags:    

Similar News