తమిళనాడులో గెలిచేది....ఐబీ ఇంట్రెస్టింగ్ సర్వే
తమిళనాడు ఎన్నికల్లో అధికార డీఎంకే మీద ప్రజలలో వ్యతిరేకత అయితే ఉంది కానీ అది మరీ దారుణంగా లేదని అంటున్నారు.;
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. కొత్త ఏడాది రావడమేంటి, ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలవుతుంది. మే నేలలో ఎన్నికలు ఉంటాయని అంటున్నారు. అయిదేళ్ళ అధికార డీఎంకే పాలకను జనాలు మరోసారి జై కొడతారా లేక ఎన్డీయే కూటమిని గెలిపిస్తారా లేక కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ పార్టీని గెలిపిస్తారా అంటే దీని మీద ఒక ఇంట్రెస్టింగ్ సర్వే వెల్లడైంది. ఈ సర్వే ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇంటలిజెన్స్ బ్యూరో నిర్వహించింది అని చెబుతున్నారు. ఈ సర్వే ప్రకారం చూస్తే తమిళనాడు ఫలితాలు ఎవరూ ఊహించిన విధంగా రావని అంటున్నారు.
అతి పెద్ద పార్టీగా :
తమిళనాడు ఎన్నికల్లో అధికార డీఎంకే మీద ప్రజలలో వ్యతిరేకత అయితే ఉంది కానీ అది మరీ దారుణంగా లేదని అంటున్నారు. పైగా విపక్షంలో పోటీ పెరిగి యాంటీ ఇంకెంబెన్సీ ఉన్నా ఓట్ల చీలికతో డీఎంకే ప్రయోజనం పొందుతుందని అంటున్నారు. కానీ మ్యాజిక్ ఫిగర్ కి కొంత దూరంలో నిలుస్తుంది అని అంటున్నారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం సీట్లు 234 ఉంటే మ్యాజిక్ ఫిగర్ సాధించడానికి 118 సీట్లు రావాలి. అయితే ఐబీ సర్వే ప్రకారం డీఎంకేకు 90 దాకా సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.
విజయ్ దూకుడు :
అదే సమయంలో కొత్తగా సినీ స్టార్ విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి ఏకంగా 70 సీట్లు దక్కుతాయని అంటున్నారు. కొత్త పార్టీ పట్ల జనంలో ఉన్న మోజు దీనికి కారణం. అయితే ఏకపక్షంగా విజయ్ పార్టీ గెలిచేందుకు మధ్యలో అన్నా డీఎంకే కొంత అడ్డంకి పడుతోంది అని అంటున్నారు. ఆ పార్టీకి క్షేత్ర స్థాయిలో కొంత బలం ఉండడమే కారణం అని అంటున్నారు. దాంతో విజయ్ పార్టీకి పూర్తి మెజారిటీ రాకుండా త్రిముఖ పోరు వల్ల ఇబ్బంది అవుతోంది అని అంటున్నారు.
దెబ్బ పడుతోందా :
ఇక గతసారి 2021లో జరిగిన ఎన్నికల్లో అన్నా డీఎంకే 66 దాకా సీట్లు సాధించి బలమైన ప్రతిపక్షంగా నిలబడింది. ఈసారి మాత్రం అందులో సగానికి సగం పడిపోతోంది అని ఐబీ సర్వే అంచనా వేస్తోంది. అంటే అన్నాడీఎంకేకి 35 స్థానాలు లభిస్తాయని అంటున్నారు. ఒక విధంగా ఆ పార్టీకి ఇది షాకింగ్ పరిణామం అని అంటున్నారు. మరి ఈ మూడు పార్టీలు ఇక మిగిలిన మరో ముప్పై సీట్లలో టఫ్ ఫైట్ సాగుతుందని అంటున్నారు. ఇందులో కనుక ఎవరు ఎక్కువ గెలుచుకుంటే వారు అధికారానికి మరింత దగ్గరగా వెళ్తారు అంటున్నారు. మొత్తానికి ఈసారి ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ కి సరిపడా సీట్లు రావని ఏ రెండు పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి రావచ్చు అని అంటున్నారు. మరి గెలిచిన తరువాత తమిళనాడులో కొత్తగా అనూహ్యమైన పొత్తులు ఉండే చాన్స్ ఉందేమో చూడాల్సి ఉంది మరి. అయితే ఇది ఆరంభంలో వచ్చిన సర్వే కాబట్టి ముందు ముందు ఇంకా పరిస్థితిలో స్పష్టత రావచ్చు. అలాగే పార్టీలు అలెర్ట్ అయి తమ దూకుడుని పెంచుకునేందుకు వీలు ఉంటుందని అంటున్నారు.