• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  42 ఏళ్ల టీడీపీ.. మహానాడు...

42 ఏళ్ల టీడీపీ.. మహానాడు జరగని సంవత్సరాలు తెలుసా?

| 2019-24 మధ్య అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న టీడీపీ.. గత ఏడాది ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ఏపీలో అధికారంలోకి వచ్చింది.

By - Tupaki Desk
Update: 2025-05-27 11:30 GMT

తెలుగు దేశం పార్టీ (టీడీపీ) పెద్ద పండుగ మహానాడు. వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జన్మదినం కలిసొచ్చేలా.. మూడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమమే మహానాడు. టీడీపీ ప్రజల కోసం ఎన్ని మహాసభలు నిర్వహించినా.. పార్టీ కోసం నిర్వహించే మహానాడు మాత్రం నభూతో అన్నట్లుగా సాగుతుంది. 1982 మార్చి 29న తెలుగువారి అభిమాన నటుడు, అన్నగారు నందమూరి తారక రామారావు మానస పుత్రికగా పుట్టిన టీడీపీ.. 43 ఏళ్లు పూర్తిచేసుకుంది. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. ఏటా ’మహానాడు’ను మాత్రం మరువదు.

2019-24 మధ్య అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న టీడీపీ.. గత ఏడాది ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ఏపీలో అధికారంలోకి వచ్చింది. తాజాగా కడపలో టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా సాగుతోంది. 43 ఏళ్లు పూర్తిచేసుకున్న టీడీపీకి ఇది 39వ మహానాడు. ఇన్ని సంవత్సరాలలో ఆ పార్టీ పండుగ మహానాడును జరుపుకోనిది నాలుగేళ్లు.

1985, 1991, 1996, 2012లో టీడీపీ మహానాడు జరగలేదు. వీటిలో 1985, 1996లో తెలుగుదేశం పార్టీనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉంది. 1991, 2012లో మాత్రం టీడీపీ ప్రతిపక్షంలో ఉంది.

1985 నాటికి టీడీపీ పుట్టి మూడేళ్లవుతున్నా.. మహానాడును బహుశా రాజకీయ సంక్షోభం కారణంగా నిర్వహించలేదనుకుంటా. ఎన్టీఆర్ జీవించి ఉన్నా 1991లో మహానాడు జరగలేదు. ఇక ఆయన మరణంతో 1996లో మహానాడును నిర్వహించడం సమంజసం కాదని భావించినట్లున్నారు.

ఉమ్మడి ఏపీలో చివరగా.. 2012లోనూ మహానాడును ఏర్పాటు చేయలేదు. ఆ ఏడాది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల రాజీనామా కారణంగా ఉప ఎన్నికలు రావడంతో మహానాడుకు అవకాశం దక్కలేదు.

2022లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ మహానాడు ఎన్టీఆర్ సొంత ప్రాంతమైన విజయవాడలో నిర్వహించింది. ఆ ఏడాది ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరం కావడం గమనార్హం.

Tags:    
  • TDP 
  • Mahanadu2024 
  • TeluguDesamParty 
  • NTRLegacy 
  • ChandrababuNaidu 
  • TDP43Years 
  • AndhraPolitics 
  • TeluguPride 
  • TDPVictory 
  • TDPGovernment 
  • MahanaduHistory 

Similar News

ఏపీకి వరస తుఫానులు ఎందుకు వస్తున్నాయి ?

2026-11-17 17:42 GMT

ఇతను టఫ్ గాయ్.. ట్రంప్ పొగిడినా పట్టించుకోని మోడీ.. అసలేం జరిగింది?

2026-11-17 17:41 GMT

ట్రావిస్ హెడ్ కు గుడ్ బై చెప్పిన కావ్య పాప.. ఐపీఎల్ 2027 వేలంలో స్టార్లను వదిలేసిన ఫ్రాంచైజీలు

2026-11-17 17:40 GMT

సచిన్‌తో క్రికెట్.. ఆటో డ్రైవింగ్: అదరగొట్టిన విలియం, కేట్!

2026-11-17 17:38 GMT

పాలకులకు 'ఎల్ నినో' దడ.. 2004 నాటి చరిత్ర మళ్లీ రిపీట్ కానుందా?

2026-11-17 17:38 GMT

జమిలితో బీజేపీ : తెలంగాణాను ఎగరేసుకుపోతారా ?

2026-11-17 17:37 GMT

544 పేజీల సోనియా ఆత్మకథతో దేశానికి ఒరిగేదేంటి ?

2026-11-17 17:35 GMT

60 వేల మంది తొలగింపు.. మైక్రోసాఫ్ట్ వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ వెనుక అసలు వ్యూహమేంటి?

2026-11-17 17:34 GMT

కొబ్బరికాయ కోసం రూ.2.50 లక్షలు ఖర్చు.. దీని కథేంటి తెలుసా?

2026-11-17 17:33 GMT

వర్కౌట్స్ తో తెగ కష్టపడిపోతున్న రాశీ ఖన్నా.. వీడియో వైరల్!

2026-11-17 17:33 GMT

చైర్మ‌న్ గిరి.. అంత ఈజీ కాదు ..!

2026-11-17 13:09 GMT

ఏపీలో జ‌డ్పీ పీఠాల‌పై చిక్కుముడులు.. రీజ‌నేంటి.. ?

2026-11-17 13:07 GMT

Copyright @2026

Powered by Blink CMS