జగన్ వద్ద బ్రహ్మాస్త్రాన్ని బాబు లాగేశారా ?

మొత్తానికి జగన్ అండ్ కో డిమాండ్లలో అతి పెద్ద దానిని చంద్రబాబు నెరవేరుస్తున్నారు.;

Update: 2025-06-12 04:39 GMT

మొత్తానికి జగన్ అండ్ కో డిమాండ్లలో అతి పెద్ద దానిని చంద్రబాబు నెరవేరుస్తున్నారు. అదే తల్లికి వందనం పధకం. ఇది చాలా పవర్ ఫుల్. ఎందుకు అంటే అక్కడ ఉన్నది తల్లులు. వారే మహిళామతల్లులు. అమ్మ ఒడి అన్నా తల్లికి వందనం అన్నా మహిళల ఓట్ల కోసమే. అందుకే జగన్ అమ్మ ఒడి కేవలం కుటుంబంలో ఒకరికే వర్తింపజేస్తే చంద్రబాబు మాత్రం అందరు విద్యార్ధులకు అని చెప్పి ఎన్నికల్లో గెలిచారు.

తీరా గెలిచాక బాబు ఏడాది ఆటు విధి విధానాలు అంటూ కాలపాయన చేశారు అని విపక్షం ఆరోపించింది. అయితే ఏడాది అయితేనేమి రెండో ఏడాది అయితేనేమి అమలు చేయడం ముఖ్యం. అలా చంద్రబాబు తల్లికి వందనం అనే బ్రహ్మాస్త్రం బయటకు తీశారు.

రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు తల్లికి వందనం ప‌థ‌కం అమ‌లు చేయాలని నిర్ణయించింది. ఈ పధకం కింద తల్లుల ఖాతాలలో నగదు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 8వేల 745 కోట్ల రూపాయలను కేటాయించింది. అంతే కాదు ప్రతీ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం పధకం అమలు చేయనున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 67 లక్షల 27 వేల 164 మంది విద్యార్థులకు పథకం వర్తించనుంది. 1వ తరగతిలో ప్రవేశం పొందిన పిల్లల నుంచి మొదటి ఏడాది చేరే విద్యార్థుల వరకూ ఈ పధకం అమలు చేయబోతున్నారు.

దీంతో ఏపీలో ఇక తల్లుల ఖాతాలలో నిండుగా నగదు చేరనుంది. ఒక్కొక్కరికీ కోత లేకుండా పదిహేను వేలు, అదే ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ఈ రోజులలో ఇద్దరు పిల్లలు కచ్చితంగా ఉంటున్నారు. పేదల ఇళ్ళలో అయితే ముగ్గురు కూడా ఉంటారు. అలా కచ్చితంగా ఒక అర లక్ష వారి ఖాతాలో పడుతుంది. అపుడు వారికి అటోమేటిక్ గా చంద్రబాబు దేవుడే అవుతారు.

గతంలో జగన్ ప్రభుత్వంలో పదిహేను వేలు అని చెప్పి అమ్మ ఒడిని 13 వేలకు తగ్గించి ఒక్కరికే పరిమితం చేశారు. అయినా అది గొప్ప పధకం అని చెప్పుకున్నారు అలాంటిది ఏ మాత్రం కట్ చేయకుండా అందరికీ పధకం ఇస్తూంటే బాబుని దేవుడు అనకుండా ఉండగలరా. ఇక చంద్రబాబు పధకాలు ఏవీ అమలు చేయడం లేదని వెన్నుపోటు దినం అని వంచన అని జగన్ అండ్ కో నిరసనల పేరుతో పిలుపు ఇచ్చినా పట్టించుకుంటారా అన్నది మరో చర్చ.

ఇలా ఏడాది పాలనతోనే మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు బాబు అని అంటున్నారు. నెమ్మదిగా మిగిలిన వాటిలో గురి చూసి భారీ స్కెక్షన్లు ఉన్న వారికి పధకాలు మిగిలినవి అమలు చేస్తూ పోతే విపక్ష వైసీపీ వద్ద ఆయుధాలు ఏమి ఉంటాయన్న చర్చ వస్తోంది. మొత్తం మీద చూస్తే బాబు జగన్ ని తొలి ఏడాదిలోనే కట్టడి చేయడానికి నిర్ణయించుకున్నారా అన్నదే అతి పెద్ద చర్చగా ఉంది.

Tags:    

Similar News