• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కొత్త ఆఫర్... దేశాన్ని...

కొత్త ఆఫర్... దేశాన్ని వీడితే క్యాష్ ఇస్తారు.. ఫ్లైట్ టిక్కెట్ ఫ్రీ!

| తాజాగా దేశంలో స్థిరపడిన పౌరులకు స్వీడన్ కొత్త ఆఫర్ ఒకటి ప్రకటించింది.

By - Tupaki Desk
Update: 2024-08-17 22:30 GMT

తాజాగా దేశంలో స్థిరపడిన పౌరులకు స్వీడన్ కొత్త ఆఫర్ ఒకటి ప్రకటించింది. ఇతర దేశాల్లో పుట్టి, స్వీడన్ లో ఉంటున్న పౌరులకు ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా... ఇతర దేశాల్లో జన్మించి స్వీడన్లో స్థిరపడిన పౌరులు దేశం వీడితే వారికి కొంత సొమ్మును బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇదే సమయంలో ప్రయాణ ఖర్చులు బోనస్!

అవును... తాజాగా స్వీడన్ ఇమిగ్రేషన్ మంత్రి మరియా మాల్మెర్ స్టెనార్గర్డ్ ఓ కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా... ఇతరదేశాల్లో జన్మించి అనంతరం స్వీడన్ల్ లో సెటిల్ అయిన పౌరులు స్వచ్ఛందంగా దేశాన్ని వీడితే వారికి 10వేల స్వీడన్ క్రౌన్స్ (భారత కరెన్సీలో రూ.80 వేలు) బహుమతిగా ఇస్తారు. ఇక చిన్నారులకైతే అందులో సగం. ఇక ఈ నగదుతో పాటు వారి ప్రయాణ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది.

ఈ నేపథ్యంలో ఈ భిన్నమైన ప్రతిపాదన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. అయితే ఇలాంటి ప్రతిపాదనను స్వీడన్ తెరపైకి తేవడానికి ఆ దేశ జనాభా పెరుగుదలే కారణం అని అంటున్నారు. సుమారు 20 ఏళ్లుగా స్వీడన్ లో జనాభా విపరీతంగా పెరిగింది. దీనికి కారణం ఇతర దేశాల నుంచి వలసలు ఎక్కువగా ఉండటమే అని అంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాల్మెర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వస్తున్న ప్రజలు స్వీడన్ వాతావరణంలో ఇమడలేకపోతున్నారు.. అటువంటి వారికి ఇది సువర్ణ అవకాశం అని చెప్పుకొచ్చారు. మరోపక్క... ఈ తాజా ప్రతిపాదనపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇందులో భాగంగా.. స్వీడన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదనలు ఎలాంటి ప్రజాస్వామ్యాన్ని సూచిస్తుంది అంటూ ప్రశ్నించారు భారత ఆర్థిక వేత్త, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక సలహామండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్. ఏది ఏమైనా... తాజాగా స్వీడన్ దేశం తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఈ ప్రతిపాదన ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాలి.

Tags:    
  • Migration 
  • Immigrants 
  • Sweden 
  • Voluntaryexitscheme 
  • Swedengovernment 
  • Swedishadministration 

Similar News

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS