సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం.. తన తీర్పును తానే మార్చుకుంది
దీనిపై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన బిడ్డను తనకే అప్పగించాలని కోరాడు. అయితే.. 2022లో ఫ్యామిలీ కోర్టు ఆ బిడ్డను తల్లి వద్దే ఉంచేలా నిర్ణయం తీసుకొని ఆదేశాలు జారీ చేశారు.;
దేశ అత్యున్నత న్యాయస్థానం తాను ఇచ్చిన తీర్పు/అదేశాల్ని ఏడాది వ్యవధిలో మార్చుకుంటూ సరికొత్త ఆదేశాల్ని ఇవ్వటాన్ని ఒక అసాధారణ నిర్ణయంగా అభివర్ణించొచ్చు. అదెలా? అంటే.. దానికి చాలానే విషయం ఉంది. గత ఏడాదిలో తాను ఇచ్చిన అదేశాల్ని పున:పరిశీలిస్తూ.. తన ఆదేశాల్నిమ మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతకూ ఈ అసాధారణ ఆదేశం ఎందుకు? ఎవరి కోసం? ఏ పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు? అన్నది చూస్తే..
కేరళకు చెందిన యువతి.. యువకుడు ఇద్దరూ 2011లో పెళ్లి చేసుకున్నారు. వారికి తర్వాతి ఏడాదిలో కొడుకు పుట్టాడు. వారి దాంపత్య జీవితంలో విభేదాలు తలెత్తటంతో వారు విడిగా జీవిస్తున్నారు. విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. వారిద్దరు చేసుకున్న ఒప్పందం ప్రకారం కొడుకు తల్లి వద్ద ఉండేలా..తండ్రి నెలకు రెండు రోజులు చూసేలా డీల్ కుదిరింది.
వారు అనుకున్న వారిద్దరికి అధికారికంగా విడాకులు 2015లో లభించాయి. అనంతరం ఆ యువతి మరొకరిని పెళ్లి చేసుకుంది. ఆమెకు ఒక కొడుకు మళ్లీ పుట్టాడు. ఇదిలా ఉంటే.. తన మొదటి కొడుకును నాలుగేళ్లుగా తన మాజీ భర్త చూసేందుకు రాలేదని.. తాను మలేషియా వెళ్లిపోతున్నట్లుగా పేర్కొంటూ.. ఇందుకు అంగీకరిస్తూ సంతకం చేయాలని 2019లో మాజీ భర్తనుకోరింది. అందుకు అతను నో చెప్పాడు.
దీనిపై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన బిడ్డను తనకే అప్పగించాలని కోరాడు. అయితే.. 2022లో ఫ్యామిలీ కోర్టు ఆ బిడ్డను తల్లి వద్దే ఉంచేలా నిర్ణయం తీసుకొని ఆదేశాలు జారీ చేశారు. దీన్ని సవాలు చేసిన సదరు మాజీ భర్త కేరళ హైకోర్టును ఆశ్రయించారు. అతడికి అనుకూలంగా అక్కడ తీర్పు వచ్చింది. తండ్రి కస్టడీకి కొడుకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
దీనిపై సుప్రీంకోర్టు గత ఏడాది కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుకూలంగా.. తండ్రి వద్ద కొడుకు ఉంచాలని పేర్కొంటూ ఉత్వర్వు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సదరు ఉత్తర్వును మరోసారి పరిశీలించాలిగా కోరుతూ ఇంకో పిటిషన్ సదరు తల్లి వేసింది. దీనిపై సుప్రీంకోర్టు తాజాగా ఒక తీర్పును ఇచ్చింది. గత ఏడాది తాను జారీ చేసిన ఆదేశాల్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా పేర్కొంది. కొడుకును తల్లి కస్టడీలోనే ఉండొచ్చని తేల్చి చెప్పింది. ఈ సమయంలో తల్లి అవసరం అతడికి చాలా ఉందన్న సుప్రీం.. చిన్న వయసులో బిడ్డకు అసలైన సంరక్షకురాలు తల్లేనని స్పష్టం చేసింది. ఇదో అసాధారణ ఆదేశాలుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది.