• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  శివరాజ్ కుమార్‌‌ కు డీకే...

శివరాజ్ కుమార్‌‌ కు డీకే శివకుమార్ బంపర్ ఆఫర్...రిప్లైకి ఫ్యాన్స్ హ్యాపీ!

| కన్నడ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఉన్న శివరాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

By - Tupaki Desk
Update: 2023-12-11 06:29 GMT

కన్నడ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఉన్న శివరాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటు సినిమాల్లో సూపర్ స్టార్ గా కొనసాగుతూ మరోవైపు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు. అయితే రాజకీయాలకు మాత్రం దూరంగా ఉండే ఆయన ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. దీంతొ తాజాగా కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్... శివరాజ్ కుమార్ కు ఒక బంపరాఫర్ ఇచ్చారని తెలుస్తుండగా... అందుకు హీరో ఇచ్చిన రిప్లై సూపర్ అని అంటున్నారట ఫ్యాన్స్!

అవును... 2024 లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా హీరో శివరాజ్ కుమార్‌ ను కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆహ్వానించారు. అయితే ఈ ఆఫర్‌ ను శివరాజ్ కుమార్ సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది. తనకు రాజకీయాలు తెలియవని గతంలోనే బహిరంగంగా చెప్పిన ఆయన... ఇప్పుడు మరోసారి ఆ విషయాన్ని డీకే శివకుమార్ ముందు స్పష్టంగా చెప్పారని అంటున్నారు. అయితే అటు డీకే శివకుమార్ ముందు ఒక ఆప్షన్ మాత్రం పెట్టారని అంటున్నారు.

తాజాగా బెంగుళూరులో జరిగిన ఈడిగ సదస్సులో లోక్‌ సభ ఎన్నికలు శివరాజ్ కుమార్ పోటీచేయడం లేదని డీకే శివకుమార్ తెలిపారు. ఇదే సమయంలో ఈ విషయంపై స్పందించిన శివన్న... తన తండ్రి ఇచ్చిన నట వారసత్వాన్ని కొనసాగించాలని.. నటుడిగా ప్రేక్షకులను మెప్పించాలని.. అదే తనకు తన తండ్రి ఇచ్చిన బహుమతి అని, బాధ్యత అని తెలిపారు! ఇదే సమయంలో తనకు రాజకీయాలు తెలియవని పునరుధ్ఘాటించారు.

అయితే తన భార్య గీత కు ఆసక్తిగా ఉంటే మాత్రం ఆమెకు టిక్కెట్ ఇవ్వమని.. ఆమె తరుపున తాను ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటానని శివరాజ్ కుమార్ తెలిపారని తెలుస్తుంది. కారణం... శివరాజ్ కుమార్ భార్య కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమార్తె. ఇలా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడంతో ఆమె ఎన్నికల్లో పోటీచేయాలని ఆసక్తి ఉంటే మాత్రం తప్పకుండ మద్దతు తెలుపుతానని శివన్న చెప్పారని అంటున్నారు. కాగా... గీత ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.

ఈ సమాధానాలతో శివరాజ్ కుమార్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారని అంటున్నారు. రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలు తగ్గించేసినా, ఆపేసినా తాము చాలా హర్ట్ అయ్యేవాళ్లమని.. అయితే రాజకీయాల్లోకి వెళ్లకుండా.. సినిమాలు చేస్తూనే ఉంటానని ఆయన చెప్పిన సమాధానం తమను ఖుషీ చేసిందని ఫ్యాన్స్ చెబుతున్నారంట. శివన్న సినిమాల్లోనే ఉండాలని.. ఆయన భార్య గీత వదిన రాజకీయాల్లోకి వెళ్తే సపోర్ట్ చేస్తామని చెబుతున్నారంట.

Tags:    
  • Dkshivakumar 
  • Kannadasuperstar 
  • Shivarajkumar 
  • Loksabhaelections 
  • Congress 
  • Karnatakapolitics 

Similar News

విశాఖకు అమిత్ షా చంద్రబాబు...మరోసారి అంతర్జాతీయ వేదికగా !

2026-11-08 04:43 GMT

కేటీఆర్ గడ్డం మీద రేవంత్ సెటైర్లు !

2026-11-08 04:43 GMT

ధర్మాన బ్రదర్స్ లెక్క తేడా కొట్టిందా ?

2026-11-08 04:42 GMT

ఎంపీగా గెలిచి.... జెడ్పీటీసీగా ఓడి....ఎందుకలా ?

2026-11-08 03:07 GMT

అక్కడ కూటమి క్లీన్ స్వీప్...వైసీపీ ఎక్కడ ?

2026-11-08 03:05 GMT

ఎమ్మెల్యే కళా వెంకటరావు ఆశలు గల్లంతు.. షాక్ ఇచ్చిన బొత్స

2026-11-08 03:05 GMT

సాయిరెడ్డి కొత్త పార్టీ: ఎవరికి ఎంతెంత ఎఫెక్ట్‌?

2026-11-08 03:05 GMT

కేటీఆర్‌ను మాస్ ర్యాగింగ్ చేసిన సీఎం రేవంత్‌.. విష‌యం ఏంటంటే!

2026-11-08 03:03 GMT

ఎంపీటీసీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు: ఒకరిపై ఒకరు పోటీ పడి గెలిచిన రక్తసంబంధీకులు!

2026-11-08 03:01 GMT

బొత్స కోటలో చిన్న శ్రీను మార్చిన సీన్

2026-11-08 03:00 GMT

బొత్స ఇంట్లో అనూహ్య ఫలితాలు.. కోడలు విజయం, కూతురు ఓటమి

2026-11-08 03:00 GMT

దమ్ము చూపిన జక్కంపూడి రాజా.. స్టేట్ లోనే రికార్డు

2026-11-07 14:12 GMT

Copyright @2026

Powered by Blink CMS