• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ధర్మాన బ్రదర్స్ లెక్క...

ధర్మాన బ్రదర్స్ లెక్క తేడా కొట్టిందా ?

| శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి పరిషత్తు ఎన్నికల్లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 28 జెడ్పీటీసీలకు కూటమి 27 గెలుచుకోగా, వైసీపీకి ఒక్కటే దక్కింది. ధర్మాన బ్రదర్స్ సహా దిగ్గజ నేతలు ఉన్నా పార్టీ ఈ స్థాయిలో ఓడిపోవడానికి అంతర్గత వర్గపోరే కారణమనే చర్చ సాగుతోంది. పార్టీకి పూర్వ వైభవం రావాలంటే నాయకత్వంలో మార్పులు అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

By - Satya P
Update: 2026-11-08 04:42 GMT

శ్రీకాకుళం జిల్లా వైసీపీని నడిపిస్తున్న వారు ధర్మాన బ్రదర్స్. దానికి తోడు దశాబ్దాల అనుభవం వారి సొంతం. ధర్మాన ప్రసాదరావు అయితే మంత్రిగా చాలా కాలం పనిచేశారు. సుదీర్ఘ కాలం మంత్రిగా చేసిన రికార్డు ఇప్పటికైతే ఆయనకే ఉంది. నాలుగు దశాబ్దాల పై చిలుకు అనుభవం. అలాంటిది ఆయన సొంత జిల్లాలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పరిషత్తు ఎన్నికల్లో వైసీపీకి దక్కింది ఒకే ఒక్క జెడ్పీటీసీ. మొత్తం శ్రీకాకుళం జిల్లాలో 28 జెడ్పీటీసీలు ఉంటే అందులో కూటమికి 27 లభించాయి. ఒక్క జెడ్పీటీసీ వైసీపీ పరం అయింది. అది కూడా ధర్మాన బ్రదర్స్ కుటుంబీకుల సొంత ఇలాకా అయిన నరసన్నపేటలో జరిగింది.

కూటమి కుమ్మేసింది :

ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లాలో జరిగిన పరిషత్తు ఎన్నికల్లో కూటమి కుమ్మేసింది అని అంటున్నారు. మొత్తం 27 జెడ్పీటీసీలు గెలుచుకుని కూటమి తిరుగులేని ఆధిక్యతతో జెడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకోబోతోంది. ఇక్కడ జనసేనకు ఈ పదవి ఇస్తారని టాక్ నడుస్తోంది. జనసేన ఈ ఎన్నికల్లో మూడు జెడ్పీటీసీలు గెలుచుకుంటే బీజేపీ రెండు గెలుచుకుంది. మొత్తం 22 జెడ్పీటీసీలు టీడీపీ పరం అయ్యాయి. దాంతో టీడీపీ నుంచి కూడా తీవ్రస్థాయిలో ఒత్తిడి వస్తోంది. తమకు చైర్మన్ చాన్స్ కావాలని వారు కోరుతున్నట్లుగా చెబుతున్నారు.

దిగ్గజ నేతలు ఉన్న చోట :

ఇక చూస్తే శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి దిగ్గజ నేతలే ఉన్నారు. ధర్మాన బ్రదర్స్ తో పాటుగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉన్నారు. అలాగే మాజీ మంత్రి సీదరి అప్పలరాజు పలాస లో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు అనేక మంది ఉన్నారు. వారిలో పాతపట్నం నుంచి రెడ్డి శాంతి ఉంటే ఎచ్చెర్ల నుంచి గొర్లె కిరణ్ కుమార్ ఉన్నారు. ఇలా నాలుగు వైపులా కాపు కాసే నేతలు ఉండి కూడా కనీసం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కోటి వంతున జెడ్పీటీసీ కూడా దక్కలేదు అంటే సిక్కోలులో వైసీపీ ఎంతలా నాయకత్వం లేమితో ఇబ్బంది పడుతోంది అన్నది అర్ధం అవుతోంది అంటున్నారు.

వర్గ పోరుతోనే :

వైసీపీ విషయానికి వస్తే కూటమిని నిందించి లాభం లేదని క్యాడర్ అంటారు. వర్గ పోరుతోనే వైసీపీ బలహీన పడుతోంది అని చెబుతున్నారు. ప్రతీ నియోజకవర్గంలో కనీసం మూడు వర్గాలు ఉంటున్నాయి. దాంతో వారిలో వారే పోరాడుకుంటూ పార్టీని గాలికి వదిలేస్తున్నారు అన్న చర్చ సాగుతోంది. అందుకే మనసు పెట్టి పనిచేయలేకపోయారు అని ఏకత్రాటిపైకి రాలేకపోయారు అని అంటున్నారు. శ్రీకాకుళంలో వైసీపీకి పూర్వ వైభవం దక్కాలీ అంటే భారీ రిపేర్లు అధినాయకత్వం చేయాల్సిందే అంటున్నారు. కూటమి అంగబలం చూపించింది అర్ధ బలం చూపించింది నియంత్రించింది అన్న మాటలను సాకులను హైకమాండ్ పట్టించుకుంటే మాత్రం సిక్కోలులో వైసీపీ ఫ్యాన్ రెక్కలకు కొత్త ఊపిరి రానట్లే అని కూడా క్యాడర్ నుంచి వినిపిస్తున్న మాటగా ఉంది.

Tags:    
  • ysrcp 
  • srikakulam 
  • dharmanabrothers 
  • tdp 
  • andhrapradeshpolitics 

Similar News

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

GTA 6 తయారీలో బెంగళూరు టీమ్.. 1,600 మందికి పైగా భారతీయుల పని!

2026-11-19 05:08 GMT

Copyright @2026

Powered by Blink CMS