సబ్ కలెక్టర్ సాహసం.. విద్యార్థిని సూసైడ్ తప్పింది

రీల్ సన్నివేశం రియల్ గా చోటు చేసుకోవటం చాలా అరుదైన అంశంగా చెప్పాలి.;

Update: 2026-03-20 04:34 GMT

రీల్ సన్నివేశం రియల్ గా చోటు చేసుకోవటం చాలా అరుదైన అంశంగా చెప్పాలి. మొండితనం.. మూర్ఖత్వం.. తొందరపాటు.. తల్లిదండ్రులు తిట్టారన్న ఆవేశంతో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఒక విద్యార్థిని సమయస్ఫూర్తితో.. సాహసంతో తప్పించిన బాన్సువాడ సబ్ కలెక్టర్ సాహసం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. అరవై అడుగులు ఎత్తున ఉన్న నీటి ట్యాంక్ పైకి ఎక్కిని విద్యార్థిని ఒకరు తాను చనిపోతానంటూ బెదిరించటం.. చివరకు ఈ ుదంతం గురించి సమాచారం అందుకున్న పోలీసులు పలు రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోవటం..అదే సమయంలో అక్కడకు వచ్చిన బాన్సువాడ సబ్ కలెక్టర్ కిర్మణయి సమయస్ఫూర్తితో వ్యవహరించిన విద్యార్థిని ప్రాణాల్ని కాపాడారు. అసలేం జరిగిందంటే..

కామారెడ్డి జిల్లా పరిదిలోని బూర్గుల్ గ్రామానికి చెందిన స్రవంతి అనే విద్యార్థిని ఇంటర్ చదువుతోంది. ఇటీవల ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసింది. ప్రస్తుతం ఇంట్లో ఉంటున్న ఆమె తరచూ ఫోన్ చూస్తుండటంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ విద్యార్థిని.. చనిపోతానంటూ గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఇంటికి సమీపంలోని నీటి ట్యాంకు మెట్లను సగం ఎక్కింది.

ఆమెను నిలువరించేందుకు తల్లిదండ్రులు.. సర్పంచి ఎంతగా సముదాయించిన వినలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల భయంతో ట్యాంక్ మొత్తం ఎక్కేసిన స్రవంతి.. తన వద్దకు వస్తే తాను సూసైడ్ చేసుకుంటానని బెదిరింపులకు దిగింది.దీంతో ఆమెకు ఎంత నచ్చజెప్పినా దిగలేదు. ఈ సమాచారం అందుకున్న బాన్సువాడ సబ్ కలెక్టర్ కిర్మణయి ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలికతో మాట్లాడుతూ అరవై అడుగుల ఎత్తున ఉన్న ట్యాంకర్ మెట్లను ఎక్కుతూనే.. విద్యార్థిని స్రవంతికి కౌన్సెలింగ్ ఇస్తూ పైకి చేరుకున్నారు. తల్లిదండ్రులు ఎవరూ ఏమీ అనరి.. తాను అండగా ఉంటానని ధైర్యం చెబుతూ సాహసం చేశారు. చివరకు స్రవంతిని క్షమంగా కిందకు తీసుకురావటంతో ఉదంతం సుఖాంతమైంది.

Tags:    

Similar News