బాలయ్య చిన్నల్లుడికి చెక్ పెడుతున్నదెవరు...!?

ఇప్పుడదే వయసున్న శ్రీ భరత్ కనుక ఎంపీ అయి రాజకీయంగా దూకుడు చేస్తే అది టీడీపీ రాజకీయాల్లో కొత్త నాయకత్వం ఆవిర్భావానికి నాంది పలుకుతుంది అని అంటున్నారు.

Update: 2024-05-10 12:30 GMT

విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్ధి, బాలక్రిష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ ని తెర వెనక కుట్ర సాగుతోందా అన్న చర్చకు తెర లేస్తోంది. శ్రీ భరత్ ఓడిపోవాలని కోరుకుంటున్నారా అని కూడా సందేహాలు వస్తున్నాయట. దీంతో పోలింగ్ కి గడువు దగ్గర పడుతున్న వేళ ఈ రకమైన ప్రచారం విశాఖ రాజకీయ వర్గాల్లో ఒక పెను సంచలనంగా మారింది. అంతే కాదు నెట్టింట ఇది హల్చల్ గా మారింది. శ్రీ భరత్ కనుక ఎంపీ అయితే మరో అధికార కేంద్ర బిందువు అవుతారని, ప్రచారంగా ఉంది అంటున్నారు.

టీడీపీలో చంద్రబాబు తరువాత వినిపించాల్సిన ఒకే ఒక పేరు నారా లోకేష్ ది మాత్రమే అని అంటున్నారు. ఆయన అటూ ఇటూ కానీ సమీపంలో ఎవరూ ఉండరాదు అన్నది ఒక విధానంగా పార్టీ పెట్టుకుంది అంటున్నారు. అంతే కాదు శ్రీ భరత్ కనుక ఎంపీ అయి రాజకీయంగా జోరు చేస్తే అటు నందమూరి ఇటు నారా వంశానికి మరో వారసుడుగా మారుతారు అని అంటున్నారు.

అయితే మొత్తానికి చూస్తే నారా నందమూరి వంశంలో చంద్రబాబు వారసుడిగా లోకేష్ రాజకీయాల్లో ఎదగాలని చూస్తున్నారు అన్నది తెలిసిందే. ఇప్పుడదే వయసున్న శ్రీ భరత్ కనుక ఎంపీ అయి రాజకీయంగా దూకుడు చేస్తే అది టీడీపీ రాజకీయాల్లో కొత్త నాయకత్వం ఆవిర్భావానికి నాంది పలుకుతుంది అని అంటున్నారు.

Read more!

దాంతో లోకేష్ నాయకత్వానికే ఒక దశలో బలమైన పోటీగా మారుతారన్న కలవరం ఉంది అని అంటున్నారు. ఇక చూస్తే చంద్రబాబు నాయుడు ఎంతటి రాజకీయ నిష్ణాతుడైనా, వ్యూహకర్త అయినా కుటుంబంలో తన వరకు పోటీ లేకుండా చూసుకున్నాడని కానీ లోకేష్ దగ్గరకు వచ్చేసరికి అంత సాఫీగా వ్యవహారం సాగడం లేదు అని అంటున్నారు.

ఇక టీడీపీ నాయకత్వం చంద్రబాబుకు దక్కే విషయం కనుక ఒకసారి ఆలోచిస్తే అనాడు సీనియర్ ఎన్టీఆర్ నుంచి పార్టీని తీసుకున్న చంద్రబాబు ఆ తర్వాత నందమూరి వంశంలో ఎవరినీ కూడా పార్టీలోకి రానివ్వలేదు, పెద్దగా ఎదగనివ్వలేదు అన్నది నిష్టుర సత్యంగా చెబుతారు.

అలా బయట నుంచి నందమూరి వంశానికి ఎంతైనా సాయం చేస్తే చేసి ఉండవచ్చుగానీ పార్టీలోకి మాత్రం అడుగుపెట్టనివ్వలేదని అనే చెబుతారు. ఇక ఈ నేపథ్యంలో గతంలో కేంద్రంలో వాజ్ పేయ్ ప్రభుత్వంలో పిలిచి కేంద్ర మంత్రి పదవులు తెలుగుదేశం పార్టీకి ఇస్తామని చెప్పినా చంద్రబాబు ఒప్పుకోలేదని కూడా ప్రచారంలో ఉన్న మాట.

వర్తమానంలో చూస్తే అందరినీ దాటుకుని నందమూరి వంశం నుంచి ఇప్పుడు శ్రీ భరత్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా సీటు సంపాదించారు. ఆయన తొలిసారిగా 2019లో విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో 2024లో కూటమితో జట్టు కట్టి, విశాఖను బీజేపీ ఖాతాలో చంద్రబాబు వేసినా పట్టువదలకుండా డిమాండ్ చేసి మరీ శ్రీ భరత్ మొత్తానికి విశాఖ సీటు తెచ్చుకున్నారని చెబుతారు.

4

ఇలా చూస్తే కనుక ఇపుడు శ్రీ భరత్ ఎంపీగా గెలిస్తే తెలుగుదేశంలో కొత్త తరంలో లోకేష్ కి తోడల్లుడి నుంచే పోటీ ఉంటుందని అంటున్నారు. అందుకనే శ్రీ భరత్ గెలవకుండా ఆపేందుకు తెరవెనుక తతంగాలన్నీ జరుగుతున్నాయని కూడా ప్రచారం అయితే సాగుతోంది. ఈ ప్రచారంతో పాటుగా శ్రీ భరత్ కి టీడీపీ క్యాడర్ నుంచి తగిన విధంగా సాయం అందడం లేదని అంటున్నారు. దీంతో ఈ టీడీపీలో చోటు చేసుకుంటున్న అంతర్గత రాజకీయ పరిణామాలు అన్నీ కూడా వైసీపీకి అనుకూలిస్తున్నాయని అంటున్నారు.

అలా విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్సా ఝాన్సీకి ఇవన్నీ కలిసి వచ్చే అంశాలుగా చెబుతున్నారు. ఇప్పటికే బొత్స ఝాన్సీ ప్రచారంలో దూసుకుని పోతున్నారు. ఆమెకు బలమైన సామాజిక వర్గం, పక్కా లోకల్ అన్న బ్రాండ్ ఇమేజ్, రెండు సార్లు ఎంపీగా చేసిన అనుభవం అన్నీ కలగలసి ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాయని అంటున్నారు.

Tags:    

Similar News