మూడోసారీ ఫెయిల్ అయిన రాకెట్.. మస్క్ కు మరో ఎదురుదెబ్బ

కొందరు కొన్నింటికి చాలా ఎక్కువగా కోరుకుంటారు. వారెంత కోరుకుంటారో.. అవి వారికి అందనట్లుగా మారుతుంటాయి.తాజాగా అలాంటి పరిస్థితినే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎదుర్కొంటున్నారు.;

Update: 2025-05-28 05:38 GMT
మూడోసారీ ఫెయిల్ అయిన రాకెట్.. మస్క్ కు మరో ఎదురుదెబ్బ

కొందరు కొన్నింటికి చాలా ఎక్కువగా కోరుకుంటారు. వారెంత కోరుకుంటారో.. అవి వారికి అందనట్లుగా మారుతుంటాయి.తాజాగా అలాంటి పరిస్థితినే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎదుర్కొంటున్నారు. అంతరిక్ష రంగంలో తాను తిరుగులేని శక్తిగా మారాలన్న తపన ఆయనకు ఎంత ఎక్కువన్న సంగతి తెలిసిందే. అంతరిక్ష రంగంపై మరింత పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న మస్క్ కు వరుస పెట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

ఆయనకు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థకు ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే రెండుసార్లు మెగా రాకెట్ ప్రయోగాలు వైఫల్యమైన వేళ.. ముచ్చటగా మూడోసారి ప్రయోగానికి సిద్ధమైంది. అయితే.. ఈసారీ ఆయన సంస్థకు చెందిన ప్రయోగం ఫెయిల్ అయ్యింది. స్పేస్ ఎక్స్ సంస్థ రూపొందించిన స్టార్ షిప్ మెగా రాకెట్ ప్రయోగం మరోసారి ఫెయిల్ అయ్యింది.

సదూర అంతరిక్ష యాత్రల కోసం స్పేస్ ఎక్స్ సంస్థ రూపొందించిన రాకెట్ ప్రయోగం ప్రయోగించిన అరగంటకు గాల్లోనే పేలిపోయింది. స్టార్ షిప్ రాకెట్ ఇలా పేలిపోవటం ఇది వరుసగా మూడోసారి. అంతరిక్ష రంగంలో తిరుగులేని విజయాలు సాధించాలన్న మస్క్ కల మాత్రం తీరని పరిస్థితి.

Tags:    

Similar News