డీలిమిటేషన్ ఇప్పట్లో లేదా...మ్యాటరేంటి ?
గత కొంతకాలంగా డీలిమిటేషన్ మీద సౌత్ స్టేట్స్ డీ అంటే డీ అంటూ మోడీ సర్కార్ మీద దండెత్తున్నాయి.;
గత కొంతకాలంగా డీలిమిటేషన్ మీద సౌత్ స్టేట్స్ డీ అంటే డీ అంటూ మోడీ సర్కార్ మీద దండెత్తున్నాయి. డీలిమిటేషన్ చేస్తే కనుక అది దక్షిణాదికి తీరని అన్యాయం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దానిని మరో పాతికేళ్ల పాటు వాయిదా అయినా వేయాలని లేదా జనాభా ప్రాతిపదిక విధానం తీసేసి ఇతర విధానాలను ముందుకు తీసుకుని రావాలని కోరుతున్నారు.
డీలిమిటేషన్ మీద కేంద్రం అయితే అధికారికంగా ఇప్పటిదాకా ఏ సంగతీ చెప్పలేదు. కానీ రకరకాలైన ప్రచారాలు మాత్రం దాని మీద జరుగుతూనే ఉన్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియని 2026లో స్టార్ట్ చేస్తారు అని కూడా ప్రచారం సాగింది. డీలిమిటేషన్ వల్ల యూపీ బీహార్ లలో పెద్ద ఎత్తున ఎంపీ సీట్లు పెరిగిపోతాయని అంతా అనుకున్నారు.
అదే విధంగా చూస్తే కనుక సౌత్ స్టేట్స్ కి ఉన్న సీట్లు కూడా తగ్గుతాయని కూడా ఆందోళన చెందారు. ఒకే ఒక్కడుగా నిలిచి స్టాలిన్ ఈ విషయంలో గట్టిగానే పోరాడుతున్నారు. అనూహ్యంగా ఎన్డీయేతర సౌత్ స్టేట్ పాలిటిక్స్ అంతా పోలరైజ్ అవుతోంది.
గతం కంటే ఎక్కువ ఐక్యతను కూడా దక్షిణాది పార్టీలు మోడీకి బీజేపీకి వ్యతిరేకంగా చూపిస్తున్నారు. దీంతో బీజేపీలో కలవరం రేగుతోంది అని అంటున్నారు ఉత్తరాదిన సంతృప్త స్థాయికి తన రాజకీయాన్ని చేర్చి మొత్తం సీట్లను ఓట్లను పెంచుకున బీజేపీకి ఇక మరింతగా విస్తరించాలీ అంటే దక్షిణాదియే అసలైన వేదికగా ఉంది.
ఇక్కడ ఉన్న సీట్లూ ఓట్లతో బలీయమైన శక్తిగా నిలిచి 2047 దాకా తన విజయ ప్రస్థానాన్ని అజేయంగా కొనసాగించాలని బీజేపీ చూస్తోంది. ఈ నేపథ్యంలో సౌత్ స్టేట్స్ కన్నెర్ర చేస్తే ఇబ్బందే అన్నది కమలనాధుల ఆలోచనగా ఉంది అని అంటున్నారు.
ఇటీవల ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సౌత్ స్టేట్స్ అంటే బీజేపీకి ఎంతో అభిమానం అన్నారు. వాటి పట్ల వివక్ష లేదని చెప్పారు. బీజేపీని దక్షిణాది రాజకీయంగా ఆదరిస్తోంది అన్నారు. ఇక బీజేపీ నాయకులు అయితే దక్షిణాదిని తాము ఎలా వదులుకుంటామని అంటున్నారు
డీలిమిటేషన్ పేరుతో బీజేపీని ఉత్తరాది పార్టీగా చేయాలని ఇండియా కూటమి నేతలు చూస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యంత వివాదాస్పదమైన అంశంగా డీలిమిటేషన్ వ్యవహారాన్ని మారుస్తున్నారు అన్నది బీజేపీ పెద్దలకు అర్థమైంది అని అంటున్నారు.
దాంతో డీలిమిటేషన్ ని తాము ఎందుకు అనవసరంగా నెత్తికెత్తుకోవాలి అన్న తర్జన భర్జన కూడా మొదలైంది అని అంటున్నారు ప్రతీ పదేళ్ళకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ ఉంటుంది అయితే 2021లో కరోనా రావడంతో అది నిలిచిపోయింది. ప్రస్తుతం అందరి దగ్గరా 2011 నాటి లెక్కలే ఉన్నాయి. మళ్లీ 2031లోనే జనాభా లెక్కల సేకరణ ఉంటుంది. ఇప్పటికి చూస్తే మరో ఆరేళ్ళ కాలం.
అంతవరకూ ఊరుకుని ఆ లెక్కలు వచ్చిన తరువాతనే డీలిమిటేషన్ వ్యవహారం చూసుకోవచ్చు అన్నది బీజేపీలో వినిపిస్తున్న మాటగా ఉంది అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే కిషన్ రెడ్డి కూడా టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పట్లో ఏమీ డీలిమిటేషన్ అన్నది లేదని అన్నారు అది 2029 తరువాత కదా అని చెప్పారు.
దానిని బట్టి చూస్తే బీజేపీ జమిలి ఎన్నికలో మినీ జమిలి ఎన్నికలో లేక సార్వత్రిక ఎన్నికలో చూసుకుని తన అధికారం పదిలపరచుకుని ఆ మీదటనే డీలిమిటేషన్ వైపుగా చూస్తుందని అంటున్నారు. ఈలోగా ఆ విషయం వీలైనంతవరకూ సైడ్ లైన్ లోకి వెళ్ళేలా చూస్తుందని అంటున్నారు. అదన్న మాట మ్యాటర్.