అనగనగా ఒక ’స్లీపింగ్ ప్రిన్స్’.. 20 ఏళ్లుగా కోమాలోనే..
మనం చిన్నప్పుడు పెద్దలు చెప్పే కథలు సాధారణంగా ’అనగనగా ఒక యువరాజు’ అని మొదలవుతుంటాయి.;
మనం చిన్నప్పుడు పెద్దలు చెప్పే కథలు సాధారణంగా ’అనగనగా ఒక యువరాజు’ అని మొదలవుతుంటాయి. ఇది కూడా అలాంటి కథే.. అయితే, ఇది కాస్త భిన్నమైది. ఈ యువరాజు అంతా బాగుంటే ఇప్పటికి రాజు అయ్యేవాడేమో...? కానీ, అతడి జీవితం అనుకోని మలుపు తిరిగింది. రోడ్డు ప్రమాదం అతడిని జీవచ్ఛవం చేసింది.
సాధారణంగా కోమాలోకి వెళ్తే కొన్ని సంవత్సరాల్లో కోలుకుంటారు.. లేదా అలానే ప్రాణాలు కోల్పోతారు. తిరిగి మన లోకం లోకి వస్తారనే ఆశతో కుటుంబ సభ్యులు, బంధువులు సేవలు చేస్తుంటారు. ఇప్పుడు చెప్పుకొంటున్న యువ రాజుకు కూడా అలానే సేవలు చేస్తున్నారు. కానీ, అది ఏడాది రెండేళ్లుగా కాదు.
20 ఏళ్లుగా మంచానికే..
ప్రిన్స్ అల్ వాలీద్ బిన్ ఖాలెద్ బిన్ తలాల్.. ఇదీ ఆ యువ రాజు పేరు. 16 ఏళ్ల వయసులో ఉండగా ఈయన లండన్ లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అప్పటినుంచి ఆస్పత్రి బెడ్ కే పరిమితం అయ్యారు. ఈ నెల 18న ఆయన 36వ ఏట అడుగుపెట్టారు. అంటే.. సగం జీవిత కాలం పైగా మంచంలోనే గడిచింది.
అల్ వాలీద్ బిన్ ఖాలెద్ బిన్ తలాల్ ది ఏ దేశమో చెప్పలేదు కదూ.. ఈయన సౌదీ యువరాజు. ఆ దేశ రాజ కుటుంబానికి చెందిన
అల్ వాలీద్ బిన్ ఖాలెద్ బిన్ తలాల్ 2005లో లండన్ లో కారు ప్రమాదానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడడంతో కోమాలోకి వెళ్లారు. అప్పటినుంచి ఆస్పత్రిలోనే ఉన్నారు. ప్రస్తుతం సౌదీ రాజధాని రియాద్ లోని కింగ్ అబ్దులాజిజ్ మెడికల్ సెంటర్ లో లైఫ్ సపోర్ట్ పై ఉన్నారు.
స్లీపింగ్ ప్రిన్స్..
అల్ వాలీద్ బిన్ ఖాలెద్ బిన్ తలాల్ 20 ఏళ్లుగా కోమాలోనే ఉండడంతో ఆయనను అందరూ స్లీపింగ్ ప్రిన్స్ అంటూ ఉంటారు. వాస్తవానికి సాధారణ స్థాయి వారైతే ఇన్ని సంవత్సరాలు ఆస్పత్రిలో ఉండడం కష్టమే. కానీ, తలాల్ బాగా డబ్బున్న సౌదీ రాజ కుటుంబం కావడంతో ఆయన కోమాలో ఉన్నప్పటికీ అలానే చికిత్స అందిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తలాల్ కళ్లు తెరిచి మళ్లీ మన లోకంలోకి రావాలని ఆకాంక్షిద్దాం.