ఆ స్కూల్లో "స్కర్టులు" నిషేధించడానికి కారణం ఇదేనంట!?

ఈ సమయంలో తాజాగా యూకేలోని ఓ ప్రైమరీ స్కూలు ఈ దిశగా తమ నిర్ణయాన్ని వెల్లడించింది!

Update: 2024-05-22 13:56 GMT

స్కూల్స్ లోనూ, కాలేజీల్లోనూ ఆడపిల్లల వస్త్రధారణపై రకరకాల చర్చలు జరుగుతుంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో అమ్మాయిలకు వస్త్రదారణ విషయంలో స్వేచ్ఛ ఇవ్వాలని కొందరంటే... గుడి, బడి విషయం వరకైనా ఆ విషయం సమానత్వం, సంస్కృతి ప్రతిభింబించేలా ఉండాలని మరికొందరు చెబుతుంటారని అంటారు. ఈ సమయంలో తాజాగా యూకేలోని ఓ ప్రైమరీ స్కూలు ఈ దిశగా తమ నిర్ణయాన్ని వెల్లడించింది!

అవును... యునైటెడ్ కింగ్‌ డమ్ (యూకే)లోని ఓ ప్రైమరీ స్కూల్ అమ్మాయిల దుస్తుల విషయంలో పేరెంట్స్ కి లేఖలు రాసింది. ఇందులో భాగంగా తమ స్కూలు అమ్మాయిలు స్కర్టులు ధరించడాన్ని నిషేధించాలని కోరుతోంది! అమ్మాయిలు స్కర్టులను మరింత పోట్టిగా ధరిస్తున్నారనే ఆందోళలన కారణంగా వాటిపై నిషేధం విధిస్తున్నట్లు అక్కడి మీడియా నివేదించింది! దీంతో ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు తెరపైకి వస్తున్నాయి.

వివరాళ్లోకి వెళ్తే... కార్న్‌ వాల్‌ లోని న్యూక్వే జూనియర్ అకాడమీ ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి స్కర్టులపై నిషేధం అమలు చేయాలని భావిస్తున్నట్లు తల్లిదండ్రులకు లేఖ రాసింది. ఒక వేళ ఇది ఆమోదం పొందితే.. మహిళా విద్యార్థులు స్కర్టుల స్థానంలో ప్యాంటు లేదా, టైలర్డ్ షార్ట్స్ ధరించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా... ఎగ్జిక్యూటివ్ హెడ్ టీచర్ క్రెయిగ్ హేస్ తల్లిదండ్రులకు రాసిన లేఖలో ఈ విధంగా పేర్కొన్నారు.

ఇందులో భాగంగా... తమ స్కూల్ యూనిఫాం విషయంలో ఇకపై స్కర్టులు ధరించే అవకాశం ఉండదు.. బదులుగా ప్యాంట్లు, టైలర్డ్ బ్లాక్ షార్ట్స్ ప్రతిపాదిస్తున్నాము అని పేర్కొంది. దీనికి కారణం... అమ్మాయిలలో కొందరు తమ స్కర్టులను ధరించే విధానం గురించి స్కూలు యాజమాన్యం ఆందోళన చెందుతున్నట్లు తెలిపింది! ఇదే సమయంలో... ఈ ఆందోళనలు కొంతమంది తల్లిదండ్రులు, సంరక్షులు, సందర్శకుల నుంచి వచ్చాయనీ పేర్కొంది.

Read more!

ఈ సమయంలో... కొన్ని స్కర్టులు చాలా చిన్నవిగా ఉన్నాయి.. ఇప్పుడు దీన్ని పరిస్కరిస్తున్నాము.. సెప్టెంబర్ 2024లో స్కర్టుకు బదులు అందరికీ ప్యాంటు ధరించే ఆలోచన ఉంది.. అని తెలిపారు. పైగా తాము తీసుకుంటున్న ఈ నిర్ణయం హోదా కనిపించకుండా సమానత్వాన్ని అందిస్తుందని వారు అభిప్రాయపడ్డారు.

ఆ సంగతి అలా ఉంటే... పాఠశాల ఇలా పేర్కొనడంపై పలువురు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు ఏం ధరించాలో స్కూలు యాజమాన్యం చెప్పడం సంతోషంగా లేదని చెబుతున్నారు. దీనిపై నిషేధం వెర్రితనంగా అనిపిస్తుందని కామెంట్ చేస్తున్నారు. మరి ఈ నిర్ణయం ఏ మేరకు కార్యరూపం దాల్చబోతుందనేది వేచి చూడాలి!

Tags:    

Similar News