మంత్రులలో అఫెన్సివ్ మెకానిజమేదీ ?
ఇదిలా ఉంటే సింహాచలంలో చందనోత్సవం వేళ అనుకోని దుర్ఘటన జరిగింది. దానికి కారణం అధికారుల తప్పిదం కావచ్చు,;
ప్రభుత్వం అన్నాక సవాలక్ష వ్యవహారాలు ఉంటాయి. సమస్యలూ ఉంటాయి. తెల్లారి లేస్తే జరిగే అన్నింటికీ ప్రభుత్వాన్ని ముడిపెట్టి మాట్లాడుతూంటారు. దానికి కారణం గత కొన్ని దశాబ్దాలుగా అధికారం రాజకీయం సెంట్రలైజ్ కావడమే. ఊళ్ళో కుళాయి వచ్చినా సీఎం పీఎం లదే క్రెడిట్ అయినపుడు రోడ్డు మీద లారీ బోల్తా పడి ప్రమాదం జరిగినా రోడ్లు బాగులేవని వారినే అంటారు.
ఇక ప్రజల్లో పెరిగిన రాజకీయ చైతన్యం మరో కారణం. దీంతో ప్రతీ దానికీ ప్రభుత్వం మీదనే విమర్శలు చేస్తున్నారు. దానికి విపక్షాలు తోడు అవుతున్నాయి. మరి కాసుకోవాల్సిన వారు పెద్దలు కీలక పదవులలో ఉన్న వారూ కాసుకుంటున్నారా అన్నదే ప్రశ్న. మరీ ముఖ్యంగా మంత్రులు గట్టిగా నిలబడుతున్నారా అన్నది కూడా మరో ప్రశ్న.
ఇదిలా ఉంటే సింహాచలంలో చందనోత్సవం వేళ అనుకోని దుర్ఘటన జరిగింది. దానికి కారణం అధికారుల తప్పిదం కావచ్చు, లేదా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కావచ్చు. అది పక్కా లోకల్ మ్యాటర్ గానే చూడాలి. బాధ్యులను గుర్తించి శిక్షించాలి. కానీ దానికి ఏకంగా సీఎం ని ముడిపెట్టి వైసీపీ విమర్శలు చేస్తూంటే మంత్రులు కీలక నేతలు సరిగ్గా తిప్పి కొట్టలేకపోయారు అని అంటున్నారు.
గాలి వాన వల్ల గోడ కూలిందని ఒకరు అంటే గత ప్రభుత్వంలో గోడ నిర్మాణం జరిగిందని మరొకరు అంటారు. అన్ని ఏర్పాట్లూ చేశామని అయినా కొన్ని ఇలా జరిగాయని మరొకరు అంటారు. అయితే ఈ ఇష్యూలో చాలా వేగంగా రియాక్ట్ అయి రంగంలోకి దిగిపోయింది వైసీపీ. ఏకంగా జగన్ విశాఖ వచ్చి బాధితులను పరామర్శించి చంద్రబాబు మీద కూటమి ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు.
వాటికి బదులు ఇవ్వడంలోనూ మంత్రులు ముఖ్య నేతలూ వెనకబడ్డారని అంటున్నారు. జరిగింది ప్రమాదమే అని చెప్పుకుంటూనే లోపాలు ఎక్కడ జరిగాయి అన్నది చెప్పి విపక్షం నోరు మూయించాల్సిన బాధ్యత కూటమి వైపు ఉందని అంటున్నారు. అయితే అలా కాకుండా ఎవరికి వారుగా తమ బాధ్యత కాదన్నట్లుగా వ్యవహరించబట్టే మొత్తం చందనోత్సవం అట్టర్ ఫ్లాప్ అయింది అన్న ఇంప్రెషన్ ని కలిగించారు.
నిజానికి చందనోత్సవం ఈసారి బాగానే జరిగిందని భక్తులు చెబుతున్నారు ఈసారి కూడా భారీ ఎత్తున భక్తజనం రాగా వారికి గతం కంటే కూడా మంచి సౌకర్యాలతో దర్శనం వేగంగానే చేయించారు అని అంటున్నారు. మరి ఈ ఫీడ్ బ్యాక్ ని వాడుకుంటూ జరిగిన పొరపాటుకు బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షిస్తామని పెర్ఫెక్ట్ టోన్ తో చెప్పాల్సిన వారు తలో మాటా మాట్లాడడం వల్లనే జనంలో బదనాం అవుతున్నారని అంటున్నారు.
నిజం చెప్పాలంటే సింహాచలంలో అధికారుల పెత్తనం అధికం అయింది. దాంతోనే ఈ తంటా అని అంటున్నారు. ఎవరు ఎక్కడ తప్పు చేసినా అది చివరికి ప్రభుత్వానికి చుట్టుకుంటోందని అంటున్నారు. ఇక కొందరు చిల్లర రాజకీయం మూలంగా కూడా వ్యవహారం శృతి మించి ఇలాంటి ఘటనలకు ఆస్కారం ఇస్తోంది అని అంటున్నారు.
హోం మంత్రి వంగలపూడి అనిత కొంతలో కొంత ఈ ఘటన తరువాత ధీటుగా ప్రభుత్వం తరఫున నిలబడి మాట్లాడినా సీనియర్లుగా ఉన్న వారు ఇతర కీలక నేతలు మాత్రం ఎందుకో అనుకున్నంతగా రియాక్ట్ కాలేదనే అంటున్నారు. దాంతో వైసీపీ రాజకీయ వ్యూహం బాగా పారింది అని అంటున్నారు. జగన్ రాకతో పొలిటికల్ గా మైలేజ్ ని గెయిన్ చేసే ప్రయత్నం చేసారని అంటున్నారు.