నాన్ బెయిలబుల్ వారెంట్.. కానీ అధ్యక్ష పదవి అందుకున్న మలయాళ నటి!

మలయాళ సినీ ఇండస్ట్రీలో దాదాపు మూడు దశాబ్దాలకి ఒక మహిళా నటి అధ్యక్ష పదవిని చేపట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది.;

Update: 2025-08-16 06:32 GMT

మలయాళ సినీ ఇండస్ట్రీలో దాదాపు మూడు దశాబ్దాలకి ఒక మహిళా నటి అధ్యక్ష పదవిని చేపట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. అంతేకాదు ఈమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ కేసు ఉన్నప్పటికీ కూడా ఈమె.. ఈ అధ్యక్ష పదవి చేపట్టడం హాట్ టాపిక్ గా మారింది అని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే.. మలయాళం సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎక్కువవుతున్న నేపథ్యంలో 'అమ్మ' కి అధ్యక్షుడిగా ఉన్న ప్రముఖ స్టార్ హీరో మోహన్ లాల్ ఆ పదవికి రాజీనామా చేశారు.

దీంతో 'అమ్మ' కి అధ్యక్షులు లేకపోవడంతో 2027లో జరగాల్సిన ఉన్నా.. మోహన్ లాల్ తప్పుకోవడంతో ఎన్నికలు ముందుగానే జరిగాయి. అలా ఇప్పుడు జరిగిన ఎన్నికలలో శ్వేతా మీనన్ అధ్యక్షురాలిగా ఎన్నికయింది

ముఖ్యంగా 31 ఏళ్ల చరిత్ర ఉన్న 'అమ్మ' కి తొలి మహిళ అధ్యక్షురాలిగా ఎంపికై రికార్డ్ సృష్టించింది శ్వేతా మీనన్. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే ఈమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ కేసు నమోదు అవ్వడానికి కారణం ఏమిటి అంటే.. మలయాళ నటి శ్వేతా మీనన్ పై సామాజిక కార్యకర్త మార్టిన్ చెన్నైలోని కొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమె నటించిన పలు సినిమాలలో అభ్యంతరకర సన్నివేశాలు, వాణిజ్య ప్రకటనలు సోషల్ మీడియాలో ప్రసారం కావడంతో.. కొన్ని రోజుల క్రితం ఫిర్యాదు చేయగా పోలీసులు అప్పుడు పట్టించుకోలేదని.. దీంతో ఆయన ఎర్నాకులం కోర్టును ఆశ్రయించారు. డబ్బు కోసం అడల్ట్ చిత్రాలలో నటిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.

వాస్తవానికి అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అధ్యక్ష పదవికి శ్వేతా మీనన్ పోటీ చేయడానికి ఈనెల మొదట్లో సిద్ధమైన విషయం తెలిసిందే. అటు నటీనటుల నుంచి ఈమెకు పెద్ద ఎత్తున సహకారం లభించింది. ఇక ఈమె అధ్యక్ష పదవిని చేపట్టడం ఇష్టం లేక ప్రత్యర్ధులు కావాలనే.. ఆమె గతంలో నటించిన చిత్రాల సన్నివేశాలను ఇప్పుడు బయటకు తీసి ఈమెపై ఆరోపణలు చేస్తున్నారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఎవరు ఎన్ని కేసులు పెట్టినా.. చాలామంది నటీనటులు ఈమెకు అండగా నిలబడడంతో ఈమె అధ్యక్షురాలిగా ఎన్నికయింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

శ్వేతా మీనన్ విషయానికి వస్తే 1994లో సెమినా మిస్ ఇండియా ఏషియా పసిఫిక్ గా నిలిచిన శ్వేతా మీనన్ నటించిన తొలి సినిమా అనస్వరం. రతి నిర్వేదం, హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ లాంటి మలయాళ చిత్రాలతో పాటు తెలుగు తమిళ్ హిందీ చిత్రాలలో కూడా నటించింది తెలుగులో ఆనందం సినిమాలో ప్రత్యేక గీతములు మెరిసిన ఈమె జూనియర్స్ రాజన్న వంట చిత్రాలలో కూడా సందడి చేసింది.

Tags:    

Similar News