• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జంగ్ సైరన్ మోగించిన...

జంగ్ సైరన్ మోగించిన హసీనా.. భారత్ నుంచి కాలినడకన ప్రయాణం.. మళ్లీ రణరంగంగా బంగ్లాదేశ్?

| బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వచ్చే నెల 16న స్వదేశానికి తిరిగివచ్చేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని కోరగా, అక్కడి ప్రభుత్వం తిరస్కరించినట్లు కథనం పేర్కొంది. అవసరమైతే కాలినడకనైనా సరిహద్దు దాటి వస్తానని ఆమె ప్రకటించినట్లు అనుచరులు చెబుతున్నారు. హసీనాకు స్వాగతం పలికేందుకు మద్దతుదారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

By - A.N.Kumar
Update: 2026-11-28 04:31 GMT

ఒకప్పుడు తన కనుసన్నలతో ఒక దేశాన్ని నడిపించిన నాయకురాలు.. నేడు అదే సొంత గడ్డపై అడుగుపెట్టడానికి అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. అధికారం శాశ్వతం కాకపోవచ్చు.. కానీ ప్రజల గుండెల్లో సంపాదించుకున్న స్థానం మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు. 2024లో తలెత్తిన రాజకీయ తుపానులో పదవిని కోల్పోయి.. ప్రాణరక్షణ కోసం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా.. ఇప్పుడు తిరిగి తన మాతృభూమికి చేరుకోవాలని తపిస్తున్నారు.

వచ్చే నెల 16వ తేదీన స్వదేశానికి తిరిగి వచ్చేందుకు తనకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని ఆమె బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరారు.. అయితే అక్కడి ప్రభుత్వం ఆ విజ్ఞప్తిని నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. కానీ కష్టాలకు తలవంచడం ఆమె నైజం కాదు. విమానం పంపకపోతేనేం.. అవసరమైతే సరిహద్దు రేఖను కాలినడకన దాటి అయినా సరే తన ప్రజల మధ్యకు వస్తానన్న ప్రకటనలు ఇప్పుడు బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

నాయకురాలి అడుగు కోసం వేచి చూస్తున్న అభిమానుల ఆవేదన.. ఉత్సాహం ఇప్పుడు కట్టలు తెంచుకుంటున్నాయి. హసీనా తిరిగి వచ్చే క్షణం కోసం లక్షలాది మంది మద్దతుదారులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి రాజధాని ఢాకా వరకు కిలోమీటర్ల కొద్దీ మానవహారం నిర్మించి.. తమ అభిమాన నేతకు అపూర్వ స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. "మా నాయకురాలిని స్వదేశానికి తీసుకురావడానికి ఆకాశమార్గం లేకపోతే నేలమార్గమే మాకు రహదారి అవుతుంది. ఆమె కాలినడకన సరిహద్దు దాటడానికి కూడా వెనుకాడరు" అంటూ హసీనా అనుచరుడు అబూ ఒబైదా అరిన్ సంచలన ప్రకటన చేయడం బంగ్లాదేశ్ రాజకీయాలను షేక్ చేస్తోంది. ఈ మాటలు ఒక నాయకురాలిపై కార్యకర్తలకు ఉన్న అచంచల విశ్వాసానికి నిదర్శనం.

బంగ్లాదేశ్ అభివృద్ధిలో.. ఆర్థిక ప్రగతిలో షేక్ హసీనా ముద్ర చెరగనిది. ఆమె భారత్ తో స్నేహంగా ఉన్నారు. అమెరికా ఒక దీవి అడిగితే ఇవ్వలేదు. అదే అగ్రరాజ్యానికి ఆగ్రహం తెప్పించింది. ఉద్యమాన్ని రగిలించి ఆమెను గద్దెదించేలా చేసింది. అయితే పోయిన చోటనే వెతుక్కునే పనిని హసీనా మొదలుపెట్టింది. తను దిగిపోయాక ఆగమైన బంగ్లాదేశ్ ను సరిదిద్దడానికి మరణశిక్ష పడినా వెనక్కి తగ్గకుండా స్వదేశానికి పయనం అవుతోంది. అయితే ప్రభుత్వ ఆంక్షలు ఆమె తిరుగు ప్రయాణానికి పెద్ద సవాళ్లుగా నిలుస్తున్నాయి. ఒకవైపు చట్టపరమైన చిక్కులు.. మరోవైపు వ్యతిరేక వర్గాల తీవ్ర ప్రతిఘటన పొంచి ఉన్నప్పటికీ సొంత గడ్డపై అడుగుపెట్టాలన్న ఆమె పట్టుదల మాత్రం సడలడం లేదు.

ఇప్పుడు బంగ్లాదేశ్ మొత్తం ఒక్కటే ఆలోచిస్తోంది. హసీనా సరిహద్దు వరకు ప్రయాణిస్తారా? కంచెలను దాటి కాలినడకన బంగ్లాదేశ్ గడ్డను ముద్దాడతారా? ఆ దృశ్యాన్ని చూడటానికి లక్షలాది మంది రోడ్లపైకి వస్తారా? కాలమే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. తన ప్రజల కోసం ఎన్ని అడ్డంకులనైనా ఎదుర్కోవడానికి సిద్ధమైన షేక్ హసీనా పునరాగమన యత్నం.. బంగ్లాదేశ్ చరిత్రలో ఒక మరపురాని ఉద్వేగభరిత అధ్యాయంగా నిలిచిపోనుంది. బంగ్లా మరో రణరంగానికి కారణం కానుంది.. ఏం జరుగనుందన్నది వేచిచూడాలి.

Tags:    
  • sheikhhasina 
  • bangladeshpolitics 
  • bangladeshnews 
  • politicalcrisis 

Similar News

కరోనా కంటే భయంకరమైన ఉపద్రవం రాబోతోందా?

2026-11-28 03:58 GMT

కూటమి వర్సెస్ వైసీపీ : సీట్లు పెరిగితే ఎవరికి లాభం ?

2026-11-28 03:48 GMT

జగన్ డెసిషన్...కాంగ్రెస్ కి భారీ షాక్ !

2026-11-28 03:48 GMT

చీపురుపల్లి మీద కన్ను ...బొత్సతో చిన్న శ్రీను డైరెక్ట్ ఫైట్ ?

2026-11-28 03:48 GMT

డీలిమిటేషన్ కోసం ప్రత్యేక కమిషన్...ఈసారి బిల్లు గెలిచేస్తుంది !

2026-11-28 03:48 GMT

యోగి మీద భారీ స్కెచ్...సీఎం గిరీ ఎన్నికల వరకేనా ?

2026-11-28 03:47 GMT

డీలిమిటేషన్... ఏపీ ఎప్పటికీ చిన్న రాష్ట్రంగానేనా ?

2026-11-28 02:41 GMT

రుషికొండ ప్యాలెస్ దశను మార్చేలా కూటమి డెసిషన్

2026-11-28 02:39 GMT

పైన బీజేపీ.. కింద కాంగ్రెస్...టాలీవుడ్ నలుగుడే మరి !

2026-11-27 17:15 GMT

తేడా ఎక్కడ కొట్టింది... జనసేనలో అంతర్మధనం

2026-11-27 17:14 GMT

సినిమా డైలాగులు వేరు.. అసలు రాజకీయం వేరు సీఎం విజయ్..

2026-11-27 17:14 GMT

Copyright @2026

Powered by Blink CMS