• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కూటమి వర్సెస్ వైసీపీ :...

కూటమి వర్సెస్ వైసీపీ : సీట్లు పెరిగితే ఎవరికి లాభం ?

| డీలిమిటేషన్‌తో ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెరిగితే 2029 ఎన్నికల రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. మూడు పార్టీల కూటమిలో సీట్ల పంపకాల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పెరిగిన స్థానాలు వైసీపీకి సవాలుగా మారతాయని కూటమి వర్గాల అంచనా. అయితే ప్రజాదరణ ఉంటే సీట్ల పెంపు ప్రభావం చూపదని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

By - Satya P
Update: 2026-11-28 03:48 GMT

ఏపీలో ఒక్కసారిగా 50 శాతం సీట్లు అటు లోక్ సభ ఇటు అసెంబ్లీలలో పెరుగుతాయి. దాంతో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రమే మారిపోతుంది. ఇప్పటిదాకా చూసిన అనేక నియోజకవర్గాల రూపు రేఖలు మారిపోతాయి. అలాగే కొత్తవి పుట్టుకుని వస్తాయి. పెద్దవి బద్ధలు అయి రెండు మూడుగా మారిపోతాయి. ఇందులో మూడవ వంతు మహిళలకు రిజర్వ్ అవుతాయి. ఇలా అనేక లెక్కలు ఇందులో ఇమిడి ఉంటాయి. ఇవన్నీ కూడా రాజకీయాల మీద తీవ్ర ప్రభావం చూపించడం ఖాయమని అంటున్నారు.

ఢీ అంటే ఢీగా :

ఏపీలో రాజకీయం చూస్తే ఢీ అంటే ఢీ అన్నట్లుగా వాతావరణం ఉంటుంది. అటు కూటమిలో పార్టీలు మూడు ఉన్నాయి. టీడీపీ టాప్ టూ బాటమ్ బలం ఉన్న అతి పెద్ద పార్టీ, జనసేన రెండవ అతి పెద్ద పార్టీగా కూటమిలో ఉంది. బీజేపీ జాతీయ పార్టీ. ఈ మూడు పార్టీలు కలిస్తే జరిగేది ఏమిటి అన్నది 2024 ఎన్నికలు రుజువు చేశాయి. అయితే ఆనాడు త్యాగాలతో భారాలతో పొత్తులు కుదిరాయి. 2029 ఎన్నికలకు ఈ బాకీలు అన్నీ ఉన్నాయి. ఎలాగా అన్న చింత కూటమిలో ఉంది. అలాంటి సమయంలో డీలిమిటేషన్ తో సీట్లు మరో యాభై శాతం పెరుగుతాయి అంటే అది కచ్చితంగా కూటమికి మేలు చేసే వ్యవహారమే అని అంటున్నారు. మూడు పార్టీల ఆకాంక్షలను తీర్చుకుంటూ కలసికట్టుగా 2029 ఎన్నికలను ఫేస్ చేయడానికి ఈ సీట్ల పెంపు ఎంతో దోహదపడుతుంది. అంతే కాదు కూటమి మూడు పార్టీలలో ఉన్న అనేక మంది ఆశావహుల కోరికలు కూడా తీర్చనుంది. ఒక విధంగా కూటమిలో పెద్ద ఎత్తున సాగుతాయనుకునే సీట్ల పేచీలకు చెక్ పెట్టేసేలా డీలిమిటేషన్ ఒక అమృత హస్తంగా మారుతుందని విశ్లేషిస్తున్నారు.

వైసీపీకి ఇబ్బందేనా :

ఇక చూస్తే వైసీపీకి ఈ డీలిమిటేషన్ వల్ల ఇబ్బంది అవుతుందా అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. ఎందుకంటే కూటమి విడిపోక పోయినా లుకలుకలు కనుక ఉంటే అవి 2029 నాటికి పెరిగి పెద్దవి అయితే గ్రౌండ్ లెవెల్ లో అవి రివర్స్ గా పనిచేసి వైసీపీకి భారీ అడ్వాంటేజ్ అవుతుంది అని ఒక అంచనా ఉంది. కూటమిలో అంతా ఒక్క త్రాటి పైకి రావాలంటే సీట్ల పేచీ తేలాలి. ఇపుడు డీలిమిటేషన్ పుణ్యమాని ఆ తలనొప్పి కూటమికి తప్పుతుంది. మరి ఈ విధంగా చూస్తే వైసీపీ మీద ఏకమొత్తంగా అంతా కలసి దూసుకుని వస్తారు. పైగా ఎన్నికల వేళకు వైసీపీలోకి కూటమిలో ఇమడలేని వారు వస్తారన్న ఊహాగానాలు ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు తల్ల కిందులు అవుతాయని అంటున్నారు. ఇంకో వైపు వైసీపీకి 175 అసెంబ్లీ సీట్లలోనే సరైన ఇంచార్జిలు లేరని అంటున్నారు. ఆ సంఖ్య కనుక 263గా పైరిగితే సమర్ధులైన వారిని వెతికి తెచ్చిపెట్టి ఎన్నికల్లో కూటమిని ధీటుగా ఎదుర్కోవడం కష్టం గానే మారుతుందని అంటున్నారు.

ప్రజా తీర్పు మారదా :

అయితే దీని మీద వైసీపీ వాదన భిన్నంగా ఉంది. ఒక్క సీటు రెండు అయితేనేమిటి మూడు అయితేనేమిటి. ఎందరు వచ్చి పోటీ పడినా ఎంత కూటమిగా కట్టినా ప్రజలలో మార్పు అన్నది వస్తే కనుక ఓడించాలని నిర్ణయిస్తే కనుక ఇవేమీ నిలబడవు అని అంటున్నారు. ఇక వైసీపీ వైపు వేవ్ ఉందని తెలిస్తే కూటమిలో సీట్లు ఇస్తామని అన్నా కూడా తమ వైపే వస్తారు అని కూడా అంటున్నారు. అలా వైసీపీకి ప్రజాదరణ మొగ్గు జగన్ పాదయాత్ర తరువాత పూర్తిగా వెల్లడి అవుతుందని అందుకే డీలిమిటేషన్ అన్నది తమకు ఇబ్బంది కాదనే ఆ పార్టీ నేతలు ధీమా పడుతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    
  • andhrapradesh 
  • delimitation 
  • apassemblyelections2029 
  • ysrcp 
  • tdp 

Similar News

కరోనా కంటే భయంకరమైన ఉపద్రవం రాబోతోందా?

2026-11-28 03:58 GMT

జగన్ డెసిషన్...కాంగ్రెస్ కి భారీ షాక్ !

2026-11-28 03:48 GMT

చీపురుపల్లి మీద కన్ను ...బొత్సతో చిన్న శ్రీను డైరెక్ట్ ఫైట్ ?

2026-11-28 03:48 GMT

డీలిమిటేషన్ కోసం ప్రత్యేక కమిషన్...ఈసారి బిల్లు గెలిచేస్తుంది !

2026-11-28 03:48 GMT

యోగి మీద భారీ స్కెచ్...సీఎం గిరీ ఎన్నికల వరకేనా ?

2026-11-28 03:47 GMT

డీలిమిటేషన్... ఏపీ ఎప్పటికీ చిన్న రాష్ట్రంగానేనా ?

2026-11-28 02:41 GMT

రుషికొండ ప్యాలెస్ దశను మార్చేలా కూటమి డెసిషన్

2026-11-28 02:39 GMT

పైన బీజేపీ.. కింద కాంగ్రెస్...టాలీవుడ్ నలుగుడే మరి !

2026-11-27 17:15 GMT

తేడా ఎక్కడ కొట్టింది... జనసేనలో అంతర్మధనం

2026-11-27 17:14 GMT

సినిమా డైలాగులు వేరు.. అసలు రాజకీయం వేరు సీఎం విజయ్..

2026-11-27 17:14 GMT

బయట తింటేనే కాదు.. ఇంట్లో వండుకున్నా ప్రాణాలకు ముప్పేనా? హైదరాబాద్ లో ఏంటీ దారుణం?

2026-11-27 17:12 GMT

Copyright @2026

Powered by Blink CMS