• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  డీలిమిటేషన్... ఏపీ...

డీలిమిటేషన్... ఏపీ ఎప్పటికీ చిన్న రాష్ట్రంగానేనా ?

| డీలిమిటేషన్‌తో ఏపీ అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263కి, తెలంగాణ సీట్లు 117 నుంచి 179కి పెరిగే అవకాశం ఉంది. అయితే విభజన చట్టం ప్రకారం గతంలోనే పెరగాల్సిన సీట్లు పెంచకపోవడంతో ఏపీకి నష్టం జరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. విస్తీర్ణంలో తమిళనాడు కంటే పెద్దదైన ఏపీకి, డీలిమిటేషన్ తర్వాత కూడా ఆ రాష్ట్రం కంటే తక్కువ సీట్లు ఉండటంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

By - Satya P
Update: 2026-11-28 02:41 GMT

డీలిమిటేషన్ బిల్లు విషయం తీసుకుంటే దేశంలోని 28 రాష్ట్రాలు అలాగే 8 కేంద్ర పాలిత ప్రాంతాలకూ సరిసమానంగా న్యాయం చేసేదిగా రూపొందించారు. ఆ క్రమంలో ఏపీలో ఉన్న అసెంబ్లీ సీట్లు 175 నుంచి 263 గా పెరుగుతాయి. అలాగే తెలంగాణాలో 117 నుంచి 179 దాకా పెరగవచ్చు. అంతవరకూ బాగానే ఉంది. కానీ విభజన హామీ మేరకు ఏపీకి ఎపుడో 225 దాకా సీట్లు అలాగే తెలంగాణాకు 154 దాకా సీట్లు పెరగాల్సి ఉంది. అవి పెరిగిన పక్షంలో ఇపుడు డీలిమిటేషన్ తో కచ్చితంగా ఏపీకి 340 సీట్లుగా తెలంగాణాకు 230 గా సీట్లు పెరుగుతాయి. అదే జరిగితే మిగిలిన రాష్ట్రాలతో సమానంగా ఏపీ తెలంగాణా నిలిచేవి. కానీ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు అసెంబ్లీ సీట్లు గత పుష్కర కాలంగా కేంద్రం పెంచలేదు. ఇపుడు అన్ని రాష్ట్రాలతో సమానంగా ఏపీ తెలంగాణకు 50 శాతం సీట్లు పెరుగుతున్నాయని అంటున్నారు.

ఆ గ్యాప్ అలాగే మరి :

డీలిమిటేషన్ బిల్లు వల్ల పెరిగే సీట్లతో తమిళనాడు, కర్ణాటక కంటే కూడా ఏపీ అలాగే వెనకబడి ఉంటుంది. ఉదాహరణకు తమిళనాడు తీసుకుంటే ఇపుడు 234 దాకా అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. కర్ణాటకలో 224 దాకా సీట్లు ఉన్నాయి అని గుర్తు చేస్తున్నారు. ఇపుడు డీలిమిటేషన్ తో తమిళనాడు అసెంబ్లీ సీట్లు 351 సీట్లుగా మారుతాయి. కర్ణాటకలో చూస్తే 336 సీట్లు అవుతాయి. ఏపీలో 263 సీట్లు పెరిగినా కూడా ఈ రెండు రాష్ట్రాలే దక్షిణాదిలో పెద్దవిగా ఉంటాయి అని అంటున్నారు. ఒక విధంగా విభజన చట్టం ప్రకారం 2014 తరువాత ఏపీ తెలంగాణాలో అసెంబ్లీ సీట్లు పెంచకపోవడం వల్ల వచ్చిన ఉపద్రవం ఇది అని అంటున్నారు.

భొగోళికంగా ఏపీ చూస్తే :

ఇదిలా ఉంటే ఏపీ భౌగోళికంగా పెద్దది. అది తమిళనాడు కంటే పెద్దదిగా, అలాగే కర్ణాటకతో పోలిస్తే దాదాపు సరిసమానంగా ఉంటుంది అని అంటున్నారు. భౌగోళిక విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కంటే పెద్దదిగానూ, కర్ణాటకకు దాదాపు దగ్గరగానూ రెండో స్థానంలో ఉంది. దక్షిణ భారతదేశంలో విస్తీర్ణం పరంగా కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో, తమిళనాడు మూడో స్థానంలో ఉన్నాయి. దీనిని కనుక చదరపు కిలోమీటర్ల లెక్కన చూస్తే కర్ణాటక 1 లక్ష 91 వేల 791 కిలోమీటర్లతో దేశంలో ఆరవ స్థానంలో ఉంది. ఇక ఏపీ ఒక లక్షా 62 వేల 975 కిలోమీటర్లతో ఏడవ స్థానంలో ఉంది. తమిళనాడు ఒక లక్షా 30 వేల 58 కిలోమీటర్ల్తో పదవ స్థానంలో ఉంది. అలా తమిళనాడుతో పోలిస్తే. ఆంధ్రప్రదేశ్ సుమారు 32,917 చదరపు కిలోమీటర్లు ఎక్కువ విస్తీర్ణాన్ని కలిగి ఉంది.

ఏపీకి వివక్షనేనా :

కానీ అసెంబ్లీ సీట్లు తమిళనాడుకు డీలిమిటేషన్ తరువాత 351 దాకా ఉండబోతున్నాయి. ఏపీకి 263 గానే ఉంటాయి. అంటే తొంబై సీట్ల తేడా వస్తోంది. కర్ణాటకకు ఏపీకి మధ్య చూస్తే సుమారు 28,816 చదరపు కిలోమీటర్లు ఎక్కువగా కర్ణాటక ఉంది. కానీ అసెంబ్లీ సీట్లు డీలిమిటేషన్ తరువాత ఏకంగా 330 దాకా పెరుగుతాయి. అదే ఏపీలో 263 అంటే ఇక్కడ కూడా దాదాపుగా డెబ్బై సీట్లు ఏపీకి తక్కువగా ఉంటాయన్న మాట. మరి ఇది వివక్ష కాదా అన్నది ఏపీని అభిమానించే వారంతా ప్రశ్నిస్తున్న విషయంగా ఉంది. ఏపీకి దక్షిణాదిన ఎక్కడా ఏ రాష్ట్రంలో లేని విధంగా తీరప్రాంతం. విస్తీర్ణంతో పాటు, ఆంధ్రప్రదేశ్ దాదాపు 974 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరాన్ని కలిగి ఉండి, దేశంలో గుజరాత్ తర్వాత రెండవ అతిపెద్ద తీరప్రాంత రాష్ట్రంగా నిలిచింది. మరి అలాంటి అలాంటి ఏపీ ఇప్పుడు దక్షిణాదిన తమిళనాడు కర్ణాటక తరువాత మూడవ ప్లేస్ లోనే ఉండటం అంటే ఇది అసంబంధమైన సీట్ల పెంపు అలాగే కేటాయింపుగానే చూస్తున్నారు.

Tags:    
  • delimitation 
  • delimitationbill 
  • andhrapradesh 
  • appolitics 
  • assemblyseats 

Similar News

రుషికొండ ప్యాలెస్ దశను మార్చేలా కూటమి డెసిషన్

2026-11-28 02:39 GMT

తేడా ఎక్కడ కొట్టింది... జనసేనలో అంతర్మధనం

2026-11-27 17:14 GMT

జనసేన సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్...పంచాయతీలలో సీన్ రివర్స్ !

2026-11-27 17:11 GMT

పంచాయితీ సమరం : టీడీపీ ఎందుకు గెలిచింది? వైసీపీ ఎందుకు ఓడింది?

2026-11-27 12:21 GMT

గ్రామాల్లో వైసీపీకి గడ్డుకాలం.. జగన్‌కు అసలు పరీక్ష ఇప్పుడే మొదలైందా?

2026-11-27 09:31 GMT

డీలిమిటేషన్ బిల్లుకు వైసీపీ మద్దతు.. కానీ ఒక షరతు!

2026-11-27 07:57 GMT

పంచాయ‌తీ ఫ‌లితం: వైసీపీ పుంజుకుందా?

2026-11-27 05:52 GMT

''మేం అధికారంలోకి వ‌స్తే.. వాళ్ల‌ను చెప్పుల‌తో కొడ‌తాం''

2026-11-27 03:58 GMT

జగన్ పాదయాత్రకు పోటీగా షర్మిల...విజయసాయి ?

2026-11-27 03:57 GMT

కలసి ఉండాల్సిందే...బాబు పవన్ బీజేపీ ఈక్వేషన్స్ ఇవే !

2026-11-27 02:30 GMT

షర్మిలకు వైఎస్ ఇచ్చిన ఆస్తులు ... చిట్టా విప్పిన రాచమల్లు

2026-11-27 02:30 GMT

Copyright @2026

Powered by Blink CMS