• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వైఎస్సార్ పేరు...

వైఎస్సార్ పేరు చెడగొట్టారు...నియంతగా మారారు...!

| వైఎస్సార్ పాలనకు వైసీపీ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు

By - Tupaki Desk
Update: 2024-01-25 09:42 GMT

వైఎస్సార్ పాలనకు వైసీపీ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వైఎస్సార్ పేరుని జగన్ చెడగొట్టారని ఆమె మండిపడ్డారు. జగన్ బీజేపీకి బానిసగా మారిపోయారు అని ఆమె ఘాటు ఆరోపణలు చేశారు.

అయిదేళ్ళ జగన్ పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆమె ఫైర్ అయ్యారు. ఏపీలో అంతా దారుణమే ఉందని ఆమె అంటున్నారు. సంక్షేమ పథకాలకు జగన్ తూట్లు పొడిచారు అని ఆమె అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ ఆనవాళ్ళు ఎక్కడా కనిపించడంలేదని ఆమె అన్నారు.

జగన్ తనకు వ్యక్తిగతంగా నష్టం చేశారు. అయినా రాష్ట్రానికి అయినా మేలు చేస్తారు అని ఇన్నాళ్ళు భరించాను అని ఆమె అన్నారు. అయితే చివరికి జగన్ ఏపీకి ఏమీ చేయలేదని తెలిసే తాను రంగంలోకి దిగాను అని ఆమె అంటున్నారు.

పోలవరం ప్రాజెక్ట్ అన్నది వైఎస్సార్ కల అని ఆమె అన్నారు. దాన్ని 1941లోనే నిర్మించాలనుకున్నప్పటికీ ఏ ఒక్క నేత కూడా సాహసించలేకపోయారు అని ఆమె అన్నారు. వైఎస్సార్ మాత్రమే దాన్ని బయటకు తీసి మంచి సంకల్పంతో నిర్మించాలని అనుకున్నారని అన్నారు. వైఎస్సార్ సీఎం అయిన ఆరు నెలలలోనే పోలవరం ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారని షర్మిల గుర్తు చేసారు.

అలాంటి పోలవరం విషయంలో 2021లో పూర్తి చేస్తామని చెప్పిన జగన్ ఈ రోజు ఏమి జవాబు చెబుతారు అని ఆమె ప్రశ్నించారు. వైఎస్సార్ హయాంలో వ్యవసాయం పండుగ అయితే జగన్ ఏలుబడిలో అది దండుగ వ్యవహారంగా మారిందని ఆమె ఆక్షేపించారు.

జగన్ నియంత మాదిరిగా మారిపోయారు అని ఆమె విమర్శించారు. పెద్ద కోటలు కట్టుకుని ఎమ్మెల్యేలకు కూడా ఆయన అసలు కనిపించరని ఆమె దుయ్యబెట్టారు. ఎంతో మంది రెక్కల కష్టంతో జగన్ సీఎం అయ్యారు అని ఆమె అంటున్నారు. అయితే తన పక్కన ఉన్న అందరినీ ఈ రోజు జగన్ దూరం చేసుకుంటున్నారు అని ఆమె విమర్శించారు.

వైఎస్సార్ ప్రభుత్వంతో జగన్ ప్రభుత్వాన్ని అసలు ఏ కోశానా పోల్చడానికి వీలు లేదని అన్నారు. తన కోసం వైసీపీ కోసం కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వచ్చిన 18 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తామని చెప్పిన జగన్ ఇచ్చారా అని ఆమె నిలదీశారు.

ఇక వైఎస్సార్ కుటుంబంలో చీలిక తేవడానికి కాంగ్రెస్ చూస్తోందని జగన్ తిరుపతిలో జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ కంక్లేవ్ లో మట్లాడుతూ ఘాటు విమర్శలు చేశారు. అయితే దానికి షర్మిల గట్టిగా జవాబు ఇచ్చారు. అసస్లు వైఎస్సార్ కుటుంబం చీలిపోవడానికి కారణం వైఎస్ జగన్ అని ఆమె విమర్శించారు. ఈ విషయంలో ఆ దేవుడు తన తల్లి వైఎస్సార్ సతీమణి విజయమ్మ సాక్ష్యం అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను జగన్ కోసం ఎంతో కష్టపడ్డాను అని ఆమె అంటున్నారు. తాను ఏకంగా 3,200 కిలోమీటర్ల పాదయాత్ర కూడా అప్పట్లో చేశాను అని అన్నారు. తన కుటుంబం అని కూడా చూసుకోకుండా అన్న పిలిస్తే వెంటనే వచ్చి వైసీపీ కోసం పనిచేశాను అని ఆమె గతం గుర్తు చేశారు. అయితే చివరికి తనకూ అన్యాయం అవమానం జరిగింది అని ఆమె అంటున్నారు మొత్తం మీద చూస్తే జగన్ మీద సొంత చెల్లెలు నిప్పులు చెరగడంవే విశేషం.


Tags:    
  • Ycpgovernment 
  • Jagan 
  • APPolitics 
  • Sharmila 
  • Congress 
  • Apelections 
  • Appccchief 
  • Yssharmila 

Similar News

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

Copyright @2026

Powered by Blink CMS