పొలిటికల్ టాక్: ఎవరి.. ముసుగు తొలగించాలి
అప్పటి నుంచి ఇప్పటి వరకు రామ్‌నాథ్ కోవింద్ నుంచి ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరకు, నాటి ఉపరాష్ట్రపతి నుంచి నేటి ఉపరాష్ట్రపతి అభ్యర్థి వరకు కూడా వైసీపీ క్లియర్‌గానే ఉంది.;
కాంగ్రెస్ పార్టీ ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై పొలిటికల్ సర్కిళ్లలో ఆసక్తికర చర్చ సాగుతోం ది. వైసీపీపై ఆమె ఇప్పటి వరకు అనేక ఆరోపణలు చేశారు. కానీ, ఇవి వ్యక్తిగత వ్యవహారం.. అన్నపై ఉన్న ఆస్తుల కోపం కావడంతో ఎవరూ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. విమర్శలు కూడా చేయలేదు. కానీ, తాజా గా వైసీపీ ముసుగు తొలగిందని.. ఎన్డీయేకు, మోడీకి వైసీపీ మద్దతు దారని ఆమె విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. వైసీపీ ముసుగు తొలగిందని కూడా వ్యాఖ్యానించారు.
రాజకీయాల్లో ఉన్నప్పుడు.. ఎవరికో ఒకరికి మద్దతు తప్పదు. పైగా కేంద్రంలో మోడీ వచ్చిన తర్వాత.. దా దాపు దేశవ్యాప్తంగా ఏదో ఒక పార్టీకి ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందు కే.. ఏపీలో వైసీపీ పైకి చెప్పకపోయినా.. 2014 నుంచే ఒక స్పష్టమైన స్టాండ్ తీసుకుంది. కాంగ్రెస్ యేతర కూటమికి మద్దతిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తమకు ద్రోహం చేసిందని, అందుకే.. తాము ఎన్డీయేకు మద్దతిస్తు న్నామని.. తాజాగా వైసీపీ ప్రకటించింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు రామ్‌నాథ్ కోవింద్ నుంచి ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరకు, నాటి ఉపరాష్ట్రపతి నుంచి నేటి ఉపరాష్ట్రపతి అభ్యర్థి వరకు కూడా వైసీపీ క్లియర్‌గానే ఉంది. ఇక, పార్లమెంటు లోనూ ఒక్క వక్ఫ్ బిల్లుకు తప్ప.. ఇతర అన్ని బిల్లులకు జగన్ పార్టీ మద్దతు తెలుపుతూనే ఉంది. సో.. పైకి చెప్పినా.. చెప్పకపోయినా.. వైసీపీ స్టాండ్-సిట్-అనేది ఏ పార్టీతోనో.. ఏ కూటమితోనో.. అర్ధమవుతూనే ఉం ది. ఈ క్రమంలో వైసీపీపై షర్మిల చేస్తున్న వ్యాఖ్యల్లో పెద్దగా పస కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.
ఇదేసమయంలో ఎన్డీయే పై పన్నెత్తు మాట అనకపోవడం.. తన సమస్యలపై తప్ప ప్రజల సమస్యలపై పోరాడకపోవడం ద్వారా షర్మిల ఎలాంటిసందేశం ఇస్తున్నారన్నది కూడా ప్రశ్నగా మారింది. అందుకే.. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో షర్మిల వ్యవహారం ఆసక్తిగా మారింది. ఆమెఎవరిని వదిలి ఎవరిని టార్గెట్ చేస్తున్నారన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఇప్పటికి దీనికి సమాధానం ఆమె నేరుగా చెప్పకపోయినా.. రాజకీయంగా వేస్తున్న అడుగులు, చేస్తున్న విమర్శలు మాత్రం షర్మిలను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నాయి. సో.. ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది.. ముసుగులు తొలగించాల్సింది .. షర్మిలేనన్నది వైసీపీ మాట.